తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Unique Indian Fruits । భారత్‌లో లభించే ఈ విభిన్నమైన పండ్లను మీరు రుచి చూశారా?

Unique Indian Fruits । భారత్‌లో లభించే ఈ విభిన్నమైన పండ్లను మీరు రుచి చూశారా?

13 September 2022, 23:23 IST

భారతదేశంలో అనేక రకాల కూరగాయలు పండుతాయి. అయితే అవి కొన్ని ప్రాంతాల్లో లభిస్తాయి, మరికొన్ని చోట్ల లభించవు. అలాగే వివిధ రకాల పండ్లు ఉన్నాయి. అవి కూడా కొన్ని ప్రాంతాలకు ప్రత్యేకమైనవి.

  • భారతదేశంలో అనేక రకాల కూరగాయలు పండుతాయి. అయితే అవి కొన్ని ప్రాంతాల్లో లభిస్తాయి, మరికొన్ని చోట్ల లభించవు. అలాగే వివిధ రకాల పండ్లు ఉన్నాయి. అవి కూడా కొన్ని ప్రాంతాలకు ప్రత్యేకమైనవి.
మన భారతదేశంలోనే అనేక రకాల పండ్ల రకాలు అందుబాటులో ఉంటాయి. అవి కూడా కొన్ని ప్రాంతాలకు ప్రత్యేకమైనవి. మరి వీటిలో మీరు ఎన్ని రకాల పండ్లను రుచి చేశారో గుర్తు చేసుకోండి.
(1 / 8)

Persimmon: పెర్సిమోన్ అనేది ఒకరకమైన ఖర్జూర పండు. ఈ పండు చైనా నుండి ఇది కొరియాకు, అక్కడ్నించీ జపాన్‌కు వ్యాపించింది. అయితే ఈ పండ్లను ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, తమిళనాడులో కూడా పండిస్తారు. ఈ పండ్లు జారుడుగా లోపల జిగురుగా ఉంటాయి తీపి రుచిని కలిగి ఉంటాయి.
(2 / 8)

Mangosteen మాంగోస్టీన్ - ఈ పండ్ల మొక్కలను దక్షిణ భారతదేశంలో మాత్రమే పండిస్తారు. మాంగోస్టీన్ ప్రధాన ఉత్పత్తిదారుగా కేరళ ఉంది, తర్వాత తమిళనాడులోని పొల్లాచ్చి, ఎగువ పళని కొండలు, కూనూర్‌లలో కూడా పండిస్తారుది. ఇది కొద్దిగా తీపి, పుల్లని రుచి కలిగి ఉంటుంది.
(3 / 8)

Rambutan: ఈ పండు లీచీ లాగా కనిపిస్తుంది. భారతదేశంలో రాంబుటాన్ మొక్కల సాగు కేరళ, కర్ణాటక, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలకు పరిమితమైంది. ఇది తీపి రుచిని కలిగిన క్రీము పండు.
(4 / 8)

passion fruit:  దీనిని మేడిపండు అంటారు. దీని మూలాలు బ్రెజిల్‌ దేశంలో ఉన్నాయని కనుగొన్నారు. భారతదేశంలో ఇది నీలగిరి, వయనాడ్, కొడైకెనాల్, షెవరాయ్, కూర్గ్, మలబార్ వంటి పశ్చిమ కనుమలలోని అనేక ప్రాంతాలతో పాటు హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, మిజోరాం వంటి ఈశాన్య రాష్ట్రాలలో విపరీతంగా పెరుగుతుంది. ఇది తియ్యగా ఉంటుంది కానీ ఫ్లేవర్‌ వేరేగాఉంటుంది. ఇది సువాసన కలిగిన పండు.
(5 / 8)

Langsat: లాంగ్‌సాట్ - ఈ పండు లిచీ లాగా గుత్తులుగా పెరుగుతుంది. ఇది మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్, సుమత్రాలలో విస్తృతంగా సాగు చేస్తారు. భారతదేశంలో, ఇది నీలగిరి దక్షిణ కొండలలో ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు పెరుగుతుంది. ఈ పండు రుచి పుల్లగా, తీపిగా ద్రాక్షలాగా ఉంటుంది.
(6 / 8)

Ice Apple: పారదర్శకంగా కనిపించే ఈ పండు తాటి చెట్లు ఎక్కువగా ఉండే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాలలో కనిపిస్తుంది. తాటి ముంజలని పిలుస్తారు. తూర్పు భారతదేశంలోని అనేక ప్రాంతాలలో కూడా కనిపిస్తుంది.
(7 / 8)

జంగ్లీ జలేబి పండ్ల మొక్కలను తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో పండిస్తారు. మందపాటి తీపి గుజ్జును కలిగి కొన్ని నల్లటి గింజలు ఉంటాయి.
(8 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి