తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Holi Festival Facts | హోలీ పండుగ గురించి మీకు తెలియని విషయాలు కొన్ని..!

Holi Festival Facts | హోలీ పండుగ గురించి మీకు తెలియని విషయాలు కొన్ని..!

HT Telugu Desk HT Telugu

01 March 2023, 15:52 IST

    • Holi Festival Facts: హోలీ అంటే ఏడాదికి ఒకసారి వచ్చే హిందూ పండగ. ఈరోజున ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటారు. అంతేనా? హోలీ రంగుల పండుగ గురించి బహుశా మీకు తెలియని వాస్తవాలు ఇక్కడ తెలుసుకోండి.
Holi Festival Facts
Holi Festival Facts (AFP)

Holi Festival Facts

Holi Festival Facts: హోలీని 'రంగుల పండుగ' అని కూడా పిలుస్తారు, ఇది భారతదేశంలోనే కాకుండా నేపాల్‌లో కూడా ప్రధానంగా జరుపుకునే హిందూ పండుగ. సాధారణంగా ఫిబ్రవరి చివరలో లేదా మార్చి ప్రారంభంలో, హిందూ మాసంలోని ఫాల్గుణ పౌర్ణమి రోజున దీనిని జరుపుకుంటారు. ఈ 2023వ సంవత్సరంలో హోలీని మార్చి 8న జరుపుకుంటున్నాము.

ట్రెండింగ్ వార్తలు

Patha Chinthakaya Pachadi: పాత చింతకాయ పచ్చడి ఇలా చేసుకున్నారంటే దోశె, ఇడ్లీ, అన్నంలోకి అదిరిపోతుంది

Diabetes and Methi water: ఖాళీ పొట్టతో మెంతి నీళ్లు తాగి చూడండి, నెలలోనే మ్యాజిక్ చూస్తారు

Cherakurasam Paramannam: పంచదారకు బదులు చెరుకు రసంతో పరమాన్నాన్ని వండి చూడండి, ఎంతో ఆరోగ్యం

Garlic Peel: వెల్లుల్లిని పొట్టు తీసి వాడుతున్నారా? ఎన్ని పోషకాలను నష్టపోతున్నారో తెలుసా?

హోలీ రోజున ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడం తెలిసిందే, అంతేనా? కానీ ఇది మాత్రమే కాదు హోలీ రోజు రంగులను అందరు చల్లుకోరు. ముఖ్యంగా సోదర బంధం కలిగిన వారు ఒకరికొకరు చల్లుకోరు, తోడబుట్టిన వారిపై రంగులు చల్లరు. ఈ రంగు చల్లడం అనేది బావా మరదల్లు, వరస అయ్యే వారితోనే రంగులాట ఆడతారు. అయితే స్నేహితులకు, పరిచయం లేని వారికి కూడా ఈ రంగులు చల్లవచ్చు. అందుకే గొడవలు జరగకుండా హిందీలో ఒక పాపులర్ సామెత ఉంటుంది.. 'బురా నా మానో హోలీ హై' అని. పరిచయంలేని వారిపై రంగు చల్లినపుడు, వారు కోప్పడకుండా.. తప్పుగా అర్థం చేసుకోకండి.. ఈరోజు హోలీ పండగ, వేడుకల్లో పాల్గొనండి అంటూ హోలీని జరుపుకోవడాన్ని సూచిస్తుంది.

హోలీ సందర్భంగా అంతగా తెలియని సంప్రదాయాలలో ఒకటి ఉత్తర ప్రదేశ్‌లోని బర్సానా పట్టణంలో జరుపుకునే 'లాత్మార్ హోలీ', ఇక్కడ మహిళలు పురుషులను కర్రలతో కొడుతూ, సరదా యుద్ధంలో పాల్గొంటారు. మగవారిని రెచ్చగొట్టే విధంగా పాటలు పాడతారు. రాధాకృష్ణుల ప్రేమకు చిహ్నంగా హోలీ పండుగ జరుపుకుంటారు.

ప్రజలకు అంతగా తెలియని మరొక హోలీ సంప్రదాయం బృందావన్, మధురలో జరుపుకునే 'ఫూలోన్ కి హోలీ' పండుగ. హోలీని జరుపుకోవడానికి రంగులకు బదులుగా పువ్వులు ఉపయోగిస్తారు.

లాత్మార్ హోలీ, ఫూల్ కీ హోలీ నుంచి లడ్డూ మార్ హోలీ వచ్చింది, దీంట్లో లడ్డూలు విసురుకుంటారు. ఇది క్రమంగా రూపాంతరం చెందుతూ టొమాటోలు, కోడిగుడ్లు విసురుకోవడం ప్రారంభమైంది.

భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో హోలీని 'డోల్ జాత్రా' లేదా 'డోల్ పూర్ణిమ' అని కూడా పిలుస్తారు. అలంకరించిన ఊయల మీద శ్రీకృష్ణుడు, రాధ విగ్రహాలను ఊరేగిస్తూ జరుపుకుంటారు.

హోలీ రోజున భాంగ్ తాగడం ఒక సాంప్రదాయం. కొన్నిసార్లు ఇది సమస్యాత్మకంగా కూడా పరిణమిస్తుంది. హోలీ వేసవిలో వస్తుంది. రంగులు చల్లినపుడు శరీరం ఆ మంట, చికాకు నుంచి ఉపశమనం పొందేందుకు గంజాయి మూలికలు కలిపిన తాండయి సేవిస్తారు. శివుడు బూడిద చల్లుకొని తాండై సేవిస్తాడు అనే పురాణ కథలు ఉంటాయి. హోలీ పండుగ శివునితో ముడిపడి ఉంటుంది కాబట్టి, భాంగ్ తాగడం సాంప్రదాయంగా కొంతమంది పాటిస్తారు.

నేపాల్‌లో జరుపుకునే హోలీ పండుగను ఫాగు పూర్ణిమ లేదా హోలియా అని పిలుస్తారు. భారతదేశంలో హిందువులు జరుపుకున్నట్లే వీరి వేడుకలు ఉంటాయి. కామదహనం చేస్తారు, రంగు నీళ్లు చల్లుకుంటారు. హోలీ రోజు నేపాల్ జాతీయ సెలవుదినం కూడా.

ఇటీవలి సంవత్సరాలలో, హోలీ ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రసిద్ధ పండుగగా మారింది, అనేక దేశాలు తమ సొంత హోలీ ఈవెంట్‌లు, వేడుకలను నిర్వహిస్తున్నాయి.

టాపిక్

తదుపరి వ్యాసం