తెలుగు న్యూస్ / ఫోటో /
Makar Sankranti Lucky Vastu Tips : ఉదయాన్నే తలస్నానం చేసి వాటిని దానం ఇస్తే.. ఆర్థిక సమస్యలు ఉండవట..
- Makar Sankranti Lucky Vastu Tips : మకర సంక్రాంతి రోజున ఇంట్లో విష్ణువు, సూర్యుడిని పూజిస్తే మంచిది అంటున్నారు. ఈరోజు కొన్ని విషయాలు పాటించడం వల్ల ఆర్థిక సమస్యలు దూరమవుతాయి అంటున్నారు. ఇంతకీ ఆర్థికాభివృద్ధి సాధించాలంటే ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

(1 / 4)
మకర సంక్రాంతిని 2023 జనవరి 15న జరుపుకుంటున్నారు. ఈ మకర సంక్రాంతి కోరికలను నెరవేర్చడానికి, ఆర్థిక అదృష్టాన్ని పెంచడానికి అనేక మార్గాలను కలిగి ఉంటుంది. అందుకే మకర సంక్రాంతి రోజు కొన్ని విషయాలు పాటిస్తే.. మీకు ఆర్థికంగా కలిసి వస్తుంది అంటున్నారు.
(2 / 4)
ఇత్తడితో చేసిన సూర్యుడిని.. మకర సంక్రాంతి రోజున ఇంటికి తీసుకురావడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇది ఆనందం, శాంతిని తెస్తుంది. ఇంటికి తూర్పు వైపున ఇత్తడి సూర్యుడిని ఉంచడం వల్ల కుటుంబంలో సంపద సమస్యలు తొలగుతాయని చెప్తారు.
(3 / 4)
మకర సంక్రాంతి రోజున ఇంట్లో విష్ణువు, సూర్యుడిని పూజించండి. అప్పుడు డబ్బు నుంచి వృత్తికి ప్రకాశం వస్తుంది. అదృష్టం మునుపటి కంటే ఎక్కువగా ఉంటుంది. చాలా రోజులుగా నిలిచిపోయిన పనులు ఈ మకర సంక్రాంతి రోజున పూర్తవుతాయి.
(4 / 4)
మకర సంక్రాంతి రోజున మీరు పేదలకు దుప్పట్లు లేదా శీతాకాలపు బట్టలు దానం చేయవచ్చు. ఇది మీకు సుభిక్షాన్ని కలిగిస్తుందని అంటారు. అలాగే తలస్నానం చేసి తెల్లవారుజామున ఎవరికైనా నువ్వులు ఇస్తే ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా.. ఈ రోజున మీరు పేదలకు అన్నం, పప్పు దానం చేస్తే.. ఆహార కొరత తొలగిపోతుందని నమ్ముతారు. (PTI)
ఇతర గ్యాలరీలు