తెలుగు న్యూస్  /  Lifestyle  /  Breakfast Recipes How To Make Potato Rice For Breakfast

Potato Rice : అల్పాహారంలోకి ఆలు రైస్.. ఈజీగా చేసేయోచ్చు

HT Telugu Desk HT Telugu

07 March 2023, 6:30 IST

    • Aloo Rice : బ్రేక్ ఫాస్ట్ కచ్చితంగా తినాలి. లేదంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే కొన్నిసార్లు టైమ్ ఎక్కువగా ఉండదు. అలాంటి సమయంలో ఆలు రైస్ ట్రై చేయండి. ఈజీగా తయారు చేయోచ్చు.
ఆలు రైస్
ఆలు రైస్

ఆలు రైస్

ఆలు గడ్డలతో ఇంట్లో కూరలు చేసుకుంటాం. దీనితో పోషకాలు కూడా లభిస్తాయి. ఆలుతో రకరకాల వంటలను తయారు చేస్తారు. ఆలుతో రైస్ కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని బ్రేక్ ఫాస్ట్ లాగా తినేయోచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైనా కూర తయారుచేసే సమయం లేకపోతే.. దీనిని తయారు చేసుకోవచ్చు. ఉదయమే కాదు.. మధ్యాహ్నం కూడా తినొచ్చు.

ఉదయం అల్పాహారంగా ఆలురైస్ తినొచ్చు. మధ్యాహ్నం లంచ్ బాక్స్ లోకి కూడా తీసుకెళ్లొచ్చు. ఎంతో రుచికరంగా ఉంటుంది. పోషకాలు కూడా లభిస్తాయి. అంతేకాదు.. తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. ఆలు రైస్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..

అన్నం-1 క‌ప్పు, ఆలుగ‌డ్డలు-2 ఉడ‌క‌బెట్టాలి, ఉల్లిపాయ-1 క‌ట్ చేసుకోవాలి, వెల్లుల్లి క‌ట్ చేయాలి, పుదీనా త‌రుగు-2 టీస్పూన్లు, ప‌చ్చి మిర్చి-1, గ‌రం మ‌సాలా, సాజీరా-అర‌ టీ స్పూన్, కారం-పావు టీస్పూన్, ప‌సుపు-చిటికెడు, నూనె, ఉప్పు త‌గినంత, బిరియానీ ఆకు, జాజికాయ-ఒక్కొక్కటి, యాల‌కులు-4, దాల్చిన చెక్క-1, ల‌వంగాలు-6.

ముందుగా ఆలుగడ్డలను నీళ్లు పోసి ఉడకబెట్టాలి. మరి మెత్తగా ఉడికించుకోవద్దు. ఆ తర్వాత వాటిని కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో నూనె పోసుకుని వేడి చేయాలి. అందులో బిర్యానీ ఆకు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, పచ్చి మిర్చి, సాజీరా, జాజికాయ వేసి వేయించాలి. ఇందులో ఉల్లిపాయలు, వెల్లుల్లి వేసి ఒక నిమిషం పాటు బాగా వేయించాలి. ఇప్పుడు ఉడకబెట్టి కట్ చేసిన ఆలు గడ్డ ముక్కలు వేయాలి. వాటిని కొంత ఫ్రై చేసుకోవాలి.

ఇప్పుడు అందులో పసుపు, ఉప్పు, కారం, పుదీనా ఆకులు, గరం మసాలా వేసి బాగా కలపాలి. తర్వాత అన్నం వేయాలి. రెండు నిమిషాల బాటు కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా ఆకులు వేసి క‌ల‌పాలి. అంతే ఆలురైస్ తయారు అవుతుంది. దీనిని రైతాతో కలిపి కూడా తినొచ్చు. లేదా డైరెక్ట్ గా తినేయోచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లాగా లాగించేయోచ్చు.

టాపిక్