తెలుగు న్యూస్  /  Lifestyle  /  Diy Hair Dyes Color Your Hair With Homemade Kalonji Beetroot Dyes To Get Black Or Burgundy Hair Naturally

DIY Hair Dyes । ఇంట్లోనే హెయిర్ డై తయారు చేసుకోండి, చిటికెలో మీ తెల్లజుట్టును నల్లబరుచుకోండి!

HT Telugu Desk HT Telugu

19 April 2023, 16:17 IST

    • DIY Hair Dyes: తెల జుట్టును నల్లబరుచుకునేందుకు రసాయనాలు కలిగిన రంగులు ఎందుకు? కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే హెయిర్ డై చేసుకోవచ్చు. ఎలాగో ఇక్కడ చూడండి.
DIY Hair Dyes
DIY Hair Dyes (Unsplash)

DIY Hair Dyes

Greying Hair Coloring: వయసు పెరిగేకొద్దీ జుట్టు తెల్లబడటం సహజం. వాతావరణ కాలుష్యం, జన్యుపరమైన కారణాలు, ఇతరత్రా కారణాలు కూడా జుట్టు తెల్లబడటానికి (White Hair) కారణం కావచ్చు. అయితే నెరిసిన తమ జుట్టును నల్లగా (Black Hair) మార్చుకునేందుకు చాలా మంది కమర్షియల్ హెయిర్ డైస్ లేదా కలర్స్‌ని ఎంచుకుంటారు. ఇప్పుడు మార్కెట్లో అనేక రకాలైన హెయిడ్ డైలు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించి నెరిసిన మీ తెల్లజుట్టును నల్లబరుచుకోవటం సులభమే కానీ, అందులోని రసాయనాలు మీ జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఇవి జుట్టు కుదుళ్ళలో ఉండే సహజమైన నూనెలను తీసివేసి, వాటిని బలహీనపరుస్తాయి, జుట్టు రాలడానికి (Hair Fall) కారణమవుతాయి.

ట్రెండింగ్ వార్తలు

Washing Fruits: పండ్లపై ఉన్న కనిపించని పురుగుమందులను ఇలా సులువుగా తొలగించండి, వాటితో క్యాన్సర్ వచ్చే ప్రమాదం

Moongdal Curry: పొట్టు పెసరపప్పుతో కూర వండితే అదిరిపోతుంది, వేడివేడి అన్నంలో టేస్టీగా ఉంటుంది

Pre Wedding Diet : పెళ్లికి ఒక వారం ముందు నివారించాల్సిన కొన్ని విషయాలు

Optical Illusion: ఇక్కడిచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో మేకల కాపరి ముఖం ఎక్కడుందో తెలివైన వారు మాత్రమే కనిపెట్టగలరు

సహజ పదార్థాలను ఉపయోగించి మీరు మీ స్వంత హెయిర్ డైని (Natural Homemade Hair Dye) ఇంట్లోనే తయారు చేసుకోగలిగినప్పుడు, జుట్టు చిట్లిపోయేలా చేసే రసాయన ఉత్పత్తులు దేనికి? కేవలం 10 నిమిషాల్లో జుట్టుకు రంగు సిద్ధం చేసుకోవచ్చు. అది ఎలాగో ఇక్కడ DIY Hair Dyes రెసిపీలు మీకు అందిస్తున్నాము, ఈ కింద సూచనలు చదవండి.

DIY Kalonji Henna Hair Dye

కావలసినవి:

  • 2 టీస్పూన్లు వేప పొడి
  • 2 టీస్పూన్లు హెన్నా పౌడర్
  • 2 టీస్పూన్లు కాఫీ పొడి
  • 4 టీస్పూన్లు కలోంజీ గింజలు
  • 2 టీస్పూన్లు ఉసిరి రసం
  • 2 టీస్పూన్లు సోంపు (వేయించి పొడి చేసుకోవాలి)
  • అవసరమైనంత నీరు

తయారీ విధానం:

తయారీ విధానం

- ఒక గిన్నెలో పైన పేర్కొన్న అన్ని పొడులు వేసి, ఒకటిన్నర గ్లాసుల నీరు పోసి చిన్న మంట మీద 10 నిమిషాలు వేడిచేయండి. అది మందమైన పేస్ట్ లాగా మారినపుడు స్టవ్ ఆఫ్ చేయండి. మీ నేచురల్ హోమ్‌మేడ్ హెయిర్ డై సిద్ధమైనట్లే.

- ఈ హెయిర్ డై వేసుకునే ముందు మీ జుట్టును బాగా బ్రష్ చేయండి.

- సిద్ధం చేసుకున్న పేస్టును తీసుకొని జుట్టు మూలాల నుంచి ప్రారంభించి జుట్టుకొనలకు వర్తిస్తూ ఉండండి.

- పూర్తయిన తర్వాత మీ జుట్టును పాలిథిన్ బ్యాగ్‌లో చుట్టి గంటసేపు అలాగే ఉంచండి.

- ఒక గంట తర్వాత, మీ జుట్టును సాధారణ నీటితో కడగండి, మీ తెల్లవెంట్రుకలు పోయి జుట్టు నల్లగా మారుతుంది.

వారానికి ఒకసారి ఈ హెయిర్ డైని ఉపయోగించడం వలన సహజమైన నల్లని ఒత్తైన కురులను సొంతం చేసుకోవచ్చు.

DIY Espresso Hair Dye

1/2 కప్పు ఎస్ప్రెస్సో కాఫీని తీసుకోండి, దానిలో 1/2 కప్పు కండీషనర్‌ను కలపండి, ఆపై 1 టేబుల్ స్పూన్ కాఫీ పొడి జోడించండి. మీ ఎస్ప్రెస్సో కాఫీ హెయిర్ డై రెడీ అయినట్లే. దీన్ని 60 నిమిషాల పాటు జుట్టుకు మాస్క్‌లా (Hair Mask) అప్లై చేసి తర్వాత కడిగేయాలి.

కాఫీ జుట్టుకు నేచురల్ టానిక్‌గా పని చేస్తుంది, ఇది కణాల పెరుగుదలను ప్రేరేపించి బూడిదరంగు జుట్టును సహజంగా దాని సహజ రంగులోకి మారుస్తుంది.

DIY Beetroot Burgundy Hair Dye

ఒక బీట్‌రూట్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోండి. అందులో 1 టీస్పూన్ తేనె, 1 టీస్పూన్ కొబ్బరి నూనెను వేసి కలపండి. దీనిని మిక్స్ చేసి రసాన్ని ఫిల్టర్ చేయండి, ఆపై ఆ రసాన్ని మీ జుట్టుకు అప్లై చేసి 60 నిమిషాల పాటు ఉంచుకోండి. ఆ తర్వాత తేలికపాటి షాంపూ , కండీషనర్ తో కడిగేస్తే మీ జుట్టు సహజమైన బర్గండీ రంగును పొందటంతో పాటు సిల్కీగా మారుతుంది.

బీట్‌రూట్‌లు వాటి ప్రత్యేకమైన రంగుకు ప్రసిద్ధి. బీట్‌రూట్‌ సారం మీ తలలో రక్త ప్రవాహాన్ని కూడా పెంచుతాయి, జుట్టును ఆరోగ్యంగా చేస్తాయి.

Hair Coloring Pro Tip: హెయిర్ డైస్‌ల ఫలితం మీ బేస్ హెయిర్ కలర్‌పై ఆధారపడి ఉంటుంది, కాబట్టి ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాల్సిందిగా గంభీరంగా సిఫార్సు చేయడమైనది. అలాగే, సహజ బ్లీచింగ్ కోసం మీ జుట్టుకు రంగు వేయడానికి ముందు నిమ్మకాయను అప్లై చేయవచ్చు.