Telugu News  /  Telangana  /  Anasuya Eesha Rebba Unveils Virtusa Green Winds New Venture
హైదరాబాద్ శివారులో వర్చూస వెంచర్
హైదరాబాద్ శివారులో వర్చూస వెంచర్

Virtusa Green Winds : ప్రకృతి ప్రేమికుల కలల సౌధం కోసం వర్చూస గ్రీన్ విండ్స్ ప్రాజెక్ట్

06 February 2023, 18:18 ISTHT Telugu Desk
06 February 2023, 18:18 IST

Virtusa Green Winds : హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లా కడ్తాల్ - తలకొండపల్లి రోడ్డులో... వర్చూస గ్రీన్ విండ్స్ సరికొత్త వెంచర్ ను ప్రారంభించింది. 26.15 ఎకరాల్లో విస్తరించిన వెంచర్ లో సకల సదుపాయాలు కల్పించింది. ఈ మేరకు వెంచర్ ప్రాజెక్టుకి సంబంధించిన బ్రోచర్ ని... సినీతారలు అనసూయ, ఈషా రెబ్బ... జబర్దస్త్ ఫేమ్ చమ్మక్ చంద్ర ఆవిష్కరించారు.

Virtusa Green Winds : నగర శివారులో.. ఆహ్లాదకరమైన వాతావరణంలో నివాసాలు ఏర్పాటు చేసుకోవాలని చూస్తోన్న వారి కోసం.... రంగారెడ్డి జిల్లా 100 ఫీట్ కడ్తాల్ - తలకొండపల్లి రోడ్ లో వర్చూస గ్రీన్ విండ్స్ కొత్త వెంచర్ ను ప్రారంభించింది. కాలుష్య రహిత జీవనం మరియు హైదరాబాద్ నగర శివార్లలో పెరుగుతున్న ఉపాధి అవకాశాలను దృష్టిలో పెట్టుకొని చాలామంది శివారు ప్రాంతాలలో నివసించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాంటి వారి అభిరుచికి అనుగుణంగా వెంచర్ ను తీర్చిదిద్దింది.. వర్చూస గ్రీన్ విండ్స్. ఫిబ్రవరి 5న వెంచర్ ను ఘనంగా ప్రారంభించింది. బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో.. సినీతారలు అనసూయ భరద్వాజ్, ఈషా రెబ్బ.... సినీ నటుడు, జబర్దస్త్ ఫేమ్ చమ్మక్ చంద్ర పాల్గొన్నారు.

ట్రెండింగ్ వార్తలు

డీటీసీపీ ఆమోదించిన "వర్చూస గ్రీన్ విండ్స్" ప్రాజెక్ట్ లో 26 .15 ఎకరాల్లో వంద శాతం వాస్తుతో కూడిన 150 నుండి 600 చదరపు గజాల ప్లాట్స్ ను రూపొందించామని... సీఈఓ వాయిగండ్ల వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ ప్లాట్స్ లో అందమైన ఆర్చ్, ప్రహరీ గోడలతో భద్రత, 24 గంటలూ పనిచేసే సిసి కెమెరాల వ్యవస్థ, 33 మరియు 40 ఫీట్ల సిసి రోడ్లు, భూగర్భ విద్యుత్, ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్, ల్యాండ్ స్కేప్ పార్క్, చిన్న పిల్లలు ఆడుకునేందుకు స్థలం, టైల్డ్ ఫుట్ పాత్ లు, మంచి నీళ్ల ఓవర్ హెడ్ ట్యాంక్, ప్రతి ప్లాట్ కు తాగునీటి కనెక్షన్, భూగర్భ డ్రైనేజీ, వాలీ బాల్, బాస్కెట్ బాల్, బాడ్మింటన్ బాల్ కోర్టులతోపాటు ఇంకుడు గుంతల వంటి సకల సదుపాయాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

రీజినల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, టిసిఎస్, అమెజాన్ డేటా సెంటర్ లాంటి ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలు, హార్డ్ వేర్ పార్క్, ఈ-సిటీ, ఫార్మా సిటీ లతో వెంచర్ కు చక్కని కనెక్టివిటీ ఉందని వెంకటేశ్వర్లు వివరించారు. అధునాతన మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలు కలిగి ఉందని, ప్రముఖ విద్యా మరియు వినోద సంస్థలు ఈ వెంచర్ కు చేరువలో ఉన్నాయని వివరించారు. సుస్థిరమైన, అందరి మన్ననలూ పొందే ఉత్తమమైన రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ లను రూపొందించడమే తమ వర్చూస సంస్థ లక్ష్యమని, తమ ప్రతి వెంచర్.. సురక్షిత ప్రాంతం, స్పష్టమైన టైటిల్, సరసమైన ధరలు, కొనుగోలుదారుల అంచనాలను మించిన సౌకర్యాల వంటి ప్రశంసనీయమైన లక్షణాలను కలిగి ఉంటాయని అయన పేర్కొన్నారు. ఈ గ్రీన్ విండ్స్ వెంచర్ ప్లాట్లను కొనుగోలు చేసిన వారందరూ ఊహించిన విధంగా తమ కలల గృహాలను, విల్లాలను నిర్మించుకోవచ్చుననీ, వారి జీవితం ప్రతిక్షణం ఆనందభరితమవుతుందని వాయిగండ్ల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

అనసూయ భరద్వాజ్ మాట్లాడుతూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో శ్రీశైలం హై వే రహదారి ఒకటని, " వర్చూస గ్రీన్ విండ్స్" ఓ అపురూపమైన వెంచర్ అని, ఈ ప్లాట్ లు సంతోషంగా కొనుగోలు చేయవచ్చునని అన్నారు.

హీరోయిన్ ఈషా రెబ్బ మాట్లాడుతూ.. నగర కాలుష్యానికి దూరంగా, నిర్మలమైన వాతావరణంలో ఉన్న సురక్షితమైన హౌసింగ్ ప్రాజెక్ట్ ఈ " వర్చూస గ్రీన్ విండ్స్" అని తెలిపారు.

చమ్మక్ చంద్ర మాట్లాడుతూ.. "వర్చూస గ్రీన్ విండ్స్" ప్రాజెక్ట్ లో ఉత్తమమైన సదుపాయాలున్నాయని, పెట్టుబడికైనా, నివాసానికైనా ఇది చక్కని వేదిక అని అన్నారు.

టాపిక్