Guava Leaves : కొలెస్ట్రాల్ ఉందా? అయితే జామ ఆకులతో ఇలా చేయండి
Guava Leaves Health Benefits : కొలెస్ట్రాల్ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. అయితే జామ ఆకులను ఉపయోగిస్తే.. ఆ సమస్య నుంచి బయటపడొచ్చు.
జామ పండ్లను చాలా మంది ఇష్టంగా తింటారు. జామకాయలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో.. జామ ఆకులు(Guava Leaves) కూడా అంతే మేలు చేస్తాయి. జామ ఆకులను ఉపయోగించడం కారణంగా.. మనం చక్కటి ఆరోగ్యాన్ని(Health) సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు.. జామ ఆకుల్లో అనేక రకాల పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉంటాయి. అనేక ఆరోగ్య సమస్యలను జామ ఆకుల ద్వారా దూరం చేసుకోవచ్చు.
జామ ఆకులను ఉపయోగిస్తే.. జలుబు, దగ్గు, నోటిపూత, పంటి నొప్పిలాంటి సమస్యల నుంచి బయటపడొచ్చు. వీటిలో విటమిన్ సి(Vitamin C), యాంటి ఆక్సిడెంట్లు, ప్లవనాయిడ్స్, పొటాషియం, ఫైబర్ లాంటి పోషకాలు దాగి ఉంటాయి. జామ ఆకుల రసం తాగినా.. వాటితో టీ(Tea) తయారు చేసుకుని.. తాగినా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తంలో చక్కరె స్థాయిలు అదుపులో ఉంటాయి.
ఫుడ్ తిన్నాక.. జామ ఆకుల టీ(Guava Leaves Tea)ని తాగితే చక్కెర స్థాయిలు పెరగకుండా అదుపులో ఉంటాయి. టీని చాలా సులభంగా తయరు చేయోచ్చు. ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసి వేడి చేసుకోవాలి. ఇందులో 4 జామ ఆకులను శుభ్రం చేసుకుని వేసుకోవాలి. ఈ నీటిని అర గ్లాస్ అయ్యే దాగా మరిగించాలి. ఆ తర్వాత వడకట్టాలి. ఇలా చేస్తే.. జామ ఆకుల టీ తయారు అవుతుంది.
ఈ టీని మీరు గోరు వెచ్చగా అయ్యాక.. తాగడం మంచిది. ఇలా జామ ఆకులతో టీ చేసుకుని తాగితే.. రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తంలో ఉండే మలినాలు తొలగిపోతాయి. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అజీర్తి, మలబద్ధకం సమస్య పోతుంది. జామ ఆకుల టీతో కొలెస్ట్రాల్(Cholesterol) కరిగిపోతుంది. గుండె ఆరోగ్య మెరుగుపడుతుంది. ఈ టీతో స్త్రీలలో నెలసరి సమయంలో వచ్చే నొప్పులు తగ్గుతాయి. శరీరం డీ హైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది.