DIY Tomato Face Mask । ఎండకు ముఖం నల్లబడిందా? ఈ సహజమైన ఫేస్ మాస్క్‌లు ట్రై చేయండి!
13 April 2023, 12:24 IST
- DIY Tomato Face Mask: వేసవిలో టమోటాలు మీ చర్మంపై మ్యాజిక్ చేస్తాయి. ఎండకు నల్లబడిన మీ చర్మాన్ని మెరిసేలా చేసేందుకు ఇక్కడ కొన్ని సహజమైన ఫేస్ మాస్క్ లు ఉన్నాయి, వీటిని ప్రయత్నించి చూడండి.
DIY Tomato Face Masks
Summer Skin Care Routine: టొమాటోలో ఎన్నో పోషకాలు ఉంటాయి. బీటా కెరోటిన్, లుటిన్, విటమిన్లు సి, ఇ వంటి యాంటీ ఇన్ల్ఫమేటరీ సమ్మేళనాలు ఉన్నాయి. అందువల్ల టొమాటో కేవలం తినటానికి మాత్రమే కాకుండా మీ ముఖాన్ని కాంతివంతంగా మార్చే ఒక సౌందర్య సాధనంగా కూడా ఉపయోగించవచ్చు. మీ చర్మానికి సంబంధించిన అనేక సమస్యలను టొమాటోతో దూరం చేసుకోవచ్చు. వేసవిలో సాధారణంగా కలిగే సన్ టాన్ (Sun Tanning) తొలగించడం మొదలుకొని, ముఖంపై జిడ్డును తొలగించటం, మొటిమలు, నల్లమచ్చలను తగ్గించడం, ముఖంపై ఏర్పడిన రంధ్రాలను పూడ్చటం, ముఖాన్ని తాజాగా ఉంచడం వరకు చాలా రకాలుగా టొమాటోను ఉపయోగించవచ్చు.
DIY Tomato Face Wash
ఎండవేడి, చెమట, దుమ్ము ధూళి కారణంగా మీ ముఖం జిడ్డుగా నిస్తేజంగా కనిపిస్తే. టొమాటో రసాన్ని ముఖానికి బాగా పట్టించి, పది నిమిషాలు అలాగే ఉంచండి. ఆరిన తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. ముఖం శుభ్రంగా, తాజాగా కనిపిస్తుంది.
టొమాటో సహజ రక్త స్రావ నివారిణిగా (Astringent) పనిచేస్తుంది. కాబట్టి ముఖంపై ఏర్పడిన రంధ్రాలు, బ్లాక్‌హెడ్స్‌ను తగ్గించడానికి సహాయపడుతుంది. టొమాటోను సగానికి కట్ చేసి ఆ ముక్కను చర్మంపై రుద్దాలి, టొమాటో రసాన్ని రంధ్రాలలోకి పంపాలి, ముఖంపై టొమాటో గుజ్జును, రసాన్ని అలాగే 15 నిమిషాల పాటు ఉంచుకొని, ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. ఇలా చేయడం వల్ల ముఖంపై రంధ్రాలు, మొటిమలు తగ్గిపోతాయి.
DIY Tomato Scrub
టొమాటోలోని ఎంజైమ్‌లు చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తాయి, మృతకణాలను తొలగిస్తాయి. టొమాటో స్క్రబ్ తయారు చేసేందుకు, ఒక టొమాటోను తీసుకొని దానిని సగానికి కోసి, రెండు ముక్కలుగా చేయండి, ఆపైనా ఆ ముక్కలపై బ్రౌన్ షుగర్ చల్లండి. ఇప్పుడు దానిని ముఖం, మెడపై, శరీరంపై నెమ్మదిగా రుద్దండి. ఇది చర్మంపైన మృతకణాలను తొలగిస్తుంది, మూసుకుపోయిన చర్మ రంధ్రాలను తెరిచి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
DIY Tomato Face Mask
ఒక గిన్నెలో పండిన టొమాటో గుజ్జును తీసుకోండి, అందులో పుల్లని పెరుగును కలపండి. అలాగే కొంచెం రోజ్ వాటర్ కూడా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖం అంతా అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. ఈ ప్యాక్‌ను ఒక 15-20 నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి 2-3 రోజులు తరచుగా చేస్తూ ఉంటే ముఖంలోని నలుపుదనం పోయి, ముఖం కాంతివంతంగా మారుతుంది.
DIY Tomato- Turmeric Face Mask
ఒక గిన్నెలో టొమాటో గుజ్జును మెత్తగా చేసి, అందులో ఒకా టీస్పూన్ పసుపు వేసి బాగా కలపండి. ఆపై ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేయండి. ఈ మాస్క్ ను 15 నిమిషాలు ఉంచుకొని ఆ తర్వాత మీ ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడగాలి. తర్వాత మాయిశ్చరైజ్ చేయండి. ఇది మీ చర్మాన్ని ప్రకాశవంతం చేయడమే కాక, చర్మ సమస్యలను నివారిస్తుంది, అలాగే ఎండకు నల్లబడిన చర్మాన్ని డీ-టాన్ చేయడానికి సహాయపడుతుంది.
ఇలాంటి మరిన్ని చిట్కాల కోసం HT లైఫ్‌స్టైల్ సెక్షన్ స్క్రోల్ చేస్తూ ఉండండి. అదరగొట్టండి.