Mouth Ulcers Causes, Treatment: నోటి అల్సర్లకు కారణాలు, చికిత్స ఇవే
Mouth Ulcers Causes, Treatment: నోటి అల్సర్లకు కారణాలు, చికిత్స ఇక్కడ తెలుసుకోండి.
మౌత్ అల్సర్స్ అంటే నోటిలో ఏర్పడే పుండ్లు. వీటి వల్ల చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. తినడం లేదా త్రాగడం ఇబ్బందిగా ఉంటుంది. ఒక వారం లేదా రెండు వారాల్లో వాటంతట అవే నయమవుతాయి. ఇంకా త్వరగా నయం కావాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
మౌత్ అల్సర్లకు కారణాలు ఇవే..
గాయం: ప్రమాదవశాత్తూ మీ చెంప లేదా పెదవిని కొరకడం లేదా గట్టి ముళ్ళతో కూడిన టూత్ బ్రష్‌ను ఉపయోగించడం వల్ల నోటిలో పుండ్లు ఏర్పడవచ్చు.
ఆహారాలు: మసాలా లేదా ఆమ్ల ఆహారాలు నోటి పొరలను దెబ్బతీస్తాయి. నోటి పూతలను ప్రేరేపిస్తాయి.
పోషకాహార లోపాలు: విటమిన్లు బీ12, బీ6, బీ2, ఫోలేట్, ఐరన్ మరియు జింక్ లేకపోవడం నోటి పూతల ప్రమాదాన్ని పెంచుతుంది.
హార్మోన్ల మార్పులు: కొంతమంది స్త్రీలు తమ రుతుక్రమం కారణంగా నోటిపూతలను గమనించవచ్చు.
ఒత్తిడి: ఎమోషనల్ స్ట్రెస్ రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. నోటిపూతలకు కారణమవుతుంది.
కొన్ని మందులు: నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (ఎన్ఎస్ఏఐడీ) వంటి కొన్ని మందుల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల నోటిపూతలు వస్తాయి.
మౌత్ అల్సర్స్ త్వరగా నయం కావాలంటే..
చికిత్స: బెంజోకైన్ లేదా లిడోకాయిన్ కలిగిన క్రీమ్‌లు లేదా జెల్ నోటి అల్సర్ల నుంచి ఉపశమనం ఇస్తాయి. మీరు బేకింగ్ సోడా, నీటితో కలిపి చేసిన పేస్ట్‌ని అల్సర్‌పై అప్లై చేయడం ద్వారా కూడా ఉపశమనం పొందవచ్చు.
ఉప్పు నీటితో శుభ్రం చేసుకోండి: గోరువెచ్చని ఉప్పు నీటితో పుక్కిలించడం వల్ల వాపు తగ్గుతుంది. ఒక కప్పు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ ఉప్పు కలపండి. ఉమ్మివేయడానికి ముందు సుమారు 30 సెకన్ల పాటు పుక్కిలించండి.
వీటికి దూరంగా ఉండండి: నోటి అల్సర్లను మరింత పెంచేలా స్పైసీ లేదా యాసిడ్స్‌తో కూడిన ఆహారాలకు దూరంగా ఉండండి. అలాగే, ధూమపానం లేదా పొగాకు ఉత్పత్తులను ఉపయోగించడం మానుకోండి. లేదంటే నయం కావడంలో జాప్యం అవుతుంది.
మృదువైన టూత్ బ్రష్‌ను ఉపయోగించండి: మెత్తని ముళ్ళతో కూడిన టూత్ బ్రష్‌తో మీ దంతాలను సున్నితంగా బ్రష్ చేయొచ్చు. ఇది పుండ్లను మరింత చికాకు పెట్టకుండా ఆ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది.
మౌత్ అల్సర్లు తరచుగా వస్తుంటే లేదా మీ నోటి పూతలు రెండు వారాల కంటే ఎక్కువ కాలం ఉంటే, మీ వైద్యుడిని లేదా దంతవైద్యుడిని సంప్రదించడం మంచిది.
సంబంధిత కథనం
టాపిక్