Aloe Vera Benefits: బరువు తగ్గాలన్నా.. అందం పెరగాలన్నా.. కలబంద గుజ్జుతోనే సాధ్యం-aloe vera benefits for weight loss and hair and beauty care here is the tips ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Aloe Vera Benefits For Weight Loss And Hair And Beauty Care Here Is The Tips

Aloe Vera Benefits: బరువు తగ్గాలన్నా.. అందం పెరగాలన్నా.. కలబంద గుజ్జుతోనే సాధ్యం

Jan 10, 2023, 12:11 PM IST Geddam Vijaya Madhuri
Jan 10, 2023, 12:11 PM , IST

  • Aloe Vera Benefits : కలబంద వల్ల బరువు తగ్గడం మొదలు, జుట్టు రాలడం, పొడిబారిన చర్మాన్ని నివారించడం వంటి నాలుగు ప్రధాన ప్రయోజనాలు ఉన్నాయి. అయితే దీనిని ఎప్పుడూ ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటే.. చాలా బెనిఫిట్స్ పొందవచ్చు అంటున్నారు. 

ఇంట్లో పెరిగే మొక్కలలో కలబంద మొక్కలు ముఖ్యమైనవి. ఇవి అనేక ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఇందులో విటమిన్లు, ఎంజైములు, మినరల్, షుగర్, లిగ్నిన్, సపోనిన్, సాలిసిలిక్ యాసిడ్, అమినో యాసిడ్ మొదలైనవి పుష్కలంగా ఉన్నాయి. ఇందులో విటమిన్ ఎ, సి, ఇ పుష్కలంగా ఉన్నాయి, ఇది అద్భుతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.

(1 / 5)

కలబంద చర్మంలో తేమను నిలుపుకోవడానికి సహాయపడుతుంది. చర్మం ముడతల సమస్య ఉన్నవారు అలోవెరా జెల్‌ను ఉపయోగించవచ్చు. అలోవెరా జెల్‌ను తేనె, పాలు, పసుపుతో కలిపి ఫేస్ మాస్క్‌గా అప్లై చేయండి. ఇది మొటిమల చికిత్సలో కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. కలబంద ఆకుకూరల రసం, పెరుగు మిక్స్ చేసి పొడి చర్మంపై అప్లై చేయడం వల్ల మెరుపు వస్తుంది.

(2 / 5)

అలోవెరా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్, అమినో యాసిడ్, ఎంజైములు, స్టెరాల్స్ పుష్కలంగా ఉన్నాయి. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కలబంద రసాన్ని తాగితే.. వారంలో శరీర బరువులో మార్పును గమనించవచ్చు.

(3 / 5)

అలోవెరా జ్యూస్‌లో ప్రొటీయోలైటిక్ ఎంజైమ్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి స్కాల్ప్ సెల్స్‌కు మేలు చేస్తాయి. కాబట్టి అలోవెరాను జుట్టుకు రాసుకోవడం వల్ల జుట్టుకు బలం చేకూర్చి.. చుండ్రు తగ్గుతుంది. స్కాల్ప్ పై ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది. ముఖ్యంగా జుట్టును చాలా స్మూత్ గా మార్చుతుంది.

(4 / 5)

కలబందలో ఉండే జిగట పసుపు పదార్థం మలబద్దకానికి అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. అంతే కాకుండా జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలకు ఇది మంచి మందుగా చెప్పవచ్చు. 

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు