Woman Killed, Body Stuffed In Mattress: ‘ప్రియురాలిని చంపి.. పరుపులో కుక్కి..’-woman killed allegedly by live in partner body stuffed in mattress in maharashtra ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Woman Killed, Body Stuffed In Mattress: ‘ప్రియురాలిని చంపి.. పరుపులో కుక్కి..’

Woman Killed, Body Stuffed In Mattress: ‘ప్రియురాలిని చంపి.. పరుపులో కుక్కి..’

HT Telugu Desk HT Telugu
Feb 14, 2023 10:51 PM IST

Woman Killed, Body Stuffed In Mattress: మహారాష్ట్రలో దారుణం వెలుగుచూసింది. తనతో సహజీవనం చేస్తున్న యువతిని దారుణంగా హతమార్చి, మృతదేహాన్ని పరుపులో కుక్కి పారిపోయాడో రాక్షసుడు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

మహారాష్ట్ర (maharashtra) లోని పాల్ఘార్ (palghar) జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. పాల్ఘార్ జిల్లాలోని తులింజ్(tulinj) ప్రాంతంలో ఒక అద్దె ఇంట్లో తనతో సహజీవనం చేస్తున్న యువతిని ఒక యువకుడు దారుణంగా హతమార్చాడు.

Woman Killed, Body Stuffed In Mattress: మృతదేహాన్ని పరుపులో కుక్కి పారిపోయాడు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాల్ఘార్ జిల్లాలోని తులింజ్ ప్రాంతంలో ఈ జంట సహజీవనం చేస్తుండేవారు. వారిలో యువతి మేఘ నర్స్ గా పని చేసేది. ఆ యువకుడు ఏ పని చేసేవాడు కాదు. దానికి తోడు వ్యసనాలకు కూడా బానిసయ్యాడు. దాంతో, వారిమధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. గత వారం వారి మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. ఆ కోపంలో ఆమెను హతమార్చిన యువకుడు ఆమె మృతదేహాన్ని పరుపులో కుక్కి అక్కడి నుంచి పారిపోయాడు.

Woman Killed, Body Stuffed In Mattress: ఇరుగుపొరుగు ఫిర్యాదుతో..

కొన్ని రోజుల తరువాత వారు ఉన్న గది నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దాంతో, అక్కడికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మార్చురీకి తరలించారు. ఆ తరువాత రైళ్లో పారిపోతున్న నిందితుడిని మధ్య ప్రదేశ్ లోని నాగ్దా ప్రాంతంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (Railway Protection Force) సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.

Whats_app_banner