Yoga Poses for Healthy Lungs : ఊపిరి తీసుకోవడానికి ఊపిరితిత్తులు.. వాటిని హెల్తీగా చేసే యోగాసనాలు..
Yoga Poses for Healthy Lungs : చలికాలంలో శ్వాస సంబంధమైన వ్యాధులు, జబ్బులు రావడం మనం చూస్తూనే ఉంటాము. శ్వాస తీసుకోవడంలో ఊపిరితిత్తులు ముఖ్యపాత్ర పోషిస్తాయి. కాబట్టి వాటిని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే సులభమైన యోగ ఆసనాలతో.. మీ ఊపిరిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అంటున్నారు.
Yoga Poses for Healthy Lungs : మన జీవితం మన శ్వాస మీదే ఆధారపడి ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ముఖ్యపాత్ర పోషించేది ఊపిరిత్తులు. ఇవి ఎంత బలంగా ఉంటాయి అనే దానిమీదనే.. మనం శ్వాస ప్రక్రియ ఆధారపడి ఉంటుంది. అయితే మన ఊపిరితిత్తులు టాక్సిన్స్ లేకుండా, అన్ని సమయాలలో బాగా పనిచేస్తాయని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం.
ఊపిరితిత్తులు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. ధూమపానం వంటివాటికి దూరంగా ఉండడం వల్ల మీ లంగ్స్ సేఫ్ ఉంటాయి. అలాగే మీరు కొన్ని యోగా ఆసనాలు ప్రయత్నించి.. రోజూ చేస్తే.. మీ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి అంటున్నారు. ఇంతకీ ఊపిరితిత్తులను హెల్తీగా చేసే ఆసనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
భుజంగాసనం
నేలపై పడుకుని ముఖం కిందికి ఉంచి.. మీ చేతులను మీ భుజాల పక్కన ఉంచండి. మీ కాళ్లను వీలైనంత వరకు సాగదీయండి. నెమ్మదిగా గాలి పీల్చుకోండి. ఆపై మీ శరీరాన్ని పైకి ఎత్తండి.
మీ కాలి, పుబిస్ సరళ రేఖను ఏర్పరుచుకుని నేలను తాకినట్లు నిర్ధారించుకోండి. ఈ ఆసనంలో సుమారు 20 నుంచి 30 సెకన్ల పాటు ఉండండి. తర్వాత ఊపిరి వదులుతూ అసలు స్థితికి చేరుకోవాలి.
మత్స్యాసనం
లోటస్ భంగిమలో లాగా పడుకుని.. మీ కాళ్లను ఒకదానితో ఒకటి క్రాస్ చేయండి. నెమ్మదిగా మీ ఎగువ శరీరాన్ని పైకి ఎత్తండి. ఇది ఒక వంపుని ఏర్పరుస్తుంది. మీ తలను నేలపై ఉంచి.. మీ చేతులు మీ పాదాలను తాకాలి.
20 సెకన్ల పాటు ఈ ఆసనంలో ఉండండి. అదే సమయంలో మీ శ్వాసపై దృష్టి పెట్టండి. పూర్తయిన తర్వాత విశ్రాంతి తీసుకోండి. ఇది మీ ఊపిరితిత్తులను బలోపేతం చేయడానికి సహాయం చేస్తుంది. అంతేకాకుండా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
సుఖాసనం
సుఖాసన అనేది మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా చేయగలిగే సులభమైన యోగ భంగిమ. మీరు చేయాల్సిందల్లా.. నేలపై కాలు వేసుకుని కూర్చుని, మీ చుట్టూ ఉన్న వాతావరణం నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోండి.
కనీసం ఒక నిమిషం పాటు మీ కళ్లు మూసుకుని లోతైన శ్వాస తీసుకోండి. సౌకర్యవంతంగా ఉంటే దాన్ని మరో నిమిషం వరకు పొడిగించండి. ఈ సులభమైన యోగాసనం మీకు బాగా ఊపిరి పీల్చుకోవడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా మీ ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుంది.
కపాలా భాతి ప్రాణాయామం
లోటస్ భంగిమలో మీ వెన్నెముక నిటారుగా ఉంచి సౌకర్యవంతంగా కూర్చోండి. మీ అరచేతులను మీ మోకాళ్లపై తలక్రిందులుగా ఉంచండి. ముక్కు ద్వారా పీల్చుకుంటూ.. మీ బొడ్డు, నాభిని మీ వెన్నెముక వైపునకు లాగండి.
మీ ముక్కు ద్వారా తక్షణమే ఊపిరి పీల్చుకోండి. మీ బొడ్డును విశ్రాంతి తీసుకోనివ్వండి. మీరు మీ కళ్లు మూసుకుని ఈ భంగిమను 10 సార్లు పునరావృతం చేయకోవచ్చు. ఈ ఆసనం ఊపిరితిత్తుల బలాన్ని పెంచడంలో సహాయపడుతుంది.
ధనురాసనం
నేలపై పడుకుని మీ ముఖాన్ని కిందకి ఉంచండి. మీ మోకాళ్లను వంచి, మీ చేతులతో మీ పాదాలను పట్టుకోండి. శ్వాస పీల్చుకోండి. మీ ఛాతీ, భుజాలతో పాటు మీ చేతులు, పాదాలను ఎత్తండి.
30 సెకన్ల పాటు ఈ స్థితిలో ఉండండి. ఒకసారి పూర్తి చేసిన తర్వాత, ఊపిరి వదులుతూ అసలు భంగిమకు తిరిగి వెళ్లండి. ఈ ఆసనం చేయడం వల్ల మీ ఊపిరితిత్తులు టాక్సిన్స్ నుంచి బయటపడతాయి. అంతేకాకుండా మీరు బాగా ఊపిరి పీల్చుకోవడానికి సహాయపడతాయి.
సంబంధిత కథనం