Yoga For Chronic Back Pain । దీర్ఘకాలిక నడుము నొప్పికి ఈ యోగాసనాలు అద్భుత పరిష్కారం!-stretch your spine and release pain 5 easy yoga poses to ease chronic back pain ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Yoga For Chronic Back Pain । దీర్ఘకాలిక నడుము నొప్పికి ఈ యోగాసనాలు అద్భుత పరిష్కారం!

Yoga For Chronic Back Pain । దీర్ఘకాలిక నడుము నొప్పికి ఈ యోగాసనాలు అద్భుత పరిష్కారం!

HT Telugu Desk HT Telugu
Mar 09, 2023 10:00 AM IST

Yoga For Chronic Back Pain: నడుము నొప్పి కలిగితే చాలా బాధాకరంగా ఉంటుంది, కూర్చొని పానిచేసేవారు దీర్ఘకాలికంగా ఈ బాధను అనుభవిస్తున్నారు, నొప్పి నుంచి ఉపశమనం కలిగించి, మళ్లీ నడుమునొప్పి రాకుండా నివారించే యోగాసనాలు ఇక్కడ చూడండి.

Yoga For Chronic Back Pain
Yoga For Chronic Back Pain (unsplash)

నేటి డిజిటల్ యుగంలో పనిచేయడం అంటే కుర్చీలకు అతుక్కుపోయి వ్యవహారాలు చక్కబెట్టడం, కంప్యూటర్ స్క్రీన్లలో కళ్లు పెట్టడం, ఏది కావాలనుకున్నా ఆన్‌లైన్‌‌లోనే ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. దీంతో శరీరానికి శ్రమ దొరకడం లేదు, నిలబడటానికి అవకాశం రావడం లేదు. దీని ఫలితంగా నడుము నొప్పి కేసులు పెరిగాయి, ఇప్పుడు ఇరవైలలో ఉన్నవారు కూడా నడుము నొప్పులను అనుభవిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

నడుమునొప్పి కలిగిన ప్రతీసారి నొప్పి నివారణ క్రీములు రాయడం, మందులు వేసుకోవడం ద్వారా తాత్కాలిక పరిష్కారమే లభిస్తుంది. నడుము నొప్పికి యోగా సరైన చికిత్స. యోగాసనాలు శరీరానికి ప్రశాంతతను, విశ్రాంతిని చేకూరుస్తాయి. దీర్ఘకాలికమైన నొప్పులకు కూడా యోగాతో పరిష్కారం లభిస్తుంది. ప్రతిరోజూ కొన్ని నిమిషాలు యోగా సాధన చేయడం వల్ల మీరు పూర్తి ఆరోగ్యవంతులు కాగలరు.

Yoga For Chronic Back Pain- నడుము నొప్పికి యోగాసనాలు

నడుమును నొప్పిని తగ్గించే కొన్ని ప్రభావవంతమైన యోగాసనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Cat Cow Pose- చక్రవాకసనం

సున్నితమైన ఆసనం వెన్నుభాగంలో కదలికను కలిగిస్తుంది, వెన్నెముకను సాగదీస్తుంది. ఈ భంగిమను సాధన చేయడం వల్ల మీ మొండెం, భుజాలు మరియు మెడ కూడా సాగుతుంది. ఈ యోగాసనంతో మీ వెన్నెముకను సున్నితమైన మసాజ్ లభించడం ద్వారా వెన్నునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒక నిమిషం పాటు ఈ ఆసనం వేయండి.

Downward facing Dog- అధో ముఖ ఆసనం

ఈ సాంప్రదాయిక ఆసనం మీకు విశ్రాంతిని, పునరుజ్జీవనం కలిగిస్తుంది. వెన్నునొప్పి ఉన్నప్పుడు ఈ భంగిమను సాధన చేయడం వల్ల మీకు హాయిగా అనిపిస్తుంది, నొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. ఇది శరీరంలో అసమతుల్యతను తొలగించడానికి, సత్తువను పెంచడానికి సహాయపడుతుంది.

Bridge Pose- సేతుబంధ సర్వంగాసనం

ఈ యోగా భంగిమ మీ శరీరాన్ని బలోపేతం చేయడంలో, శరీర సమతుల్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ భంగిమలో ఉన్నప్పుడు వెన్నుభాగం లోపలికి వంగుతుంది, ఛాతీ బయటకు తెరుచుకుంటుంది. శరీరాన్ని సాగదీయడం కోసం ఒక వంతెనను ఏర్పర్చినట్లు ఉంటుంది. ఈ భంగిమ ఛాతీ, మెడ, వెన్నెముక, తుంటిని సాగదీస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, వెన్ను సమస్యలను చికిత్స చేస్తుంది.

Child Pose- బాలాసనం

ఇది చాలా సులభమైన ఆసనం, ఈ ఆసనం సాధన చేయడం ద్వారా మీరు మీ వెన్నుభాగాన్ని సాగదీయవచ్చు. రోజంతా పనిచేసి అలసిపోయిన రోజున, మీరు పడుకునే ముందు బాలాసనం వేయండి. మీకు ఒళ్లు నొప్పులు, వెన్నునొప్పి నుంచి ఉపశమనం కలిగి విశ్రాంతిగా అనిపిస్తుంది. హాయిగా నిద్రపోగలుగుతారు.

Cobra Pose- భుజంగాసనం

భుజంగాసనం ప్రధానంగా ఉదర భాగాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది. ఇది రక్త ప్రసరణలో సహాయపడుతుంది, వెన్నుముకను బలపరుస్తుంది, గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. వెన్నునొప్పి, శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను నయం చేస్తుంది. ఈ యోగా భంగిమ పొట్ట కొవ్వును తగ్గించడంలోనూ ప్రభావవంతంగా ఉంటుంది.

Whats_app_banner

సంబంధిత కథనం