భారతదేశంలో ఇతర సీజన్ లతో పోలిస్తే శీతాకాలం కాస్త ఆహ్లాదకరంగానే ఉంటుంది. వెచ్చని స్వెటర్ లు, పొడవాటి హుడీ జాకెట్లు, హిమపాతంలో అడ్వెంచర్లు, విహారయాత్రలకు ఇది చాలా మంచి సీజన్. అదే సమయంలో ఈ సీజన్ కొన్ని కష్టనష్టాలను కలిగిస్తుంది.
ముఖ్యంగా వాయు కాలుష్యం అనేది ఈ కాలంలో ఇబ్బంది పెట్టే ప్రధాన సమస్య. ఈ గాలి కాలుష్యం అనేది ఏడాది పొడవునా ఉంటుంది, అయితే శీతాకాలంలో మాత్రం దీనితో ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ సీజన్ లో వాతావరణం చల్లగా, పొడిగా ఉంటుంది. ఈ చల్లని గాలి, వేసవిలో వీచేటు వంటి వేడి గాలుల కంటే నెమ్మదిగా కదులుతుంది. అలాగే మగమంచు కారణంగా గాలి మరింత దట్టంగా మారి కాలుష్య కారకాలను పట్టుకొని ఉంటుంది. దీనివల్ల వీచే గాలి అంతా చాలావరకు కాలుష్య కారకాలతో నిండి ఉంటుంది.
ఈ గాలిని పీల్చడం వలన శ్వాస సంబంధ సమస్యలు ఎక్కువవుతాయి. ఉబ్బసం, జలుబు, దగ్గు, బ్రోంకైటిస్, న్యుమోనియా, ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్, హృదయ సంబంధ సమస్యలు తలెత్తుతాయి. ఆస్తమా ఉన్నవారికి ఇంకా కష్టంగా ఉంటుంది.
శీతాకాలపు పొగమంచు తల నుండి కాలి వరకు మానవ శరీరంపై ప్రభావం చూపుతుంది. ఈ పొగమంచుతో అంటువ్యాధులు, స్ట్రోక్, ఛాతీ నొప్పి, ఉబ్బసం, కంటి సమస్యలు, ముక్కు సమస్యలు, గొంతులో చికాకు మొదలుకొని క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD), ఊపిరితిత్తుల క్యాన్సర్, ఎంఫిసెమాకు వంటి తీవ్రమైన అనారోగ్యాలకు దారితీస్తుంది. అంతిమంగా, ఈ అనారోగ్యాలు ఊపిరితిత్తులను దెబ్బతీసి, మరణాల రేటును పెంచుతాయి. ఇప్పటికే ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు ఈ శీతాకాలంలో బయట తిరగేటపుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉండండి. ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆనందం ఉంటుందని గ్రహించండి.
సంబంధిత కథనం