Mental Exhaustion । మీరు మానసికంగా అలసిపోయారు అని చెప్పటానికి సంకేతాలు ఇవే!-mental exhaustion it s time to take a break here are the ways to recover form burnout ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mental Exhaustion । మీరు మానసికంగా అలసిపోయారు అని చెప్పటానికి సంకేతాలు ఇవే!

Mental Exhaustion । మీరు మానసికంగా అలసిపోయారు అని చెప్పటానికి సంకేతాలు ఇవే!

HT Telugu Desk HT Telugu
Apr 06, 2023 02:07 PM IST

Mental Exhaustion: మీ భావోద్వేగాలు మీ అదుపులో ఉండటం లేదా, మీరు తరచుగా కోపం, అసహనం ప్రదర్శిస్తున్నారా? అయితే మీరు డిస్టర్బ్ అయ్యారని అర్థం. లక్షణాలు, నివారణ మార్గాలు చూడండి.

Mental Exhaustion
Mental Exhaustion (istock)

World Health Day 2023: నేటి వేగవంతమైన ప్రపంచంలో నిరంతరం పని, బాధ్యతలు, సంపాదన మీదే దృష్టి పెడుతున్నారు. జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలని, గొప్పగా బ్రతకాలని శ్రమిస్తూ ఒత్తిడికి (stress) లోనవుతున్నారు. వ్యక్తిగత ఆరోగ్యాన్ని పక్కనపెట్టి ఇలా ప్రతిరోజూ ఒత్తిడి, ఆందోళనలతో కూడిన జీవితాన్ని అనుభస్తున్నారు. దీని వలన ఒక్కోసారి ఫ్రస్ట్రేషన్ (Frustration) కు లోనవుతూ అరవటం, చిన్న తప్పిదాలకే ఎదుటివారు నొచ్చుకునేలా కోపాలను (anger) ప్రదర్శించడం వంటివి చేస్తున్నారు. దైనందిన జీవితంలో ప్రశాంతత అనేది కోల్పోతున్నారు.

ఇది ఇలాగే కొనసాగితే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఒక దశలో మానసికంగా డిస్టర్బ్ అయిపోయి, పూర్తిగా డిప్రెషన్ (Depression) లోకి వెళ్లే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇకనైనా మీరు మీ మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వాలని గుర్తుంచుకోండి. బరువు, బాధ్యతలను అన్నింటినీ వదిలేసి కొంతకాలం విరామం (Break) తీసుకోవాలి.

Ways to Recover form Burnout- మానసికంగా కోలుకోవడానికి మార్గాలు

మీరు మానసికంగా అలసిపోయారు (Mentally Exhausted), మీ మానసిక ఆరోగ్యం (Mental Health) కోసం కొంత విరామం తీసుకోవాలని సూచించే ఏడు సంకేతాలు ఇక్కడ చూడండి.

అలసిపోయినట్లుగా ఉండటం

మీరు ఎల్లవేళలా అలసిపోయినట్లు ఉండటం, బలహీనంగా అనిపించడం, ఎక్కువ పనిభారం మోస్తున్నట్లుగా అనిపిస్తే, మీరు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించవచ్చు. అలసట వల్ల 'ఇక చాలు' అన్న భావన కలుగుతుంది. ఈ స్థితిలో మీరు ఎంత ఉత్తమంగా పనిచేద్దామనుకున్నప్పటికీ, మీ పనితీరు దెబ్బతింటుంది.

చిరాకుగా ఉండటం

మీరు తరచుగా విషయాల పట్ల చిరాకును కలిగి ఉండటం, ఎల్లప్పుడూ మూడీగా ఉండటం. ఇతరులపై అనవసరంగా విరుచుకుపడటం చేస్తే మీరు మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నారని అర్థం. మీకు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పటానికి ఇది సంకేతం. ఈ స్థితి ఇతరులతో మీ సంబంధాలను కూడా ప్రభావితం చేస్తుంది, ఇతరులకు మీకు మధ్య విభేదాలకు, అపార్థాలకు దారి తీస్తుంది.

శారీరక సమస్యలు

తరచుగా తలనొప్పి, కండరాల నొప్పులు, జీర్ణ సమస్యలు వంటి లక్షణాలలో ఇబ్బందిపడుతున్నట్లయితే ఇది మీలోని ఒత్తిడిని సూచిస్తుంది. మీరు తరచుగా ఈ లక్షణాలలో దేనినైనా ఎదుర్కొంటుంటే, మీరు ఇక విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని, మీ మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వాలని ఇది సూచించవచ్చు.

నిద్రపోవడంలో ఇబ్బంది

మీకు ప్రతిరోజూ నిద్రపోవడంలో ఇబ్బందులు, తగినంత నిద్రలేకపోవడం, నిద్రలేమి సమస్యలు ఉంటే మీరు దీర్ఘకాలికమైన ఒత్తిడిని అనుభవిస్తున్నారని అర్థం. ఇక, మీరు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం ఆసన్నం అయిందని ఇది సంకేతం. తగినంత నిద్ర లేకపోవడం వల్ల మీ మానసిక స్థితి, శక్తి స్థాయిలు క్షీణిస్తాయి. మీ ఆరోగ్యం, శ్రేయస్సుపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయి.

నిరుత్సాహానికి లోనవడం

మీకు తెలియకుండానే నిరాశకు లోనవుతుండటం. మీకు ఉన్న పనిభారం, మీ బాధ్యతలపై అసంతృప్తిని కలిగి ఉన్నారంటే మీరు కొంతకాలం పని నుండి విశ్రాంతి తీసుకొని మీ మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని సూచించవచ్చు. విశ్రాంతి తీసుకోవడం వల్ల మీరు సానుకూల దృక్పథాన్ని తిరిగి పొందుతారు. మీ మనసు మీ నియంత్రణలో ఉన్నట్లు అనుభూతి చెందడంలో సహాయపడుతుంది.

ఇవి మాత్రమే కాకుండా పదేపదే తప్పులు చేయడం, మీకు గతంలో నచ్చిన వాటిపై కూడా ఇప్పుడు ఆసక్తి లేకపోవడం, నచ్చిన భోజనంను కూడా ఆస్వాదించలేకపోవడం వంటివి మీరు బర్న్ అవుట్ అయ్యారనడానికి సంకేతం. విసుగు, ఉదాసీనత వంటి భావాలు మీలో పెరుగుతాయి.

ఇక్కడ చెప్పిన సంకేతాలు మీలో కనిపిస్తున్నాయంటే.. మీ మానసిక ఆరోగ్యం జాగ్రత్త. యోగా-ధ్యానం వంటివి చేయండి. కొంతకాలం విరామం తీసుకోండి, కొన్నిరోజుల పాటు ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్లండి, ఇది మిమ్మల్ని మళ్లీ హుషారుగా చేస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం