Okra Masala Recipe । బెండకాయ మసాలా కూర.. కళ్లకు మంచిది, మధుమేహానికి ఉత్తమైనది!-from eye health to weight loss ladies finger vegetable best here is okra curry bhindi masala recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  From Eye Health To Weight Loss Ladies Finger Vegetable Best, Here Is Okra Curry Bhindi Masala Recipe

Okra Masala Recipe । బెండకాయ మసాలా కూర.. కళ్లకు మంచిది, మధుమేహానికి ఉత్తమైనది!

Okra Masala Recipe
Okra Masala Recipe (istock)

Okra Masala Recipe: బెండకాయ తింటే కళ్లకు మంచిది, మధుమేహం ఉన్నవారికి కూడా ఇది మంచి ఆహారం. కమ్మని బెండకాయ మసాలా కూరను ఎలా చేయాలో ఇక్కడ చూడండి.

బెండకాయ జిగురుగా ఉంటుందని కొంతమంది తినరు. అయితే కంటి చూపు మెరుగుపడాలన్నా, బరువు తగ్గాలన్నా, ఇతర ఆరోగ్య ప్రయోజనాల కోసం ఈ కూరగాయను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బెండకాయలో 'విటమిన్ ఎ' తో పాటుగా కెరోటినాయిడ్లు ఉన్నాయి. ఇవి కళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రేచీకటి, కంటిశుక్లం వంటి సమస్యలు ఉండవు. కంటి చూపుకు విటమిన్ ఎ అవసరమైన పోషకం. మధుమేహం ఉన్నవారికి కూడా బెండకాయ మంచి పోషకాహారం.

ట్రెండింగ్ వార్తలు

మీకోసం ఇక్కడ రుచికరమైన బెండకాయ మసాలా కూర రెసిపీని అందిస్తున్నాం. కొన్ని ఆవాలు నూనె, జీలకర్ర, సోంపు, ఉల్లిపాయలు, అల్లం వంటి పదార్థాలతో బెండకాయ కూరను వండటం వలన ఈ వంటకం రుచికరమే కాకుండా, ఆరోగ్యకరంగా ఉంటుంది. బెండకాయ మసాలా రెసిపీ ఈ కింద ఉంది, ఇక్కడ పేర్కొన్న సూచనల ప్రకారం, సులభంగా తక్కువ సమయంలోనే మీరు దీనిని సిద్ధం చేసుకోవచ్చు. మరి ఆలస్యం ఎందుకు, ఆ రెసిపీని తెలుసుకోండి.

Okra Masala / Masala Bhindi Recipe కోసం కావలసినవి

  • 1/4 కేజీ బెండకాయలు
  • 7-8 టేబుల్ స్పూన్లు ఆవాల నూనె
  • 1 స్పూన్ జీలకర్ర
  • 1 స్పూన్ సోంపు
  • 2 మీడియం సైజు ఉల్లిపాయలు
  • 1 స్పూన్ అల్లం
  • 1/2 స్పూన్ పసుపు
  • 1 స్పూన్ సోంపు పొడి
  • 1 స్పూన్ ఆమ్చూర్ పొడి
  • 1/4 స్పూన్ మిరియాల పొడి
  • 1/2 స్పూన్ చక్కెర
  • 1 స్పూన్ నిమ్మకాయ రసం.
  • రుచికి తగినంత ఉప్పు

బెండకాయ మసాలా కూర ఎలా తయారు చేయాలి

  1. ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి, పొడవైన ముక్కలుగా అడ్డంగా కట్ చేసుకోండి, ఆ తర్వాత ఉల్లిపాయలను కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి.
  2. ఇప్పుడు నూనె వేడి చేసి అందులో జీలకర్ర, సోంపు వేసి చిటపటలాడనివ్వండి.
  3. అనంతరం ఉల్లిపాయ ముక్కలు వేసి తేలికగా వేయించండి.
  4. ఆపైన అల్లం తురుము వేసి వేయించి, ఒక అరకప్పు నీళ్లు కలపండి. ఆపైన పసుపు వేసి బాగా కలపండి.
  5. ఇప్పుడు ఇందులో బెండకాయ ముక్కలు వేసి, మిగిలిన అరకప్పు నీళ్లు పోసి, కాస్త ఉప్పు వేసి ఉడికించండి.
  6. భిండిలో కలపండి. మిగిలిన నీటిలో పోయాలి మరియు గందరగోళాన్ని కొనసాగించండి.
  7. ఒక ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత సోంపు పొడి, అమ్‌చూర్ పొడి వేయండి. ఆపైన కొద్దిగా చక్కెర చల్లండి.
  8. ఇప్పుడు మిరియాల పొడి వేసి, అన్నింటినీ బాగా కలపండి. కూర దగ్గరకు వచ్చేంత వరకు మీడియం మంటపై ఉడికించండి.
  9. చివరాగా నిమ్మరసం వేసి, బాగా కలపండి.

అంతే, రుచికరమైన బెండకాయ మసాలా కూర రెడీ. అన్నం లేదా చపాతీలతో తింటే అద్భుతంగా ఉంటుంది.

WhatsApp channel

సంబంధిత కథనం