తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Wedding Gift Ideas | కొత్తగా పెళ్లైన జంటకు గొప్ప బహుమానం ఇవ్వాలనుకుంటే.. ఈ ఉపాయాలు చూడండి!

Wedding Gift Ideas | కొత్తగా పెళ్లైన జంటకు గొప్ప బహుమానం ఇవ్వాలనుకుంటే.. ఈ ఉపాయాలు చూడండి!

HT Telugu Desk HT Telugu

30 January 2023, 20:20 IST

    • Wedding Gift Ideas: కొత్తగా పెళ్లైన జంటకు ఏదైనా గొప్ప బహుమతిని బహూకరించాలనుకుంటే ఇక్కడ కొన్ని ఉపాయాలు అందిస్తున్నాం. ఇవి కచ్చితంగా కొత్తజంటను ఆనందపరుస్తాయి.
Wedding Gift Ideas
Wedding Gift Ideas (Unsplash)

Wedding Gift Ideas

ఇది పెళ్లిళ్ల సీజన్, చాలా వేడుకలు జరుగుతుంటాయి. మీరు కూడా అనేకమైన వివాహాది వేడుకలకు హాజరు కావాల్సి ఉండవచ్చు. అయితే ఈ వివాహ సీజన్‌లో, ఏదైనా కొత్త జంటకు మీరు ఇష్ట బంధువుగా మారాలనుకుంటున్నారా? అలా మారాలంటే వారికి ఎప్పుడూ గుర్తుండిపోయేలా ఏదైనా ఒక బహుమతి ఇవ్వాలి. ఇక్కడ బహుమతులు కచ్చితంగా ఇవ్వాలని నియమం ఏమి లేనప్పటికీ, ఇది పూర్తిగా మీ వ్యక్తిగతం.

సాధారణంగా మనం ఏదైనా పెళ్లిళ్లు, ఇత్యాది శుభకార్యాలకు వెళ్లినపుడు కట్నాలు చదివిస్తాం. అయితే మీరు చదివించిన కట్నాలు ఖర్చు అయిపోతాయి కానీ, మీరు ఇచ్చే బహుమతులు చాలా కాలం పాటు నిలిచి ఉంటాయి.

కొత్తగా పెళ్లైన జంటలకు చాలా రకాల అవసరాలు ఉంటాయి, ఎన్నో అభిరుచులు ఉంటాయి, వారి ఎవరు ఏ బహుమానం ఇచ్చారో చూడాలనే ఆసక్తి ఉంటుంది. కాబట్టి మీరు ఇచ్చే బహుమతి వారిలో సంతోషం నింపుతుంది, మిమ్మల్ని గుర్తుంచుకునేలా చేస్తుంది. మీరు మీ స్థాయికి తగినట్లుగా విలాసవంతమైనది ఇవ్వవచ్చు, లేదా తక్కువ ధరలోనే విలక్షణమైన బహుమానం అందజేయవచ్చు.

Wedding Gift Ideas- కొత్త జంటకు ఇవ్వగల బహుమతులు

మీరు ఎలాంటి బహుమతులు ఇవ్వాలా? అని ఆలోచిస్తుంటే, ఇక్కడ మీకు కొన్ని ఉపాయాలు, ఉదాహరణలు అందిస్తున్నాం. ఈ ఉపాయాలు మీకు అవసరమైనపుడు ఉపయోగపడవచ్చు.

ఇండోర్ మొక్కలు

మీ ప్రియమైన వారికి ఇండోర్ మొక్కలు, సక్యూలెంట్‌లను బహుమతిగా ఇవ్వడం గొప్ప ఆలోచన. ఈ మొక్కలు ఇంటి చుట్టూ ఉన్న గాలిని శుద్ధి చేస్తాయి , కొత్తగా పెళ్లయిన వారి బెడ్‌రూమ్ లేదా బాల్కనీకి కొత్త హంగులను దిద్దుతాయి. వీటి నిర్వహణకు కూడా పెద్దగా శ్రమ అవసరం లేదు. కాబట్టి ఈ విధంగా, మీరు కొత్తజంటకు ప్రకృతిలో కొంత భాగాన్ని బహుమానంగా ఇచ్చినట్లు అవుతుంది.

