Sleeping Bed : మీ మంచం వయసు ఎంత? మార్చకుంటే హెల్త్​పై ఎఫెక్ట్-sleeping bed affects your health need to be replace your bed ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sleeping Bed : మీ మంచం వయసు ఎంత? మార్చకుంటే హెల్త్​పై ఎఫెక్ట్

Sleeping Bed : మీ మంచం వయసు ఎంత? మార్చకుంటే హెల్త్​పై ఎఫెక్ట్

HT Telugu Desk HT Telugu
Apr 02, 2023 08:00 PM IST

Sleeping Bed : మీరు నిద్రలేమి లేదా ఆలస్యంగా నిద్రపోవడం, వెన్నునొప్పి లేదా ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? అయితే దీనికి కారణం మీరు పడుకునే మంచం కూడా కావొచ్చు. మీరు నిద్రపోయే మంచం కూడా మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unsplash)

మీరు పడుకునేందుకు మంచం త్వరగా ఎక్కినా.. నిద్రపట్టడం లేదా? మీరు ఆలస్యంగా నిద్రపోతున్నట్లయితే, వెన్నునొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే మీ పరుపును మార్చడానికి సమయం అయింది కావచ్చు. మీ మంచం కొని ఎన్ని రోజులు అవుతుంది? మొదట, మీ mattress ఎంత పాతదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు పరుపును కొని పదేళ్లు దాటితే, అది మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏడేళ్లకు మంచి ఒకే పరుపును ఉపయోగించడం మంచిది కాదు.

సంవత్సరాలు గడిచేకొద్దీ, మీరు ఉపయోగించే mattress నాణ్యత క్షీణిస్తుంది. మీ శరీర భాగాలు చేతులు, కాళ్ళు నొప్పికి గురవుతాయి. ఇది నిద్రలేమికి కారణమవుతుంది.

మీ mattress మరకలు లేదా అసహ్యకరమైన వాసన కలిగి ఉందా? ఒకటి మీరు మీ మంచం శుభ్రం చేయాలి. చాలా పాతది అయితే దాన్ని మార్చండి. ఎందుకంటే mattressపై చాలా బ్యాక్టీరియా, దుమ్ము, శరీర ద్రవాలను గ్రహిస్తుంది. ఇది మీ శరీరంలో ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందడానికి దారితీస్తుంది.

అంతేకాకుండా, తడి జుట్టుతో నిద్రించడం చాలా అపరిశుభ్రమైనది. ఎందుకంటే దిండు, మంచం మీ తడి జుట్టు నుండి నీటిని పీల్చుకుంటాయి. ఇది బ్యాక్టీరియా పెరుగుదలకు దారితీస్తుంది. చెమట, మృత చర్మ కణాలు, నూనెలు మీ పరుపులో ఉంటాయి. దీంతో వాసనతోపాటు బ్యాక్టీరియా కూడా పేరుకుపోతుంది.

మృదువైన పరుపు మీకు మంచి నిద్రను ఇస్తుంది. నాణ్యమైన కుషనింగ్‌తో కూడిన మృదువైన పరుపును ఎంచుకోవడం చాలా ముఖ్యం. లేదంటే సరిగ్గా నిద్రపోకపోవడం, వెన్నునొప్పి వంటి వ్యాధులకు దారి తీస్తుంది.

మరోవైపు పరుపుల తయారీలో ఫార్మల్డ్ హైడ్, బెంజీన్, నాఫ్తలీన్ లాంటివి ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటి కారణంగా కళ్లు(Eyes), ఊపిరితిత్తులు, చర్మానికి సంబంధించిన సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. అలర్జీలు, దురదలు, ఇన్ఫెక్షన్ల(Infections) బారిన పడే అవకాశం ఉంది. నాఫ్తలీన్ కారణంగా మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉంది. నాఫ్తలీన్ అనే రసాయనం కారణంగా పొత్తి కడుపులో నొప్పి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెప్పేమాట.

బెంజీన్ కారణంగా కడుపులో అల్సర్ వచ్చే అవకాశం ఉంది. దీనివలన ఆరోగ్యంగా ఉండే కణాలు క్యాన్సర్ కణాలు మారే ఛాన్స్ ఉంది. స్పాంజి పరుపుల ద్వారా వేడి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ కారణంగా మన మీద చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. పరుపుల్లో ఉండే కుషనింగ్ కారణంగా వాటి మీద పడుకుంటే.. మన శరీర ఆకృతి మారుతుంది. దీనుల్ల డిస్క్ లపై ఒత్తిడి పడుతుంది. డిస్క్ లు పక్కకు జరగడం ఉంటుంది. డిస్క్ లు పక్కకు జరిగితే.. నరాలు, వెన్నుపాముపై ఒత్తిడి(Stress) పడుతుంది. దూదితో తయారు చేసే పరుపులకు ప్రాధాన్యత ఇవ్వండి.

అయితే నేలపై పడుకుంటే(Sleeping On Ground) చాలా మంచిది. మెుదట కాస్త ఇబ్బంది ఉన్నా.. అలవాటు అయితే.. మంచి నిద్ర వస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. నేలప నిద్రిస్తే.. ఒత్తిడి తగ్గుతుంది. మెంటల్ హెల్త్ కండీషన్ బాగుంటుంది. వెన్నునొప్పితో బాధపడే వాళ్లు.. నేలపై పడుకుంటే ఆరోగ్యం. శరీరాకృతి కూడా మెరుగవుతుంది.

Whats_app_banner