తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Beetroot Pulao Recipe । లంచ్‌లో బీట్‌రూట్ పులావ్ తినండి.. దీనిలో పోషకాలు దండి!

Beetroot Pulao Recipe । లంచ్‌లో బీట్‌రూట్ పులావ్ తినండి.. దీనిలో పోషకాలు దండి!

HT Telugu Desk HT Telugu

10 March 2023, 13:41 IST

    • Beetroot Pulao Recipe: బీట్‌రూట్ లో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. ఇది రక్తహీనతను నివారిస్తుంది, మీ లంచ్ లోకి బీట్‌రూట్ పులావ్ రెసిపీని ఇక్కడ చూడండి.
Beetroot Pulao Recipe
Beetroot Pulao Recipe (Shutterstock)

Beetroot Pulao Recipe

మీరు మీ లంచ్‌లో రోజూతినే ఆహారం మీకు శక్తిని అందించడమే కాకుండా మీ దీర్ఘకాలిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. ప్రతిరోజూ జంక్ ఫుడ్ తినడం, భోజనంలో తగినంత పీచుపదార్థం లేకపోతే మధుమేహం, గుండె జబ్బుల మొదలైన దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలను పెంచుతుంది. కాబట్టి మీ మధ్యాహ్న భోజనంలో సీజనల్ వెజిటేబుల్స్, సలాడ్‌లు, పెరుగు, కాయధాన్యాలు వంటివి ఉండేలా చూసుకోండి. మీ మధ్యాహ్న భోజనంలో అప్పుడప్పుడు బీట్‌రూట్ తినడం మంచి ఛాయిస్ అవుతుంది.

ట్రెండింగ్ వార్తలు

Coconut Chutney: మూడు పప్పులు కలిపి ఇలా కొబ్బరి పచ్చడి చేస్తే అన్నంలో అదిరిపోతుంది

Coconut water: కొబ్బరి బోండా నుండి నేరుగా కొబ్బరినీళ్లు తాగకూడదట, ఎందుకో తెలుసుకోండి

Sweating Benefits: చెమట పట్టడం లేదని ఆనందపడకండి, చెమట పడితేనే కిడ్నీలు రాళ్లు చేరవు

Garlic Rice: అన్నం మిగిలిపోతే ఇలా వెల్లుల్లి రైస్ చేసి చూడండి, పులిహోర కన్నా అదిరిపోతుంది

బీట్‌రూట్ విటమిన్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లతో కూడిన సూపర్ ఫుడ్. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది రక్తహీనతను నివారిస్తుంది. ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది కాబట్టి మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. బీట్‌రూట్‌తో రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాలు చేసుకోవచ్చు. ఇక్కడ బీట్‌రూట్ పులావ్ రెసిపీ అందిస్తున్నాం, మీరు మీ లంచ్‌లో ఇలాంటి వంటకం చేసుకొని తినండి.

Beetroot Pulao Recipe కోసం కావలసినవి

  • 1 కప్పు సోనా మసూరి బియ్యం
  • 1 మీడియం బీట్‌రూట్
  • 1 చిన్న ఉల్లిపాయ
  • 1 మీడియం టమోటా
  • 1 పచ్చిమిర్చి
  • 1 tsp. తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్
  • ¼ కప్పు తాజా బఠానీలు
  • ½ బంగాళాదుంప
  • 1 స్పూన్ ధనియాల పొడి
  • 1/4 స్పూన్ పసుపు
  • 1 tsp. తరిగిన కొత్తిమీర
  • 1 tsp. పుదీనా ఆకులు
  • గరం మసాలా దినుసులు (1 ఏలకులు, 2 లవంగం, 1 బే ఆకులు, 1 అంగుళం దాల్చిన చెక్క, 1 స్టార్ సోంపు)
  • 1 టేబుల్ స్పూన్. నెయ్యి
  • రుచికి తగినంత ఉప్పు

బీట్‌రూట్ పులావ్ తయారీ విధానం

  1. ముందుగా బియ్యంను కడిగి, ఒక 20 నిమిషాల పాటు నానబెట్టండి
  2. అనంతరం ఒక కుక్కర్‌లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయండి. అందులో గరం మసాలా దినుసులు వేసి వేయించండి.
  3. ఆపైన ఉల్లిపాయ ముక్కలు, మిరపకాయలను వేసి వేయించాలి.
  4. ఆ తర్వాత అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
  5. అనంతరం టొమాటో ముక్కలు, ధనియాల పొడి, పసుపు వేసి కలపాలి, టమోటాలు మెత్తబడే వరకు వేయించాలి.
  6. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు, బీట్‌రూట్ ముక్కలు, పచ్చి బఠానీలు, కొత్తిమీ, పుదీనా ఆకులు వేసి అన్నీ కలపండి.
  7. ఒక నిమిషం వేగిన తర్వాత, మీ రుచికి తగినట్లుగా నీరు, ఉప్పు కలపండి.
  8. చివరగా నానబెట్టిన బియ్యాన్ని వేసి మూత పెట్టి మీడియం మంట మీద 2 విజిల్స్ వచ్చే వరకు ఆవిరిలో ఉడికించాలి.

అంతే, బీట్‌రూట్ పులావ్‌ రెడీ అయినట్లే.. దోసకాయ రైతాతో తింటూ రుచిని ఆస్వాదించవచ్చు.