సువాసన గల కొవ్వొత్తులు

కొవ్వొత్తులు కచ్చితంగా ఏదో ఒక సమయంలో ఉపయోగపడతాయి. ముఖ్యంగా సువాసనతో కూడిన కొవ్వొత్తులు కొత్తగా పెళ్లయిన వారికి ఒత్తిడిని తొలగించి మంచిగా విశ్రాంతి తీసుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. ఇది వారి గదిలో కూడా ఒక అద్భుతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి.

చెక్క నేమ్ ప్లేట్

కొత్త నేమ్‌ప్లేట్ ఇవ్వడం కొత్త ప్రారంభానికి సూచిక. మీరు కొత్తగా పెళ్లయిన జంటకు వారి పేర్లతో చెక్కిన నేమ్‌ప్లేట్‌ను బహుమతిగా ఇవ్వవచ్చు. ఆన్‌లైన్‌లో వేల సంఖ్యలో నేమ్‌ప్లేట్లు అందుబాటులో ఉంటాయి, మీరు వాటిని వారికి అనుగుణంగా అనుకూలీకరించవచ్చు. ఇది చాలా ఆత్మీయమైన బహుమతి. లేదా చక్కని వాల్ పోస్టర్స్ కలిగిన ఫ్రేమ్స్ ఇవ్వవచ్చు. ఇవి వారి గోడపై అలంకారంగా నిలిచి ఉంటాయి.

డచ్ ఓవెన్

కొత్తగా పెళ్లిన వారికి కొన్ని గృహోపకరణాలు, వంట సామాగ్రి చాలా మంది ఇస్తారు. అయితే డచ్ ఓవెన్ వంటివి దాదాపు ఇవ్వకపోవచ్చు. కానీ ఇది వారికి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది, అవసరానికి పనికి వస్తుంది. బ్యాచిలర్ జీవితం విడిచి పెళ్లి చేసుకున్నవారు ఇకపై ఇంటి భోజనంపైనే మక్కువ చూపుతారు కాబట్టి కొత్తగా పెళ్లయిన జంటకు డచ్ ఓవెన్‌ను బహుమతిగా ఇవ్వడం సరైన ఆలోచన. నెమ్మదిగా వంట చేయడం, డీప్‌ఫ్రై చేయడం, కుండ రోస్ట్‌లు మొదలైనవన్నీ డచ్ ఓవెన్‌ని ఉపయోగించి చేయవచ్చు. మీరు ఈ ఓవెన్‌తో బేక్ కూడా చేయవచ్చు.

డిన్నర్ సెట్

కొత్తగా పెళ్లయిన జంటకు ఒక జత కపుల్ టీకప్‌లతో పాటు, మీరు ఎంపిక చేసిన చక్కటి హెర్బల్ టీని బహుమతిగా ఇవ్వండి. చమోమిలే టీ, మందార టీ, నిమ్మకాయ-అల్లం టీ, లావెండర్ టీ, జాస్మిన్ టీ మొదలైనవి మీరు ఎంచుకోగల కొన్ని ఫ్లేవర్లు. హెర్బల్ టీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది, ప్రశాంతంగా ఉంచుతుంది. తాజాగా తయారుచేసిన జాస్మిన్ టీ ఒక కప్పు కచ్చితంగా కొత్తగా పెళ్లయిన జంటకు గొప్ప విశ్రాంతిని అందించగలదు. లేదా సింపుల్ గా ఒక మంచి డిన్నర్ సెట్ ఇస్తే కూడా ఇది వారి అవసరాలకు ఉపయోగపడుతుంది.