తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Green Apple Health Benefits । స్త్రీలు గ్రీన్ యాపిల్ తింటే ఎంతో ఆరోగ్యకరం, ఎందుకీ తెలుసా?!

Green Apple Health Benefits । స్త్రీలు గ్రీన్ యాపిల్ తింటే ఎంతో ఆరోగ్యకరం, ఎందుకీ తెలుసా?!

HT Telugu Desk HT Telugu

02 November 2022, 18:57 IST

    • Green Apple Health Benefits: యాపిల్ తింటే మంచిదని తెలుసు. మరి అందులో గ్రీన్ యాపిల్ కూడా ఉంటుంది. ఈ గ్రీన్ యాపిల్ తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా? మీకు తెలియనివి ఇక్కడ తెలుసుకోండి.
Green Apple Health Benefits:
Green Apple Health Benefits: (Pixabay)

Green Apple Health Benefits:

Green Apple Health Benefits: ఆరోగ్యం సరిగా లేని వారికి యాపిల్స్ తినిపించాలని వైద్యులు సూచిస్తారు. ఎందుకంటే యాపిల్స్ లో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచి అనారోగ్యాన్ని నయం చేస్తాయి. అందుకే పెద్దలు అంటారు రోజు ఒక యాపిల్ తింటే అది మిమ్మల్ని రోగాల నుంచి దూరం ఉంచుతుంది అని.

ట్రెండింగ్ వార్తలు

Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ రోజున బంగారం ఎందుకు కొంటారు?

Mothers day 2024 Gift Ideas: మదర్స్ డే రోజు మీ అమ్మకు మర్చిపోలేని ఇలాంటి అందమైన బహుమతిని ఇవ్వండి

Carrot Milkshake: మండే ఎండల్లో టేస్టీ క్యారెట్ మిల్క్ షేక్ ఇది, ఎంతో ఆరోగ్యం కూడా

World lupus day 2024: శరీరంలోని అన్ని అవయవాలపై దాడి చేసే వ్యాధి లూపస్, ఇదొక విచిత్రమైన ఆరోగ్య సమస్య

అయితే యాపిల్ అంటే ఎర్ర యాపిల్ మాత్రమే మనకు ఎక్కువగా తెలుసు. తెలుగులో ఒక పాట కూడా ఉంది, పండు పండు ఎర్రపండు యాపిల్ దాని పేరు అని. కానీ మార్కెట్లో మనకు గ్రీన్ యాపిల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఈ గ్రీన్ యాపిల్ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గ్రీన్ యాపిల్‌లో కాల్షియం, ఐరన్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

గ్రీన్ యాపిల్ తినడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఈ కింద చూడండి.

Green Apple Health Benefits: గ్రీన్ యాపిల్ ఆరోగ్య ప్రయోజనాలు

గ్రీన్ యాపిల్ తింటే కలిగే కొన్ని ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలను ఇక్కడ జాబితా చేశాం, చూడండి.

మానసిక ఆరోగ్యం పెంచుతుంది

గ్రీన్ యాపిల్ తింటే శరీరక ఆరోగ్యమే కాదు, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. గ్రీన్ యాపిల్స్‌లో క్వెర్సెటిన్ ఉంటుంది. గ్రీన్ యాపిల్స్ తినడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పరిశోధనలో తేలింది. అల్జీమర్స్ వ్యాధి ఉన్నవారికి గ్రీన్ యాపిల్స్ రెగ్యులర్ గా తినడం చాలా మంచిది.

ఎముకల దృఢత్వానికి

ఎముకల ఆరోగ్యానికి కాల్షియం అవసరం. గ్రీన్ యాపిల్‌లో మంచి కాల్షియం ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ మహిళల్లో ఎముకలు బలహీనపడతాయి. అటువంటి వారు గ్రీన్ యాపిల్‌ను తింటూ ఉంటే ఎముకలు బలపడతాయి.

కాలేయం పనితీరుకు

గ్రీన్ యాపిల్స్‌లో ఉండే పోషకాలు కాలేయాన్ని బలోపేతం చేయడానికి పని చేస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. గ్రీన్ యాపిల్స్‌లో మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నందున, దీన్ని తినడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. గ్రీన్ యాపిల్ శరీరానికి చాలా శక్తిని ఇస్తుంది.

బరువు తగ్గడానికి

గ్రీన్ యాపిల్స్‌లో పీచు ఉండటం వలన అధిక బరువును కూడా తగ్గించుకోవచ్చు. అలాగే దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చర్మానికి మెరుపు వస్తుంది. గ్రీన్ యాపిల్ లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపుకు మంచిది.

శ్వాస సంబంధ సమస్యలకు

గ్రీన్ యాపిల్‌లోని పోషకాలు ఊపిరితిత్తులకు కూడా మేలు చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు బలపడి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.