Happy Holi 2023 | హోలీ పండుగ శుభాకాంక్షలు.. రంగులు చల్లుకుంటూ వేడుక చేసుకోండి!
06 March 2023, 17:59 IST
- Happy Holi 2023: రంగుల పండుగ హోలీ వచ్చేసింది.. మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు, మీ స్నేహితులు శ్రేయోభిలాషులతో పంచుకోవడానికి హోలీ సందేశాలను ఇక్కడ చూడండి.
Happy Holi 2023
Happy Holi 2023: రంగుల పండుగ హోలీ మళ్లీ రానే వచ్చేసింది, రంగు రబ్బా రబ్బా అంటూ రంగులు చల్లుకుంటూ వేడుకలు చేసుకునే సమయం ఆసన్నమైంది. హోలీ పండుగను ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువులు అందరూ ఆనందంగా జరుపుకునే పండగ. పురాతన కాలం నుంచి హోలీకి ఎంతో పాముఖ్యత ఉంది, పురాణాలలోనూ హోలీ వేడుకలు జరుపుకున్నట్లు ఉంది. హోలీ మన భారతీయ సంస్కృతిలో భాగం, ప్రతీ ఒక్కరూ పాటించాల్సిన సాంప్రదాయం.
చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు, సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు అందరూ సంతోషకరమైన వాతావరణంలో హోలీ వేడుకల్లో పాలుపంచుకుంటారు, ఒకరిపై ఒకరు బుక్కాగులాల్ చల్లుకుంటారు. హోలీ వేడుకల కోసం ఎవరి ప్రణాళికలు వారికి ఉంటాయి. చిన్నపిల్లలు రంగు తుపాకీలతో తమ తోటివారిపై రంగు నీళ్లను పిచికారి చేస్తూ కేరింతలు కొడతారు. బావామరదళ్లు చెక్కిళ్లపై రంగులు పులుముకుంటూ ఆత్మీయతను పంచుకుంటారు. స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరూ బృందంగా తిరుగుతూ హోలీ రంగుల్లో తడిసి ముద్దవుతారు. హోలీ పాటలు పాడుతూ, హోలీ ఆటలు ఆడుతూ అందరి చిరునవ్వులలో రంగుల హరివిల్లును సృష్టించేందుకు ఇదే సమయం.
మీరు కూడా హోలీ వేడుకలను మరపురాని విధంగా జరుపుకోండి. రంగులు చల్లుతూ మీ ఆత్మీయులకు హోలీ శుభాకాంక్షలు తెలియజేయండి. మీకు దూరంగా ఉన్న వారిని కూడా హోలీ వేడుకల్లో పాలుపంచుకునేలా చేయండి. ఈ హోలీ పండగ సందర్భంగా మీరు మీ ప్రియమైన వారితో పంచుకోవడానికి Happy Holi Wishes, Holi Greetings, Holi Messages, Happy Holi Quotes ఇక్కడ అందజేస్తున్నాం. ఇవి మీ సోషల్ మీడియా ద్వారా మీకు దూరంగా ఉన్నవారికి హోలీ శుభాకాంక్షలు తెలియజేయడానికి ఉపయోగపడతాయి.
Happy Holi 2023 Wishes - హోలీ పండగ శుభాకాంక్షలు
రంగుల పండుగ వచ్చింది.. ఆనందాల హరివిల్లును తెచ్చింది.
హోలీ శుభాకాంక్షలు!
ఈ హోలీ పండుగ మీ జీవితాన్ని రంగులమయం చేయాలి..
హోలీ శుభాకాంక్షలు!
హోలీ పండుగ మీ కుటుంబంలో సుఖసంతోషాలు తేవాలి,
మీ జీవితం పచ్చదనంతో వెలగాలని కోరుకుంటూ.. హోలీ శుభాకాంక్షలు!
రంగుల పువ్వులు వికసించే ఈ వసంతం
మీకు మీ కుటుంబ సభ్యులకు ఈ హోలీ పండుగతో నవ వసంతం.
హోలీ శుభాకాంక్షలు!
ఈ రంగుల పండుగను అందరూ సామరస్యంగా, సుహృద్భావ వాతావరణంలో జరుపుకోవాలి, మీ అనుబంధాలు వికసించాలని కోరుకుంటూ హిందూస్తాన్ తెలుగు తరఫున మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు. సహజమైన రంగులు వాడండి, రసాయన రంగులను నివారించండి, సురక్షితంగా వేడుకలు జరుపుకోండి.