Mustard Oil Benefits: ఆవాల నూనె.. కీళ్ల నొప్పుల నుంచి అందం పెంచుకోవడం వరకు..
Mustard Oil Benefits: ఆవాల నూనె గురించి మీరు వినే ఉంటారు. కానీ రోజూ వారీ జీవితంలో దానిని ఎక్కువగా ఉపయోగించరు. కానీ దానిగురించి పూర్తిగా తెలిస్తే.. మీరు కచ్చితంగా మీ డైలీ రొటీన్లో దానిని భాగం చేసుకుంటారు. మరి దాని ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Mustard Oil Benefits : బ్యూటీ నుంచి హెల్త్ వరకు ఆవాల నూనెతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దానిని మీ దినచర్యలో భాగం చేసుకుంటే.. మీకు అనేక ప్రయోజనాలు ఉంటాయి. మరి మీ దినచర్యకు ఆవాల నూనెను ఏ విధంగా ఉపయోగించవచ్చో.. దాని వల్ల కలిగే లాభాలు ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టు పెరుగుదలకు ఉత్తమమైనది
ఆవాల నూనెను ఉపయోగించాలనే ఆలోచన మీరు "ewww" అనే పదాన్ని ఉచ్చరించేలా చేస్తుంది. ఎందుకంటే ఇది బలమైన వాసనను కలిగి ఉంటుంది. కానీ మీ జుట్టుకు ఇది చేసే బెనిఫిట్స్ అన్ని ఇన్ని కాదు. ఇది వేడిని ఉత్పత్తి చేస్తుంది. తలలో రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడుతుంది. కాబట్టి ఇది జుట్టు పెరుగుదలను ప్రేరేపించడంలో సహాయం చేస్తుంది. అదనంగా ఇది అనేక జుట్టు సమస్యలకు చికిత్స చేస్తుంది. మీ జుట్టును బలపరుస్తుంది. అంతేకాకుండా మెరుగైన పోషణను ఇస్తుంది.
చెవి దురద నుంచి ఉపశమనం
యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల కారణంగా.. ఆవ నూనె చెవి ఇన్ఫెక్షన్లు, దురద వంటి సాధారణ వ్యాధులకు చికిత్స చేస్తుంది. అదనంగా ఇది చెవిలోని డస్ట్‌ను మృదువుగా చేస్తుంది. దానిని ఉబ్బేలా చేస్తుంది. దానిని సులభంగా తొలగించవచ్చు. దీనివల్ల మీ చెవులు ఆరోగ్యంగా ఉండటానికి, ప్రతి చెవిలో దానిని 5 చుక్కలు వేయండి. కానీ చెవిలో నూనె వేసుకునే ముందు.. చెవి సమస్యలు ఉన్నవారు ముందుగా డాక్టర్‌ను సంప్రదించండి.
చర్మానికి మేలు చేస్తుంది
మస్టర్డ్ ఆయిల్ మీ చర్మానికి చాలా బెనిఫిట్స్ అందిస్తుంది. ఇందులో అనేక విటమిన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ ఉన్నాయి. ఇవన్నీ డార్క్ స్పాట్స్, మొటిమల మచ్చలను తగ్గించడంలో సహాయం చేస్తాయి. చర్మపు రంగును మెరుగుపరుస్తాయి. మీ చర్మాన్ని మృదువుగా చేసి.. పూర్తిగా హైడ్రేట్ చేస్తాయి. రాత్రి సమయంలో మీరు నేరుగా దీనిని అప్లై చేసుకోవచ్చు. ఉదయాన్నే మీ ముఖాన్ని చన్నీటితో కడగండి.
కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం
రెగ్యులర్ ఆవాల నూనె మసాజ్‌లు కీళ్ల లేదా కండరాల అసౌకర్యాన్ని తగ్గించగలవు. నిజానికి ఇందులో ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్, ఒక రకమైన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉన్నందున కీళ్ల దృఢత్వం, కండరాల అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఆర్థరైటిస్ రోగులు కూడా దీని నుంచి ఉపశమనం పొందవచ్చు. అదనంగా ఇది వాపును తగ్గిస్తుంది.
వంట కోసం
సరైన వంట నూనెను ఎంచుకోవడం మీ మొత్తం ఆరోగ్యానికి సహాయం చేస్తుంది. ఆవనూనెలో అవసరమైన విటమిన్లు, మినరల్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉండటం వల్ల వంటగదిలో ఇది చాలా అవసరం. అదనంగా ఇది తక్కువ సంతృప్త కొవ్వును కలిగి ఉంటుంది. వంట రుచిని మెరుగుపరచడంతో పాటు.. ఇది చర్మం, జుట్టు, కీళ్లు, కండరాలు, గుండెను ప్రభావితం చేసే వివిధ పరిస్థితులకు కూడా చికిత్స చేస్తుంది.
సంబంధిత కథనం