CM Revanth Reddy : కేసీఆర్... ఎకరంలో రూ. కోటి పంట సంపాదన ఎలానో చెప్పాలి- సీఎం రేవంత్ రెడ్డి-cm revanth reddy says 55413 jpbs allocatoin of fyer and oilladon on actress wers ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Reddy : కేసీఆర్... ఎకరంలో రూ. కోటి పంట సంపాదన ఎలానో చెప్పాలి- సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : కేసీఆర్... ఎకరంలో రూ. కోటి పంట సంపాదన ఎలానో చెప్పాలి- సీఎం రేవంత్ రెడ్డి

Bandaru Satyaprasad HT Telugu
Dec 04, 2024 11:16 PM IST

CM Revanth Reddy : తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఏర్పిడన తర్వాత ఏడాదిలో 55,413 ఉద్యోగ నియామకాలు పూర్తి చేశామన్నారు. టీజీపీఎస్సీ ద్వారా గ్రూప్ IV కేటగిరీ కింద కొత్తగా ఎంపికైన 8,084 మందికి, సింగరేణి సంస్థలో నియమితులైన వారికి ఉద్యోగ నియామక పత్రాలను ముఖ్యమంత్రి అందించారు.

కేసీఆర్... ఎకరంలో రూ. కోటి పంట సంపాదన ఎలానో చెప్పాలి- సీఎం రే
కేసీఆర్... ఎకరంలో రూ. కోటి పంట సంపాదన ఎలానో చెప్పాలి- సీఎం రే

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో నిరుద్యోగ సమస్య పరిష్కారం, రైతాంగానికి అండగా నిలవడం, మహిళలను ప్రగతి పథంలో నడిపించడమే ఎజెండాగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన, చేపట్టబోయే అభివృద్ధి పనుల గురించి సమగ్రంగా వివరించారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపు 55,143 ఉద్యోగ నియామకాలు పూర్తిచేసిన నేపథ్యంలో ప్రజా ప్రభుత్వం – ప్రజా విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లిలో యువ వికాసం సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి పాల్గొన్నారు.

ఈ వేదికగా టీజీపీఎస్సీ ద్వారా గ్రూప్ IV కేటగిరీ కింద కొత్తగా ఎంపికైన 8,084 మందికి, సింగరేణి సంస్థలో నియమితులైన వారికి ఉద్యోగ నియామక పత్రాలను ముఖ్యమంత్రి అందించారు. పెద్దపల్లి జిల్లాలో దాదాపు 1035 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వర్చువల్ గా ప్రారంభించారు. స్కిల్ వర్సిటీతో కలిసి పని చేయడానికి సంబంధించి 7 ఏజెన్సీలతో సీఎం సమక్షంలో ఒప్పందాలు కుదిరాయి. అలాగే, అత్యంత కీలకమైన డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సెన్జ్ ఆఫ్ తెలంగాణ(DEET) ఏర్పాటును సీఎం ప్రారంభించారు. అలాగే CM’s Cup -2024 ట్రోఫీని ఆవిష్కరించారు.

అనంతరం సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి... ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. గడిచిన పదేండ్లలో అభివృద్ధికి నోచుకోని ఎన్నో కార్యక్రమాలను చేపట్టినట్టు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం మహిళా సంఘాల్లో 67 లక్షల మంది ఉండగా, కోటి మందిని చేర్చి ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసేవరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమమే ఉద్యోగ ఉపాధి సాధన కోసం జరిగిన నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే శాఖల వారీగా మొత్తం 55,143 ఉద్యోగ నియామకాలు చేసి దేశంలోనే తెలంగాణ రికార్డు నెలకొల్పిన విషయాన్ని వివరించారు. ప్రభుత్వ ఫలాలు సక్రమంగా అందాలని, బీసీలకు సరైన వాటా దక్కాలన్న ఉద్దేశంతోనే కులగణన చేపట్టినట్టు తెలిపారు.

నిరుపేదల బిడ్డల చదువుకుని ఉన్నతస్థాయికి ఎదగాలన్న ఉద్దేశంతోనే పదేళ్లుగా పెంచని డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచామన్నారు. కరీంనగర్ జిల్లా శాతవాహన యూనివర్సిటీకి ఒక ఇంజినీరింగ్, ఒక లా కాలేజీ మంజూరు చేస్తామని చెప్పారు. పెద్దపల్లిలో సాగునీటి ప్రాజెక్టు, రామగుండంలో విద్యుత్ ప్రాజెక్టు సాధించడం ప్రజా విజయంగా అభివర్ణించారు. కాళేశ్వరం నుంచి చుక్కనీరు వినియోగించకుండా రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల్లో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండించి చరిత్ర రికార్డు సాధించామన్నారు. ధాన్యానికి కనీస మద్దతు ధరతో పాటు సన్నాలకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వం చెల్లించని రైతు బంధు 7500 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమచేశామన్నారు. తొలి సంవత్సరంలో 21 వేల కోట్లతో 25 లక్షల రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర మాదన్నారు.

"నిర్భందాల మధ్య సాగిన పదేండ్ల పాలన నుంచి స్వేచ్ఛ కల్పించామని పలు సందర్భాలు, సంఘటనలను ఉదహరించారు. ఒక్కరోజులో ఎవరూ అద్భుతాలు సృష్టించారని, ప్రజలు ఇచ్చిన అవకాశం మేరకు సంక్షేమం, అభివృద్ధి రెండింటిపైనా దృష్టి సారించాము. కేసీఆర్ సభకు రావాలి. తన మేథావితనాన్ని ప్రజలకు పంచాలి. ఎకరంలో కోటి రూపాయల పంట ఎలా సంపాదించారో చెప్పాలి." -సీఎం రేవంత్ రెడ్డి

Whats_app_banner

సంబంధిత కథనం