Hair Growth Food : జుట్టు రాలుతుందా? హెల్తీ హెయిర్ గ్రోత్ కోసం ఇవి తీసుకోవాలి
Hair Growth Tips : బట్టతల, జుట్టు రాలడం అనేది పురుషులకు అన్నింటికంటే పెద్ద సమస్య. దాని మీదే ఆలోచనలు ఉంటాయి. దీంతో మనసు దేని మీద పెట్టలేరు. అయితే కొన్ని ముందు జాగ్రత్య చర్యలతో నివారించొచ్చు.
ఏ సమస్యకైనా చికిత్స కంటే.. ముందు జాగ్రత్త చర్యలతో నివారణ ఉత్తమమైనది. చాలా మంది యువకులు జుట్టు రాలడం(Hair Loss), బట్టతల(Bald Head) సమస్యలు ఎదుర్కొంటారు. దీంతో డిప్రెషన్ లోకి కూడా వెళ్తారు. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకుంటే.. నివారించొచ్చు. మీ జుట్టు రాలడం తగ్గించొచ్చు. ఆరోగ్యకరమైన వెంట్రుకలు పెరుగుతాయి.
ప్రతి సమస్య డీహైడ్రేషన్(dehydration)తో మొదలవుతుంది. అందుకే తగినంత నీరు తాగాలి. మీరు తగినంత నీరు తీసుకుంటే మీ శరీరంలోని మొత్తం అవయవాలు సరిగ్గా పని చేస్తాయి. చాలా త్వరగా బరువు తగ్గడం కూడా జుట్టు రాలడంతో ముడిపడి ఉంటుంది.
ఏదైనా తినెప్పుడు.. ప్లేట్‌లో కరివేపాకులను తీసి పడేస్తారు. అయితే కరివేపాకు మంచి జుట్టు పెరుగుదలకు చాలా సహాయకారిగా ఉంటుంది. ప్రోటీన్, బీటా కెరోటిన్ ఉండటం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. ఇది యాంటీఆక్సిడెంట్లు, అమినో యాసిడ్స్ సహాయంతో స్కాల్ప్‌ను హైడ్రేట్ చేయడం, హెయిర్ ఫోలికల్స్‌ను బలోపేతం చేయడంపై కూడా పని చేస్తుంది. కాబట్టి, కరివేపాకులను క్రమం తప్పకుండా తీసుకోవాలి.
మీ ఆహారం(Food)లో ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ ఇన్ఫ్యూజ్ చేయడం జుట్టు పెరుగుదలకు చాలా అవసరం. మీకు మంచి జుట్టు పెరుగుదల ఉండాలంటే.. తగినంత ప్రోటీన్-రిచ్ ఫుడ్స్(protein rich foods) జోడించండి. ప్రొటీన్ల వలె, విటమిన్ ఎ ఆరోగ్యకరమైన జుట్టుకు అవసరం. పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు, విటమిన్ ఎ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.
చుండ్రు, జుట్టు రాలడం పురుషులకు ప్రధాన సమస్యగా మారింది. ఇది వారికి బట్టతల వచ్చే భయాన్ని ఇస్తుంది. కానీ ఈ రెండూ జింక్ లోపం వల్ల వస్తాయి. అంటే మీరు జింక్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలి. కాబట్టి మీరు జింక్-రిచ్ ఫుడ్స్ కోసం చూస్తున్నట్లయితే, సీఫుడ్(Sea Food), పౌల్ట్రీ, గుల్లలు, రొయ్యలు, తృణధాన్యాలు, గింజలు, చిక్కుళ్ళు తినండి. గుడ్లు, పాలు కూడా తీసుకోవచ్చు.
మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి విటమిన్ సి అవసరం అయితే, మీ జుట్టు ఆరోగ్యానికి ఇది చాలా ముఖ్యం. ఇది జుట్టు కణజాలం అభివృద్ధిలో ప్రభావవంతంగా ఉంటుంది. మీ జుట్టు ఆరోగ్యంగా, బలంగా ఉంటుంది. కాబట్టి, నారింజ, బెర్రీలు, పుచ్చకాయలు, మిరియాలు, టమోటాలు, మొదలైనవి మీ ఆహారంలో చేర్చుకోవాలి.