Holi 2023 | మీ హోలీని హాలిడే ట్రిప్‌గా మార్చుకోండి.. ఈ బీచ్ ప్రాంతాలకు వెళ్లి రంగుల వేడుక చేసుకోండి!-make your holi a holiday vacation go to these beach destinations to celebrate festival of colors ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Holi 2023 | మీ హోలీని హాలిడే ట్రిప్‌గా మార్చుకోండి.. ఈ బీచ్ ప్రాంతాలకు వెళ్లి రంగుల వేడుక చేసుకోండి!

Holi 2023 | మీ హోలీని హాలిడే ట్రిప్‌గా మార్చుకోండి.. ఈ బీచ్ ప్రాంతాలకు వెళ్లి రంగుల వేడుక చేసుకోండి!

HT Telugu Desk HT Telugu
Mar 01, 2023 11:33 AM IST

Beach Getaways for Holi: మీరు మీ స్నేహితులు లేదా మీ భాగస్వామి లేదా మీ కుటుంబంతో కలిసి ఏదైనా ఈ హోలీకి ఏదైనా టూర్ ప్లాన్ చేయండి. మీ హోలీని హాలిడేగా మార్చుకోండి.

Beach Getaways for Holi
Beach Getaways for Holi (istock)

Holi 2023: మార్చి నాటికి, భారతదేశంలో శీతాకాలం వెళ్లిపోతుంది అలాగే వసంతకాలం నుంచి ఎండాకాలానికి సమయం కదులుతుంది. ఈ సమయంలోనే రంగుల పండుగ -హోలీ వస్తుంది. ప్రజలు చిన్నా పెద్దా తేడాలేకుండా రంగులు చల్లుకుంటూ ఆహ్లాదకరంగా హోలీ వేడుకలను జరుపుకుంటారు.

కొందరికీ హోలీ ఆడాలని ఉన్నా, రంగు చల్లటానికి ఎవరూ ఉండరు. మరికొందరికి హోలీ ఆడాలంటే వారి అందం దెబ్బతింటుందేమోనన్న భయం. మరి కొందరికి అసలు ఎలాంటి ఆసక్తి లేకుండా ఇంట్లోనే గడిపేస్తారు. కానీ, ఏ పండగైనా ప్రధాన ఉద్దేశ్యం అన్నీ మరిచిపోయి హాయిగా అందరితో గడపడం, కలిసి వేడుక చేసుకుంటూ ఆనందంగా ఉండటం. మరి అలాంటపుడు హోలీ వేడుకలను ఎందుకు మిస్ చేసుకోవడం. మీ హోలీని హాలిడేగా మార్చుకోండి. భారతదేశంలో ఒక్కోచోట ఒక్కోలా హోలీ వేడుకలు జరుపుకుంటారు. మీరు మీ స్నేహితులు లేదా మీ భాగస్వామి లేదా మీ కుటుంబంతో కలిసి ఏదైనా ఈ హోలీకి ఏదైనా టూర్ ప్లాన్ చేయండి.

Beach Getaways for Holi- సాగరతీరంలో హోలీ వేడుకలు

బీచ్‌లో హోలీ ఆడితే ఆ జోష్ మామూలుగా ఉండదు. హోలీకి నీటి వృధా సమస్యే ఉండదు, సముద్రమంత నీటిని తోడుకోవచ్చు, వాడుకోవచ్చు. హోలీనీ సాగరతీరాన సెలెబ్రెట్ చేసుకోవటానికి ఇవిగో ఉత్తమ ప్రదేశాలు.

గోవాలో హోలీ

ఈ హోలీని గోవాలో సెలెబ్రేట్ చేసుకోండి. క్రిస్మస్, న్యూ ఇయర్ సమయంలోనే కాకుండా హోలీ సమయంలో కూడా దేశం నలువైపుల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు ఈ పార్టీ హబ్‌ను సందర్శిస్తారు. గోవాలో హోలీ కేవలం పార్టీ లాగే కాకుండా స్థానికంగా ఉండే గోవా ప్రజలు తమదైన సాంప్రదాయరీతిలో హోలీని జరుపుకుంటారు. పాతకాలం నుంచే డప్పులు, ఊరేగింపులతో ఇక్కడ హోలీ సంబరాలు జరుగుతూ వస్తున్నాయి.

అలీబాగ్‌లో హోలీ

ముంబై నగరానికి సుమారు 90 కిమీ దూరంలో కొంకణ్ ప్రాంతంలోని రాయగడ జిల్లాలో ఉన్న ఒక అందమైన తీర పట్టణం. అలీబాగ్ భారతదేశంలో తప్పనిసరిగా సందర్శించవలసిన బీచ్ లలో ఒకటి. ఇక్కడ చాలా ఈవెంట్స్ జరుగుతుంటాయి, క్యాపింగ్ పెట్టుకొని రాత్రంతా అక్కడే గడుపుతారు కూడా. ఎన్నో రిసార్టులు కూడా ఉన్నాయి. మీ హోలీని ఇక్కడ కూడా ప్లాన్ చేసుకోవచ్చు.

వైజాగ్‌లో హోలీ

తెలుగు రాష్ట్ర ప్రజలకు ఇది అత్యంత సన్నిహితమైన రేవు పట్టణం వైజాగ్. ఇది కూడా ఒక గొప్ప బీచ్ హాలిడే డెస్టినేషన్. ఇక్కడ ప్రజలు బీచ్‌ల వెంట షికారు చేస్తూ రిలాక్స్‌గా సాయంత్రాలు ఆనందిస్తారు. సందర్శకులకు చిరస్మరణీయమైన బసను నిర్ధారించడానికి బీచ్ సమీపంలో అనేక రిసార్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. మీ హోలీని సెలబ్రేట్ చేసుకోవడనికి వైజాగ్ బీచ్ వెళ్లండి.

కోవలంలో హోలీ

మీరు ఈ హోలీలో సరదాగా బీచ్ సెలవులు గడపాలని కోరుకుంటే, ప్రశాంతమైన నీరు, మృదువైన ఇసుక, ఊగుతున్న కొబ్బరి చెట్లకు ప్రసిద్ధి చెందిన కోవలం బీచ్‌లకు వెళ్లండి. ఇక్కడ ఉన్నప్పుడు, లైట్‌హౌస్ బీచ్, కోవలం బీచ్, హవా బీచ్, వర్కాల బీచ్, సముద్ర బీచ్, ప్రసిద్ధ బీచ్‌లను మిస్ అవ్వకండి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్