JioFiber Diwali offer: జియో ఫైబర్ బంపర్ ఆఫర్.. ఆ ప్లాన్లపై రూ. 6,500 బెనిఫిట్స్-jiofiber diwali offer announced offers up to rs 6 500 benefits ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Jiofiber Diwali Offer Announced: Offers Up To <Span Class='webrupee'>₹</span>6,500 Benefits

JioFiber Diwali offer: జియో ఫైబర్ బంపర్ ఆఫర్.. ఆ ప్లాన్లపై రూ. 6,500 బెనిఫిట్స్

HT Telugu Desk HT Telugu
Oct 18, 2022 03:04 PM IST

JioFiber Diwali offer: దీపావళి సందర్భంగా జియో ఫైబర్ డబుల్ ఫెస్టివల్ బొనాంజా ఆఫర్ అందిస్తోంది.

జియో ఫైబర్ పై దీపావళి ఆఫర్లు
జియో ఫైబర్ పై దీపావళి ఆఫర్లు

రిలయన్స్ జియో తన జియోఫైబర్ కస్టమర్ల కోసం జియోఫైబర్ డబుల్ ఫెస్టివల్ బొనాంజా ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా అక్టోబర్ 18 నుండి అక్టోబర్ 28 వరకు JioFiber కనెక్షన్‌ పొందే కస్టమర్లకు రూ. 6,500 విలువైన ప్రయోజనాలను అందిస్తుంది. 

ట్రెండింగ్ వార్తలు

వినియోగదారులు కొత్త JioFiber ప్లాన్‌ బుక్ చేసినప్పుడు కూడా ఈ ఆఫర్ చెల్లుబాటు అవుతుంది. ఎంపిక చేసిన ప్లాన్‌ కొనుగోలుపై JioFiber డబుల్ ఫెస్టివల్ బొనాంజా వర్తిస్తుంది. రూ. 599, రూ. 899 ప్లాన్లపై బొనాంజా వర్తిస్తుంది. 

కొత్త JioFiber కనెక్షన్‌ని బుక్ చేసుకుని, డబుల్ బొనాంజా ఆఫర్ కింద 6 నెలలపాటు రూ. 599 ప్లాన్ లేదా రూ. 899 ప్లాన్‌కు సబ్‌స్క్రైబ్ చేసుకున్న కస్టమర్లు ప్లాన్ ప్రయోజనాలతో పాటు 2 అదనపు ప్రయోజనాలకు అర్హులు అవుతారు. 100% వాల్యూ బ్యాక్, 15 రోజుల అదనపు చెల్లుబాటయ్యేలా అదనపు ప్రయోజనాలు పొందుతారు.

ప్లాన్ వారీగా ప్రయోజనాలు ఇవే..

రూ 599 X 6 నెలల ప్లాన్

JioFiber రూ. 599 ప్లాన్ 30Mbps ఇంటర్నెట్ స్పీడ్‌ను అందిస్తుంది. 144 OTT యాప్‌లకు యాక్సెస్‌తో పాటు 550 కంటే ఎక్కువ ఆన్-డిమాండ్ ఛానెల్స్ అందిస్తుంది. 6 నెలల కాలానికి (రూ. 3,594 + రూ. 647 జీఎస్టీ) రూ. 4,241 చెల్లింపు చేసినప్పుడు ఈ ప్లాన్‌లోని కొత్త కస్టమర్లు రూ. 4,500 విలువైన వోచర్లు పొందుతారు. 

- రూ. 1,000 విలువ గల AJIO వోచర్

- రూ. 1,000 విలువ గల రిలయన్స్ డిజిటల్ వోచర్

- రూ. 1,000 విలువ గల నెట్‌మెడ్స్ వోచర్

-  రూ. 1,500 విలువ గల IXIGO వోచర్

అదనంగా, కస్టమర్లు ప్లాన్‌లో భాగమైన 6 నెలల చెల్లుబాటుతో పాటు 15 రోజుల అదనపు వ్యాలిడిటీని పొందుతారు.

రూ. 899 X 6 నెలల ప్లాన్

JioFiber రూ. 899 ప్లాన్ 100 Mbps డేటా వేగంతో పాటు 14+ OTT యాప్‌లు, 550 కంటే ఎక్కువ ఆన్-డిమాండ్ ఛానెల్స్‌కు యాక్సెస్‌తో లభిస్తుంది. ప్లాన్ కోసం రూ. 6,365 (రూ. 5,394 + రూ. 971 జీఎస్‌టీ) చెల్లించినప్పుడు వినియోగదారులు రూ. 6,500 విలువైన వోచర్‌లను పొందుతారు. 

- రూ. 2,000 విలువ గల AJIO వోచర్

- రూ. 1,000 విలువ గల రిలయన్స్ డిజిటల్ వోచర్

- రూ. 500 విలువ గల నెట్‌మెడ్స్ వోచర్

- రూ. 3,000 విలువ గల IXIGO వోచర్ పొందుతారు.

ఈ ప్లాన్ 6 నెలల చెల్లుబాటుతో పాటు 15 రోజుల అదనపు చెల్లుబాటును కూడా కలిగి ఉంటుంది.

రూ. 899 X 3 నెలల ప్లాన్

3 నెలల ప్లాన్ (రూ. 3,182 + రూ. 485 GST) కోసం JioFiber కనెక్షన్‌ని రూ. 2,697తో రీఛార్జ్ చేస్తే, కొత్త కస్టమర్లు రూ. 3,500 విలువైన వోచర్లు పొందుతారు. 

- రూ. 1,000 విలువ గల AJIO వోచర్

- రూ. 5,00 విలువ గల రిలయన్స్ డిజిటల్ వోచర్

- రూ. 500 విలువ గల నెట్‌మెడ్స్ వోచర్

- రూ. 1,500 విలువ గల IXIGO వోచర్ పొందుతారు.

అయితే, ఈ ప్లాన్‌కి అదనపు వాలిడిటీ లేదు. అలాగే, పై ప్లాన్‌లలో దేనినైనా కొనుగోలు చేసే కస్టమర్‌లు ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా రూ. 6,000 విలువైన 4K JioFiber సెట్ టాప్ బాక్స్‌ను కూడా పొందుతారు.

WhatsApp channel

టాపిక్