Immunity Fruits Name : మీకు రోగనిరోధక శక్తి పెరగాలా? ఈ పండ్లు తినండి-immunity fruits name increase immunity in your body with these fruits ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Immunity Fruits Name : మీకు రోగనిరోధక శక్తి పెరగాలా? ఈ పండ్లు తినండి

Immunity Fruits Name : మీకు రోగనిరోధక శక్తి పెరగాలా? ఈ పండ్లు తినండి

HT Telugu Desk HT Telugu
Mar 26, 2023 12:29 PM IST

Immunity with Fruits : శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి అనేక మార్గాలను అనుసరిస్తాం. పండ్లను తినడం ద్వారా రోగ నిరోధక శక్తిని సులభంగా పెంచుకోవచ్చు. వ్యాధులను దూరం చేసుకోవచ్చు.

పండ్లు
పండ్లు (Freepik)

ఇటీవల పెరుగుతున్న వ్యాధులు, శారీరక, మానసిక సమస్యల కారణంగా చాలామంది ఆరోగ్యకరమైన జీవనశైలి(Lifestyle)పై దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని(Immunity) పెంచుకోవడంపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. మన ఆహారం(Food)లో పండ్లను చేర్చుకోవడం చాలా ముఖ్యం. ఇందులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి రోగనిరోధక శక్తిని పెంచే కొన్ని పండ్లు ఏంటో చూద్దాం.

పైనాపిల్ పండులో బ్రోమెలైన్ అనే ఎంజైములు ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇది శరీరంలో యాంటీ ఇన్ఫెక్టివ్ లక్షణాలను కలిగి ఉంది.

బ్లూబెర్రీ ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని నియంత్రిస్తుంది.

బొప్పాయి పండులో విటమిన్ ఎ, సి, ఇ పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరంలో యాంటీబాడీస్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది శరీరంలోని వ్యాధికారక క్రిములతో పోరాడి శరీరాన్ని రక్షిస్తుంది.

నిమ్మ, ద్రాక్ష, నారింజ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో ఇన్ఫెక్షన్లతో పోరాడే తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.

కివీ పండులో నారింజలో ఉండే సిట్రస్‌ పదార్థం రెండింతలు ఉంటుంది. ఇందులో కె, ఇ విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఈ రెండు అంశాలు ఎంతగానో సహకరిస్తాయి.

వేసవి ప్రారంభం కాగానే మామిడికాయల సీజన్ కూడా మొదలవుతుంది. మామిడిపండ్లు కెరోటినాయిడ్స్ అద్భుతమైన మూలం, ఇవి రోగనిరోధక కణాలను బలోపేతం చేస్తాయి, మంటను తగ్గిస్తాయి.

జామ పండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఫ్రీ రాడికల్స్ నుండి కణాలను రక్షించే ఫ్లేవనాయిడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.

పుచ్చకాయలో గ్లూటాతియోన్ ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలో ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

దానిమ్మ పండులో పాలీఫెనాల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. ఇది ఇన్ఫెక్షన్‌తో పోరాడటానికి సహాయపడుతుంది.

యాపిల్స్‌లో పెక్టిన్ అనే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పేగు బాక్టీరియాను తొలగించడంలో సహాయపడుతుంది, శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.