Yoga For Back Pain । వెన్నునొప్పి వేధిస్తే ఈ 5 యోగా ఆసనాలు వేయండి, తక్షణ ఉపశమనం!-exercises 5 yoga poses that help you ease your back pain ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /   Exercises 5 Yoga Poses That Help You Ease Your Back Pain

Yoga For Back Pain । వెన్నునొప్పి వేధిస్తే ఈ 5 యోగా ఆసనాలు వేయండి, తక్షణ ఉపశమనం!

HT Telugu Desk HT Telugu
Jan 23, 2023 10:38 AM IST

Yoga For Back Pain: వెన్నునొప్పు ఏ వయసు వారినైనా వేధించే ఓ సమస్య. మందులతో కాకుండా యోగాతో కూడా సహజంగా నయం చేసుకోవచ్చు. వెన్నునొప్పికి అద్భుతంగా పనిచేసే కొన్ని యోగా ఆసనాలు ఇక్కడ చూడండి.

Yoga For Back Pain
Yoga For Back Pain (istcok)

మన ఆరోగ్యాన్ని, మన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ఎంతో ముఖ్యం. శరీరానికి కలిగే ఏ చిన్న అసౌకర్యమైనా ఎంతో ఇబ్బందిని కలిగిస్తుంది. దాదాపు అన్ని వయసుల వారిని ఎక్కువగా వేధించే సమస్యలలో వెన్నునొప్పి ఒకటి. స్త్రీలైనా, పురుషులైనా, పిల్లలైనా, వయోజనులైనా ఎవరైనా వెన్నునొప్పిని అనుభవించవచ్చు. అయితే ఇక్కడ వయోజన స్త్రీల కంటే పురుషులే అధికంగా వెన్నునొప్పిని అనుభవిస్తున్నారని ఆరోగ్య నిపుణుల అభిప్రాయం.

వెన్నునొప్పిలో వివిధ రకాలు ఉంటాయి. వెన్నునొప్పి కలిగే శరీర భాగాలను బట్టి వాటిని వర్గీకరించారు. అవి సెర్వికల్ (మెడ), థొరాసిక్ (వీపు మధ్య), లంబార్ (దిగువ వీపు) అలాగే కోకిడినియా (టెయిల్‌బోన్ లేదా త్రికాస్థి) భాగాలలో కలిగే వెన్నునొప్పులుగా గుర్తించవచ్చు.

Yoga For Back Pain - వెన్నునొప్పికి యోగా ఆసనాలు

ఈ శీతాకాలంలో ఈ వెన్నునొప్పులు మరింత తీవ్రతరం అవుతాయి. అయితే మందులు కాకుండా మీ వెన్నును రక్షించుకోవడంలో సహాయపడే కొన్ని సులభమైన యోగా భంగిమలు ఉన్నాయి.

యోగా ఆసనాలను ఎవరైనా ఆచరించవచ్చు, వీటితో మీ వెన్నెముక నిటారుగా, బలంగా మారుతుందని హెచ్‌టి లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ యోగా గురువు హిమాలయన్ సిద్ధా అక్షర్ తెలిపారు.

1. భుజంగాసనం - Cobra Pose

విధానం: యోగా మ్యాట్ మీద మీ కడుపు నేలను తాకేలా బోర్లా పడుకోవాలి. మీ అరచేతులను నేలకు ఆనించి, మీ తల నుంచి నాభి భాగం వరకు పైకి లేపాలి. పైకి లేపేటపుడు శ్వాస తీసుకోవాలి.

2. మార్జారియాసనం - Cat Cow Pose

విధానం: పసిపిల్లలు అంబాడుతున్నట్లుగా ఉండే భంగిమలో ఉండాలి, మీ తలను ఛాతి భాగాని పైకి లేపుతూ ఊపిరి పీల్చుకోవాలి.

3. పశ్చిమోత్తనాసనం - Seated Forward Bend

విధానం: సుఖాసనంలో ప్రారంభించండి. అనంతరం కాళ్ళను ముందుకు నిఠారుగా చాచండి, మీ వెన్నును ముందుకు వంచుతూ మీ చేతులతో మీ బొటనవేలును పట్టుకోండి. కనీసం 5 సార్లు శ్వాస తీసుకునేంత వరకు ఈ భంగిమలో ఉండాలి.

4. ధనురాసనం- Bow Pose

విధానం: యోగా మ్యాట్ మీద బోర్లా పడుకోండి. మీ కాళ్లను వెనక్కి మడవండి, అలా మడిచిన కాళ్లను మీ చేతులను వెనక్కి తీసుకొని పట్టుకోండి. మీ ఛాతీ భాగాన్ని నేల నుండి పైకి ఎత్తండి, మీ తల కూడా పైకి ఎత్తి చూడండి శ్వాస తీసుకోండి. ఈ ఆసనం చాలా నెమ్మదిగా చేయాలి. విరామం తీసుకుంటూ ఒకటి రెండు సార్లు ఈ భంగిమను పునరావృతం చేయండి.

5. త్రియకా భుజంగాసనం- Twisted Cobra Pose

విధానం: ఇది అచ్ఛంగా భుజంగాసనం చేసినట్లు చేయాలి. అయితే భుజంగాసనంలో మీరు మీ ఛాతిని పైకి ఎత్తి, మీ తలను కూడా పైకి ఎత్తి ఆకాశాన్ని చూస్తారు. అయితే ట్విస్టెడ్ కోబ్రా పోజ్ ఆసనంలో మీరు మీ తలను పైకి కాకుండా పక్కకు తిప్పి మీ పాదాల వైపు చూస్తారు. ఇక్కడ తలను తిప్పుతున్నారు కాబట్టి ఇది 'ట్విస్టెడ్' కోబ్రా పోజ్ అయింది.

WhatsApp channel

సంబంధిత కథనం