తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mothers Day 2024 Gift Ideas: మదర్స్ డే రోజు మీ అమ్మకు మర్చిపోలేని ఇలాంటి అందమైన బహుమతిని ఇవ్వండి

Mothers day 2024 Gift Ideas: మదర్స్ డే రోజు మీ అమ్మకు మర్చిపోలేని ఇలాంటి అందమైన బహుమతిని ఇవ్వండి

Haritha Chappa HT Telugu

09 May 2024, 16:30 IST

  • Mothers day 2024 Gift Ideas: ఈ మదర్స్ డేను మరింత స్పెషల్ గా చేయాలనుకుంటున్నారా? మీ అమ్మకు ఈ రోజును మరచిపోలేనిదిగా మార్చండి. కొన్ని రకాల గిఫ్ట్ ఐడియాలు ఇక్కడ ఉన్నాయి. 

మదర్స్ డే గిఫ్టు ఐడియాలు
మదర్స్ డే గిఫ్టు ఐడియాలు (Unsplash)

మదర్స్ డే గిఫ్టు ఐడియాలు

Mothers day 2024 Gift Ideas: మదర్స్ డే అనేది తల్లుల గొప్పతనాన్ని, కుటుంబంలో వారి అమూల్యమైన కృషిని, త్యాగాలను గౌరవించే ఒక వేడుక. భారతదేశం, కెనడా, ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్ వంటి 43 దేశాలలో ప్రతి సంవత్సరం మే రెండవ ఆదివారం ఈ పండుగను నిర్వహించుకుంటారు. మదర్స్ డే 2024 సంవత్సరంలో మే 12 ఆదివారం వస్తుంది. ఆరోజున అమ్మలకు అందమైన బహుమతులు అందించండి. దుకాణంలో కొనుగోలు చేసిన బహుమతులను ఎంచుకునే బదులు, ప్రేమ, విలువైన జ్ఞాపకాలతో నిండిన హృదయపూర్వక బహుమతులు మీరే తయారు చేసి ఇవ్వండి. మీ అమ్మను సంతోషపరచడానికి ఇక్కడ కొన్ని సులభమైన, వినూత్నమైన హ్యాండ్ మేడ్ గిఫ్ట్ ఐడియాలు ఉన్నాయి.

మదర్స్ డే గిఫ్ట్ ఐడియాలు

1. స్క్రాప్ బుక్: మీ అమ్మతో మీరు గడిపిన తీయని క్షణాలను ఫోటోలు తీసే ఉంటారు. ఆ క్షణాలను గుర్తుచేసే పాత చిత్రాలు, కోట్స్ తో అందమైన స్క్రాప్ బుక్ రెడీ చేయండి. ఆ బుక్ ను అందంగా తయారు చేసేందుకు స్టిక్కర్లుజోడించండి.

2. పర్సనలైజ్డ్ టోట్ బ్యాగ్: సింపుల్ కాన్వాస్ టోట్ బ్యాగ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని మీ తల్లికి నచ్చేలా ఫ్యాబ్రిక్ మార్కర్లతో చక్కటి బొమ్మలు వేసి పర్సనలైజ్ చేయండి.

3. మెమరీ జార్: మీ అమ్మతో మీకు ఇష్టమైన కొన్ని క్షణాలను చిన్న కాగితంపై రాసి, వాటిని అందమైన జార్లో ఉంచండి. ఆమెకు ఆ జార్ ను బహుమతిగా ఇవ్వాలి. వాటిని ఆమె చదివేలా చేయండి. అందులో ఉన్న కాగితాల్లో రాసి మేటర్ మీ తల్లికి ఆనందాన్ని అందించేలా ఉండాలి.

4. హ్యాండ్ మేడ్ కార్డు: మీ తల్లి పట్ల మీ కృతజ్ఞత, ప్రేమను తెలియజేస్తూ మీరు అందమైన గ్రీటింగ్ కార్డును తయారుచేయండి. మీరు ఆమెకు వ్యక్తిగతంగా చెప్పలేకపోయిన భావాలను రాసి ఆమెకు అందజేయండి.

5. మినీ ఫోటో మెమొరీ ఫ్రేమ్: మన ఫోన్లలోని గొప్ప కెమెరాలు మనందరినీ మొబైల్ ఫోటోగ్రాఫర్లుగా మార్చాయి. మీ అమ్మకు ఇష్టమైన ఫోటోలను ప్రింట్ తీసుకోండి. ఆ ఫోటోలను ఆమె చూడగలిగేలా వేలాడదీయండి.

6. హ్యాండ్ పెయింటెడ్ మగ్: పర్సనలైజ్డ్ మగ్ అనేది ఏ తల్లికైనా నచ్చుతుంది. సిరామిక్ మగ్ మీ అమ్మ, మీరు ఉన్న ఫోటోను అచ్చు వేయించండి. అందులో మీ అమ్మ, మీరు నవ్వుతూ ఉండేలా చూసుకోండి.

7. ఫోటో తలగడ: ఏ తల్లికైనా ఫ్యామిలీ ఫోటోలు నచ్చుతాయి. మీ తల్లి కోసం ఫ్యామిలీ ఫోటో అచ్చు వేసిన తలగడను గిఫ్టుగా ఇవ్వండి.

8. డెజర్ట్లను వండండి: మీ తల్లి మీకు రోజు ఎన్నో రకాలు వండి పెడుతుంది. మదర్స్ డే రోజు ఆమె కోసం మీరు టేస్టీ వంటలను వండి రుచి చూపించండి. రుచికరమైన కేక్, కుకీలను తయారు చేయండి. ఆమెకు బహుమతిగా ఇవ్వండి.

9. ఆభరణాలు: తల్లికి పిల్లలు ఇచ్చే ఆభరణాలు చాలా గొప్పగా అనిపిస్తాయి. పర్సనలైజ్డ్ ఆభరణాలను తల్లికి బహుమతిగా ఇవ్వండి. వెండితో చేసిన అందమైన ఆభరణాలు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఉద్యోగం చేసే పిల్లలైతే బంగారు ఆభరణాలు తల్లికి బహుమతిగా ఇస్తే ఆమె మరింతగా సంతోషిస్తుంది.

టాపిక్

తదుపరి వ్యాసం