తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sleeping Outside : అందరూ కలిసి ఆరుబయట పడుకుంటే అద్భుత ప్రయోజనాలు

Sleeping Outside : అందరూ కలిసి ఆరుబయట పడుకుంటే అద్భుత ప్రయోజనాలు

HT Telugu Desk HT Telugu

14 April 2023, 20:00 IST

google News
    • Sleeping Outside Benefits : గుర్తుందా.. చిన్నప్పుడు ఊర్లో.. అందరం కలిసి వేసవిలో ఆరుబయట నిద్రపోయేవాళ్లం. మనసుకు ఎంతో హాయి అనిపించేది. ఇప్పుడంతా పరిస్థితులు మారిపోయాయి. ఏసీ, కూలర్ ఆన్ చేసుకుని.. ఇంట్లో పడుకుంటే తృప్తి. కానీ ఆరుబయట పడుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unsplash)

ప్రతీకాత్మక చిత్రం

చిన్న వయసులో వేసవి(Summer) వస్తే చాలు.. ఊర్లో అందరి పడకలు ఆరుబయటే. ఊరంతా.. వారి వారి వాకిట్లో నిద్రపోయేది. పక్కింటి వాళ్లతో ముచ్చట్లు పెట్టుకుంటూ.. అలానే పడుకునేవారు. అటువైపు ఓ మంచం.. ఇటు వైపు ఓ మంచం.. భయపడకుండా మధ్యలో మీరు పడుకునేవారు. ప్రకృతి నుంచి వచ్చే చల్లని గాలి.. శరీరాన్ని తాకుతుంటే.. ఎప్పుడు నిద్ర(Sleeping)పోయేవాళ్లో కూడా గుర్తుండేది కాదు. అసలు మధ్యలో మెలకువ వచ్చే సందర్భాలే తక్కువ.

మరి ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. గతం ఎప్పుడూ అందంగానే ఉంటుంది. అందుకే అవన్నీ జ్ఞాపకాలుగానే మిగిలిపోయాయి. ఇప్పుడు ఊర్లోకి వెళ్లినా.. ఇంట్లోనే పడక. కానీ బయటపడకుంటే.. ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయని ఎప్పుడైనా ఆలోచించరా? ఆరుబయట పడుకోవడం వల్ల అనేక భావోద్వేగ ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

మీరు బాధాకరమైన సంఘటనను అనుభవించినా, సిటీలో బిజీ లైఫ్(Busy Life)తో పోరాడుతున్నా, మళ్లీ మీరు రీఛార్జ్ కావాలన్నా.. ఊర్లోకి వెళ్లినప్పుడు ఆరుబయటే పడుకోండి. లేదు మేం అంతా సిటీల్లోనే ఉంటాం అనుకుంటే.. అప్పుడప్పుడు క్యాంపింగ్‌కు వెళ్లి.. ప్రకృతి ఒడిలో నిద్రపోండి.

ఆరుబయట పడుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం మాత్రమే కాకుండా శారీరక ఆరోగ్యం(Body Health) కూడా మెరుగుపడుతుంది. బయట సమయం గడపడం, ప్రకృతికి మిమ్మల్ని మీరు బహిర్గతం చేయడం ద్వారా మీ రోగనిరోధక వ్యవస్థ బాగుపడుతుంది. ఒక ఉదాహరణ ఏంటంటే.. పార్క్‌లో కేవలం ఒక రోజు గడపడం వల్ల దాదాపు ఒక వారం పాటు రోగనిరోధక శక్తి(Immunity) మెరుగుపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాంటిది మీరు ప్రకృతి ఒడిలో ఆరుబయట నిద్రపోతే ఎంత లాభం.. ఒక్కసారి ఆలోచించండి. circadian rhythm

ఓ అధ్యయనం ప్రకారం.. ఆరుబయట నిద్రపోతే(outside Sleep).. సర్కాడియన్(circadian rhythm) సమయం రెండు గంటలు వెనక్కి మారిందని ఫలితాలు చూపించాయి. రెండు గంటల ముందుగానే పడుకుంటారు. ఉదయాన్నే లేస్తారు. సర్కాడియన్ రీసెట్ అనేది శరీరం యొక్క సహజమైన నిద్ర/మేల్కొనే చక్రాన్ని మార్చే ప్రయత్నం. ప్రతి వ్యక్తి అంతర్గత గడియారం వ్యక్తిగతంగా ఉంటుంది. కాంతి, ఉష్ణోగ్రత వంటి కారకాలు మీ సర్కాడియన్ రిథమ్‌(circadian rhythm)ను ప్రభావితం చేయగలవు. క్యాంపింగ్ లేదా ఇంటి బయట పడుకోవడం వల్ల సర్కాడియన్ రీసెట్ చేయడానికి ప్రయత్నించడం కొంచెం సులభం అవుతుంది.

నేటి విద్యుత్ దీపాల వాడకం, పెరిగిన సాంకేతికత వినియోగం నిద్ర చక్రాన్ని(Sleeping Cycle) ప్రభావితం చేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి.. మీరు పడుకునే ముందు.. కచ్చితంగా ఫోన్(Phone) చూస్తుంటారు. అదే ఆరుబయట అందరితో కలిసి పడుకుంటే.. ముచ్చట్లతో సమయం గడిచిపోతుంది. దీంతో మీరు ఫోన్ చూడటం తగ్గిపోతుంది. దీంతో మీకు కంటి సమస్యలు కూడా రావు. బయట ఎక్కువ సమయం గడపడం అంటే మీరు స్క్రీన్‌పై, కృత్రిమ కాంతిలో తక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారని, సహజ కాంతిని ఆస్వాదిస్తున్నారని అర్థం. కనీసం వేసవి(Summer)లో అయినా ఈ ప్రయత్నం చేయండి. ఇంట్లో వాళ్లతో ఆరుబయట పడుకుని మాట్లాడుతుంటే.. మీ మనసుకు హాయిగా అనిపిస్తుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

మనందరం జీవితంలో ఒత్తిడి(Stress)ని అనుభవిస్తాం. ఒత్తిడి మీ నాడీ వ్యవస్థను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ప్రకృతిలో గడిపిన సమయం, ఒత్తిడి తగ్గింపు మధ్య బలమైన సంబంధాన్ని సూచిస్తుంది. ప్రకృతిలో ఉండటం వల్ల వివిధ మార్గాల్లో ఒత్తిడి తగ్గుతుంది. ప్రకృతి శబ్దాలు, బహిరంగ నిశ్శబ్దం మానవులలో కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుందని నిరూపించబడింది. ప్రకృతి దృశ్యాలు కూడా ఓదార్పునిస్తాయి. జర్నల్ ఎన్విరాన్‌మెంట్ అండ్ బిహేవియర్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం చెట్లను చూడటం వల్ల ఒత్తిడి తగ్గుతుందని తేలింది. మీరు ఊర్లో బయట పడుకుంటే.. కావాల్సినన్నీ చెట్లు ఉంటాయి.

ఇక బయటపడకుంటే.. స్వచ్ఛమైన గాలిని(Pure Air) పీల్చుకోవచ్చు. అర్ధరాత్రి దాటిన తర్వాత.. చల్లటి గాలి వస్తుంది. ఇంట్లోని గాలి కంటే.. ఊర్లోని బయటి గాలి చాలా మంచిది. బయట సమయం గడపడం వల్ల మీ మానసిక స్థితి కూడా మెరుగుపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అందుకే వీలైతే.. ఊర్లోకెళ్లి ఆరుబయట పడుకోండి. కనీసం క్యాంపులకు వెళ్లేలా ప్లాన్ చేసుకోండి.

తదుపరి వ్యాసం