మీ శరీరంలో ప్రధానంగా 7 శక్తి కేంద్రాలు ఉంటాయి, వీటిని చక్రాలు అంటారు. మీ శరీరక, మానసిక ఆరోగ్యానికి ఇవి మూలం. వీటి పనితీరును సమర్థవంతంగా మార్చే మార్గాలు చూడండి.,మీరు ఎప్పుడైనా యోగా లేదా మెడిటేషన్ క్లాస్ తీసుకున్నప్పుడు, రేకి వంటి ఎనర్జీ హీలింగ్ సెషన్‌లో పాల్గొన్న సందర్భంలో లేదా వీటికి సంబంధించి ఏవైనా ఆన్‌లైన్ వీడియోలను చూసినపుడు కూడా మీ శరీరంలో చక్రాల గురించి ప్రధానంగా చెబుతారు. మీ శరీరంలో శక్తి ప్రవాహంలో అవి పోషిస్తున్న పాత్ర గురించి చెబుతూ ఉంటారు. అయితే శరీరంలోని చక్రాలు అంటే ఏమిటి, అవి మీ శారీరక మరియు మానసిక శ్రేయస్సును ఎలా ప్రభావితం చేస్తాయి? వంట్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.,సంస్కృతంలో 'చక్ర' అనే పదానికి 'చక్రం' లేదా 'డిస్క్' అని అర్ధం వస్తుంది. ఇది మీ శరీరంలో ఒక్కొక్క భాగంలో గల శక్తి కేంద్రాలను సూచిస్తుంది. ఈ చక్రాలు అన్నీ ఒక్కొక్కటి కొన్ని నరాల సమూహం, మీ శరీరంలోని ప్రధాన అవయవాలకు అనుగుణంగా ఉంటాయి.,మీరు మానసిక- శారీరక ఆరోగ్యం, మీరు అనుభవించే బాధలు -భావోద్వేగాలు అన్నీ ఈ చక్రాలతోనే ముడిపడి ఉంటాయి. మీరు సంపూర్ణ ఆరోగ్యంతో, స్పష్టమైన ఆలోచనలతో ఉండాలంటే ఈ శక్తి కేంద్రాలైన చక్రాలు మూసుకోకుండా తెరిచి ఉండాలి. అప్పుడు శక్తి ప్రవాహం సమతుల్యంగా జరుగుతుంది.,The 7 Chakras in Human Body- మానవ శరీరంలోని 7 చక్రాలుమీ శరీరంలో కనీసం 114 వేర్వేరు చక్రాలు ఉన్నాయని చెబుతారు, అయితే ప్రధానంగా 7 చక్రాలు ఇందులో కీలకం. ఇవి మీ వెన్నెముక మూలం నుంచి తలవరకు విస్తరించి ఉంటాయి. శరీరంలో 7 ప్రధాన చక్రాలు ఏవి, మూసుకున్న చక్రాలను తెరిచేందుకు సహాయపడే మార్గాలు చూడండి.,Root Chakra- మూల చక్రం: ఇది మీ వెన్నెముక కేంద్రం వద్ద ఉంటుంది.Sacral Chakra- స్వాదిష్టాన చక్రం: ఇది మీ బొడ్డు క్రింద ఉంటుంది.Solar Plexus Chakra - మణిపూర చక్రం: ఇది మీ కడుపు ప్రాంతంలో ఉంటుంది.Heart Chakra- : హృదయ చక్రం: ఇది ఛాతీ మధ్యలో, గుండెకు సమీపంలో ఉంటుంది.Throat Chakra- విశుద్ధ చక్రం: ఇది గొంతు వద్ద ఉంటుంది.Third Eye Chakra- మూడవ కన్ను చక్రం: ఇది మీ రెండు కళ్ళ మధ్య ఉంటుందిCrown Chakra- కిరీటం చక్రం: ఇది మీ తల పైభాగంలో ఉంటుంది.Ways To Unblock Chakras- శక్తి చక్రాలను తెరిచే మార్గాలుఈ 7 చక్రాలు మీ శరీరంలో నిరంతరం పనిచేస్తాయి, మీరు అనుసరించే అనారోగ్యకరమైన జీవనశైలి, మీ అలవాట్ల కారణంగా ఈ చక్రాలు క్షీణతకు గురవుతాయి, వాటి శక్తి ప్రవాహంలో అడ్డంకులు ఎదురవుతాయి. అందువల్ల వీటిని శుభ్రపరిచి, శక్తి ప్రవాహం కోసం అడ్డంకులు తొలగించాలి, అందుకు మార్గాలు ఇక్కడ చూడండి.,ధ్యానంశ్వాస వ్యాయామాలుయోగా ఆసనాలుఫిట్నెస్ కార్యకలాపాలుఉప్పు నీటి స్నానాలుఎర్తింగ్ లేదా గ్రౌండింగ్ (శరీరాన్ని నేలకు తాకించడం)పైన పేర్కొన్న మార్గాలలో ఏదైనా ఒకదానిని ఎంచుకొని, రోజూ సాధన చేయడం ద్వారా మీరు గొప్ప అనుభూతిని పొందుతారు. మీ శరీర చక్రాలు శక్తి ప్రవాహం సమానంగా జరుగుతుంది. మీరు మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు అద్భుతంగా, తేలికగా, స్పష్టంగా ఉన్నట్లు అనుభూతి చెందుతారు.,