తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diy Cooling Face Masks । వేసవిలో మీ చర్మాన్ని చల్లగా, తెల్లగా చేసే కూలింగ్ ఫేస్ మాస్క్‌లు!

DIY Cooling Face Masks । వేసవిలో మీ చర్మాన్ని చల్లగా, తెల్లగా చేసే కూలింగ్ ఫేస్ మాస్క్‌లు!

HT Telugu Desk HT Telugu

16 April 2023, 22:35 IST

google News
    • DIY Cooling Face Masks: వేసవిలో మీ చర్మ సంరక్షణ కోసం మీ ఇంట్లో చేసుకోగల కొన్ని సహజమైన కూలింగ్ ఫేస్ మాస్క్‌లను ఎలా చేయవచ్చో తెలుసుకోండి.
DIY Cooling Face Masks:
DIY Cooling Face Masks: (Stock photo)

DIY Cooling Face Masks:

Summer Skin Care Routine: వేసవిలో చర్మాన్ని సంరక్షించడం అనేది సంక్లిష్టంగా ఉంటుంది. ప్రత్యేకించి మీరు తీవ్రమైన ఎండవేడి, తేమగల ప్రదేశాలలో నివసిస్తుంటే లేదా ఎక్కువ సమయం ఆరుబయట గడిపినట్లయితే మీ చర్మాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎండవలన చర్మం నల్లబడటం, చెమటతో చికాలు, దద్దుర్లు రావడం వంటి అనేక సమస్యలు ఉంటాయి. ఈ వేసవిలో మీ చర్మానికి అదనపు హైడ్రేషన్, అదనకు రక్షణ, అదనపు పోషణ అవసరం. ఇందుకోసం మీరు ఇంట్లో మీకు మీరుగా తయారుచేసుకోగల కూలింగ్ ఫేస్ మాస్క్‌ (DIY Cooling Face Masks) లను ప్రయత్నించండి. ఇక్కడ కొన్ని సహజమైన కూలింగ్ ఫేస్ మాస్క్‌లను ఎలా చేయవచ్చో తెలుసుకోండి.

DIY Cucumber Aloe Vera Dace Mask- దోసకాయ అలోవెరా ఫేస్ మాస్క్

సగం దోసకాయను బ్లెండ్ చేసి అందులో 2 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ సూర్యరశ్మికి లేదా చెమట చికాకుకు గురైన చర్మానికి చికిత్స చేయడానికి, చర్మాన్ని హైడ్రేటింగ్ చేయడానికి మేలైనది.

DIY Yogurt Honey Face Mask - పెరుగు తేనే ఫేస్ మాస్క్

2 టేబుల్ స్పూన్ల పెరుగును 1 టేబుల్ స్పూన్ తేనెతో కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి, తేమగా మార్చడానికి మంచిది.

DIY Green Tea Lemon Face Mask- గ్రీన్ టీ లెమన్ ఫేస్ మాస్క్

ఒక కప్పు గ్రీన్ టీని కాచి చల్లారనివ్వండి. 2 టేబుల్ స్పూన్ల బ్రూ టీలో సగం నిమ్మకాయ రసం కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ చర్మాన్ని కాంతివంతంగా, రిఫ్రెష్ చేయడానికి గొప్పగా సహాయపడుతుంది.

DIY Mint Cucumber Face Mask - పుదీనా దోసకాయ ఫేస్ మాస్క్

సగం దోసకాయ , కొన్ని తాజా పుదీనా ఆకులను రుబ్బండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ చర్మాన్ని చల్లబరచడానికి , రిఫ్రెష్ చేయడానికి గొప్పగా సహాయపడుతుంది.

DIY Aloe Vera Coconut Oil Face Mask - అలోవెరా - కొబ్బరి నూనె ఫేస్ మాస్క్

2 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్‌ను 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెతో కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి, ఓదార్పు కలిగించడానికి సహాయపడుతుంది.

తదుపరి వ్యాసం