తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Children’s Day Gift Ideas । బాలల దినోత్సవం రోజున పిల్లలకు ఇలాంటి బహుమతులు అందించండి, ఆనందాన్ని పంచండి!

Children’s Day Gift Ideas । బాలల దినోత్సవం రోజున పిల్లలకు ఇలాంటి బహుమతులు అందించండి, ఆనందాన్ని పంచండి!

HT Telugu Desk HT Telugu

14 November 2022, 8:30 IST

    • Happy Children's Day 2022: ఈరోజు బాలల దినోత్సవం, పిల్లలందరికీ ఈరోజు ఎంతో ప్రత్యేకమైన రోజు. ఈరోజును పిల్లలతో కలిసి వేడుక చేసుకోండి, వారికి బహుమతులు అందించండి, ఆనందం పంచండి. ఎలాంటి బహుమతులు ఇవ్వవచ్చో ఇక్కడ చూడండి.
Happy Children's Day 2022
Happy Children's Day 2022 (Unsplash)

Happy Children's Day 2022

Happy Children's Day 2022: బాలల కోసం ఒక ప్రత్యేకమైన రోజు, అపురూపమైన బాల్యాన్ని వేడుక చేసుకునే రోజు వచ్చేసింది. నేడు జాతీయ బాలల దినోత్సవం. భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 14 న బాలల దినోత్సవం జరుపుకుంటారు. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ఈ రోజున ఈ ప్రత్యేకమైన వేడుకను జరుపుకుంటారు. పిల్లలే దేశ భవిష్యత్తు, వారికి సరైన విద్య, ఆరోగ్యకరమైన బాల్యం అందేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈరోజు చాటి చెబుతుంది. పిల్లలు పనులకు వెళ్లడం కాకుండా, విద్యను పొందడంపై వారికి ఉన్న హక్కులపై బాలల దినోత్సవం అవగాహన కల్పిస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

చాచా నెహ్రూ అని ముద్దుగా పిలుచుకునే జవహర్‌లాల్ నెహ్రూ పిల్లలతో గొప్ప అనుబంధాన్ని కలిగి ఉండేవారు. పిల్లలకు విద్య తప్పనిసరి ఆయన భావించారు, జ్ఞానం దేశ పురోగతికి వెలుగు రేఖలు అందిస్తుందని నమ్మారు, నేటి బాలలు రేపటి జాతి సంపదలు అని ఆయన బలంగా విశ్వసించారు. ఈ సందర్భంగా ఆయన జయంతి రోజు అయిన నవంబర్ 14వ తేదీన ప్రతీ ఏడూ బాలల దినోత్సవం నిర్వహించుకుంటున్నాం.

బాలల దినోత్సవం నాడు పిల్లలందరూ చాచా నెహ్రూను, ఆయన బోధనలను స్మరించుకుంటారు. బాలల దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. బాలలంతా వైవిధ్యమైన వేషధారణలతో, నృత్యాలు, పద్యాలు, నాటకాలు, ఉపన్యాసాలతో అలరిస్తారు. ఈ సందర్భంగా బహుమతులను అందుకొని మురిసిపోతారు, ఆనందపడతారు.

Children’s Day Gift Ideas- బాలల దినోత్సవం బహుమతులు

వారి పుట్టినరోజు తర్వాత పిల్లలు ప్రత్యేకంగా జరుపుకునే రోజు ఏదైనా ఉందంటే అది ఈరోజే. మీరు ఈ బాలల దినోత్సవం రోజున వారికి ఆప్యాయతను పంచండి, వారికి చిన్నచిన్న కానుకలు, బహుమతులు అందించి వారిని సంతోషపెట్టండి. వారి సంతోషం మీకు తప్పకుండా సంతృప్తిని అందిస్తుంది. మరి పిల్లల కోసం ఈరోజు ఎలాంటి బహుమతులు ఇవ్వవచ్చో కొన్ని ఆలోచనలను ఇక్కడ జాబితా చేస్తున్నాం, ఒకసారి పరిశీలించండి.

పుస్తకాలు:

ప్రపంచంలోని జ్ఞానం అంతా పుస్తకాల్లో దాగి ఉంటుంది. పిల్లలకు ఇది నేర్చుకునే వయసు, విజ్ఞానం పొందే వయసు. వారికి టెక్ట్స్ బుక్స్ కాకుండా ఇంకా కొత్తగా ఏమైనా కార్టూన్ రూపంలో ఉండే పుస్తకాలను బహుమతిగా ఇవ్వవచ్చు, లేదా ప్రపంచ పటాన్ని చూపే అట్లాస్ లాంటివి ఇవ్వవచ్చు. పిల్లలకు పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వడం, చదివే అలవాటును పెంపొందించడం తల్లిదండ్రులందరూ తప్పనిసరిగా చేయాల్సిన పని.

పజిల్స్:

వారికి పజిల్స్ నేర్పించండి, అక్షరాల చిక్కుముడులతో వారిని పరీక్ష పెట్టండి, ఇంట్లో అందరితో కలిసి ఆడుతూ ఆనందించగలిగే బోర్డ్ గేమ్‌ను కానుకగా ఇవ్వండి. ఇలాంటివి పిల్లల ఆలోచనాశక్తిని మెరుగుపరుస్తాయి.

పిగ్గీ బ్యాంకు:

మీకు ఎంత డబ్బు ఉన్నా, పిల్లలకు పొదుపు విలువను నేర్పించడం చాలా ముఖ్యం. ఈ బాలల దినోత్సవం సందర్భంగా, వారికి పిగ్గీ బ్యాంకును బహుమతిగా ఇవ్వండి, వారు సంపాదించుకోగలిగిన ప్రతి పైసాను ఆదా చేయడం నేర్పండి. సంవత్సరం చివరిలో, వారు ఎంత ఆదా చేసారో చూపించండి. ఇలా పోగుచేసిన డబ్బుతో వారికి అవసరమైన వస్తువు కొనివ్వండి.

రెసిపీ:

ఈ బాలల దినోత్సవం రోజున మీరు మీ పిల్లలకు ఒక ప్రత్యేక వంటకాన్ని రుచిచూపండి? వంట చేయడం వంటి జీవన నైపుణ్యాలను నేర్చుకోవడం ప్రాముఖ్యతను వారికి గుర్తు చేయండి, వారికి ఇష్టమైన ఆహారాన్ని వారితో కలిసే సిద్ధం చేయండి.

మొక్కలు:

ఒక కుండీలో నాటిన మొక్కను పిల్లలకు బహుమతిగా ఇవ్వవచ్చు. మొక్కల పెంపకం, వాటి సంరక్షణపై పిల్లలకు అవగాహన కల్పించాలి. మొక్క నుంచి ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది. అది పిల్లలకు తెలియజేయండి.

టాపిక్

తదుపరి వ్యాసం