Curly Hair Routine । రింగుల జుట్టును దువ్వడం కష్టంగా ఉందా? ఈ చిట్కాలు పాటించండి!
Curly Hair Routine: రింగుల జుట్టు ఉంటే అందంగా ఉంటుంది, కానీ అది చిక్కులు పడితే దువ్వటానికి జీవితకాలం పడుతుంది. రింగుల జుట్టు, చిక్కులు పడిన జుట్టు సంరక్షణ కోసం ఈ చిట్కాలు పాటించండి.
Curly Hair Routine: జుట్టు చిట్లడం, చిక్కులుపడటం అనేది ప్రతిరోజూ ఇబ్బంది పెట్టే ఒక సాధారణ సమస్య. చిక్కుబడ్డ జుట్టును విప్పడం చాలా కష్టం. దువ్వెన ఉపయోగిస్తే జుట్టు విరిగిపోవడం, రాలిపోవడం జరుగుతుంది. రింగుల జుట్టు ఉంటే ఈ జుట్టు చిక్కులను విడదీయడానికే జీవితకాలం సరిపోతుంది. అయితే సరైన జుట్టు సంరక్షణ ద్వారా దీనిని నివారించవచ్చు. తడిగా ఉన్న వెంట్రుకలను దువ్వుకోకపోవడం, వేడి ఉత్పత్తులను జుట్టుపై ఉపయోగించకపోవడం మొదలైనవి అంశాలు జుట్టు ఆరోగ్యంలో కీలకం. చిక్కులు పడ్డ జుట్టు విడదీయడం ఎలాగో ఇక్కడ చూడండి.
నూనె రాయండి
హెయిర్ వాష్ తర్వాత చాలా మందికి జుట్టు చిక్కుకుపోతుంది. ఇలాంటప్పుడు జుట్టును షాంపూ చేసే ముందు తలకు నూనెను బాగా మసాజ్ చేయండి. కొబ్బరి నూనె లేదా ఆవ నూనెను ఉపయోగించడం చాలా మంచిది. ఈ నూనెలు జుట్టు మందాన్ని పెంచడంతో పాటు, జుట్టును వదులుగా చేస్తాయి.
లేదా బాదం నూనె, అలోవెరా జెల్ మిశ్రమాన్ని అప్లై చేయండి. తలకు అప్లై చేసిన తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.
మాయిశ్చరైజింగ్ చేయండి
పొడి, చిట్లిన జుట్టును స్ట్రెయిట్ చేయడానికి మాయిశ్చరైజింగ్ షాంపూని ఉపయోగించండి. అనంతరం కండీషనర్‌ను వాడండి. దీనివల్ల జుట్టు స్మూత్‌గా మారుతుంది. మీరు బియ్యం కడిగిన గంజి నీటిని ఉపయోగించినా మీ జుట్టు హెల్తీగా మారుతుంది.
హెయిర్ మాస్క్
వెంట్రుకలు పొడిబారడం వల్ల జుట్టు ఎక్కువగా చిక్కులు పడుతుంది. జుట్టులో తేమ లేనపుడు నిర్జీవంగా, సుడులు సుడులుగా అల్లుకుపోతుంది. అందువల్ల అప్పుడప్పుడు జుట్టుకు హెయిర్ మాస్క్ వేయడం చాలా ముఖ్యం. మీరు ఇంట్లోనే హెయిర్ మాస్క్ వేసుకోవచ్చు. పెరుగు-తేనె కలగలిసిన హెయిర్ మాస్క్‌లు జుట్టును మృదువుగా, బలంగా మార్చగలవు.
సీరం అప్లై చేయండి
హెయిర్ వాష్ తర్వాత, మీరు తప్పనిసరిగా కండీషనర్ ఉపయోగించాలి. జుట్టు బాగా పొడిగా ఉంటే ఆయిల్ బేస్డ్ షాంపూ ఉపయోగించండి. దీనితో, షాంపూ చేసుకొని జుట్టును నీటితో కడిగిన తర్వాత సీరం ఉపయోగించండి. తడి జుట్టు మీద మాత్రమే ఇలా చేయండి. ఆపై మీరు మీ జుట్టును మీకు కావలసిన విధంగా స్టైల్ చేయాలనుకుంటే హెయిర్ మిస్ట్ చేయండి.
మైక్రోఫైబర్ టవల్ ఉపయోగించండి
మైక్రోఫైబర్ టవల్‌తో మీ జుట్టును మృదువుగా తుడవండి. ఈ టవల్‌తో జుట్టును తడపండి. తర్వాత ఒక శుభ్రమైన కాటన్ క్లాత్ తీసుకుని మీ తల నుంచి మిగిలిన నీటిని తుడిచేయండి. తర్వాత జుట్టును కాసేపు ఆరనివ్వాలి. ఇది జుట్టుకు మంచి ఫలితాలను ఇస్తుంది. కేశాలంకరణ మెరుగ్గా ఉంటుంది.
సంబంధిత కథనం
టాపిక్