Telugu News  /  Lifestyle  /  Make Your Hips Dont Lie, Here Are The 5 Yoga Poses That Tone Your Thighs
Yoga Poses for Hips and Thighs:
Yoga Poses for Hips and Thighs:

Yoga To Tone Your Hips | తొడ భాగంలో కొవ్వును కరిగించే అద్భుతమైన యోగాసనాలు ఇవే!

09 January 2023, 16:45 ISTHT Telugu Desk
09 January 2023, 16:45 IST

Yoga Poses for Hips and Thighs: ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం, దిగువ శరీరానికి శ్రమ లేకపోతే తొడలలో కొవ్వు పెరిగిపోతుంది. ఆ కొవ్వు తగ్గాలంటే కొన్ని యోగాసనాలు ఉన్నాయి, అవి ఇక్కడ తెలుసుకోండి.

నేడు చాలా మంది అనుసరించే లైఫ్‌స్టైల్‌లో శారీరక శ్రమ తక్కువవుతుంది, మానసిక శ్రమ ఎక్కువవుతుంది. ముఖ్యంగా కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసే వారిలో ఈ ధోరణి కనిపిస్తుంది. రోజులో ఎక్కువ భాగం కూర్చోవటానికే పరిమితం అవుతున్నారు. దీంతో శరీరాన్ని మోసే దిగువ శరీరానికి పనిలేకపోవడంతో, ఆ భాగమంతా బలహీనపడుతుంది. అలాగే తుంటి, తొడలలో అదనపు శరీర కొవ్వును పేరుకుపోతుంది. తొడలను తిరిగి సరైన ఆకృతిలోకి తీసుకువచ్చేందుకు సరైన వ్యాయామాలు చేయాల్సిన అవసరం ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

HT లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, హిమాలయ యోగా ఆశ్రమ వ్యవస్థాపకులు హిమాలయన్ సిద్ధా అక్షర్ కొన్ని యోగా ఆసనాలను సూచించారు.HT లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, హిమాలయ యోగా ఆశ్రమ వ్యవస్థాపకులు హిమాలయన్ సిద్ధా అక్షర్ కొన్ని యోగా ఆసనాలను సూచించారు.

Yoga Poses for Hips and Thighs- తుంటి, తొడల కండరాల కోసం యోగాసనాలు

మీ తుంటి, తొడల కండరాలు మీ శరీర బరువును భరిస్తాయి. కాబట్టి ఈ యోగాసనాలు ఆచరించడం ద్వారా వాటిని బలంగా, సరైన ఆకృతిలోకి తీసుకురావచ్చు.

1. ఉత్కటాసనం – Chair Pose

ఈ ఆసనంను ప్రతిసారీ 30 సెకన్ల విరామంతో 5 సెట్‌ల పాటు వేయాల్సి ఉంటుంది. ఉత్కటాసనం వేసేందుకు సమస్థితితో ప్రారంభించండి. మీ హృదయ చక్రం వద్ద నమస్కార ముద్రలో ఉండి, మీ చేతులను పైకి లేపండి. మీ మోకాళ్ళను వంచి, మీ కటిని నెమ్మదిగా తగ్గించండి. మోకాళ్ల వద్ద 90 డిగ్రీల వంపుతో మీ పెల్విస్ నేలకి సమాంతరంగా ఉందని నిర్ధారించుకోండి. మీ దృష్టిని మీ నమస్కారం వైపు కేంద్రీకరించండి. మీ వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోండి.

2. తడాసనం- Mountain Pose

దీనినే సమస్థితి కూడా అంటారు. మీ రెండు కాళ్లను పాదాలు తగిలేలా దగ్గరకు చేర్చి నిటారుగా నిలబడండి. ఆపై మీ చేతులను పైకి చాచి ఉంచండి. మెల్లగా కళ్ళు మూసుకొని, శరీరాన్ని రిలాక్స్ చేయండి. సాధ్యమైనంత సేపు ఈ భంగిమలో ఉండండి.

3. ఏక్ పదసానం - Standing Balance Pose

ఒంటికాలిపై శరీరాన్ని నిలిపి ఉంచే భంగిమ ఇది. నమస్కార ముద్రతో ప్రారంభించండి. మీ వీపును నిటారుగా ఉంచి, మీ చేతులను పైకి చాచండి. ఊపిరి పీల్చుకోండి. ఇప్పుడు మీ వీపు భాగాన్ని ముందుకు వంచండి, నేలకి సమాంతరంగా ఉండే వరకు వంచండి. మీ చేతులను మీ చెవుల పక్కన ఉంచండి. నెమ్మదిగా మీ కుడి కాలును పైకి ఎత్తండి, దానిని నిటారుగా వెనకకు చాచి ఉంచండి. నేలపై ఒక చోట మీ చూపులను కేంద్రీకరించండి. ఇలా ఒకవైపు కాగానే మరోవైపు ఇలా చేయాలి.

4. ప్రపదాసనం - Tip Toe Pose

మలాసనం లేదా వజ్రాసనంతో ప్రారంభించండి. మీ పాదాలను ఒకచోట చేర్చి, మీ శరీరాన్ని మీ కాలి మడమల మీద సమతుల్యం చేయండి, మీ వీపును నిటారుగా ఉంచండి. మీ అరచేతులను రెండు పక్కలా చాచి, మీ కనుబొమ్మల మధ్య దృష్టి కేంద్రీకరించండి. ఈ భంగిమలో 10-20 సెకన్ల పాటు శ్వాస తీసుకోండి.

5. వృక్షాసనం- Tree Pose

ఒంటికాలిపై శరీరాన్ని నిలిపే భంగిమ ఇది. సమస్థితిలో నిలబడి ప్రారంభించండి. మీ కుడి కాలును ఎత్తి, మీ ఎడమ లోపలి తొడపై ఉంచండి. మీ అరచేతులతో మీ పాదానికి మద్దతు ఇవ్వవచ్చు. సమతుల్యతను కనుగొనండి, మీ హృదయ చక్రం వద్ద ప్రాణం ముద్రలో మీ అరచేతులను కలపి, ఆకాశం వైపు ఎత్తండి. మరో కాలుతో అదే పునరావృతం చేయండి.

టాపిక్