Happy Children's Day 2022 । బాలల దినోత్సవం శుభాకాంక్షలు.. నేటి బాలలే, రేపటి జాతి రత్నాలు!-happy children s day telugu wishes greetings nehru quotes whatsapp image to share on november 14 ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Happy Children's Day 2022 । బాలల దినోత్సవం శుభాకాంక్షలు.. నేటి బాలలే, రేపటి జాతి రత్నాలు!

Happy Children's Day 2022 । బాలల దినోత్సవం శుభాకాంక్షలు.. నేటి బాలలే, రేపటి జాతి రత్నాలు!

HT Telugu Desk HT Telugu
Nov 13, 2022 09:20 PM IST

Happy Children's Day 2022: పిల్లలందరూ చదుకోవాలి, అందరికీ సమాన అవకాశాలు లభించాలని కోరుకుందాం. బాలల దినోత్సవం శుభాకాంక్షలు, Children's Day Telugu Wishes, Greetings, WhatsApp Status, Quotes సందేశాలు ఇక్కడ ఉన్నాయి.

Happy Children's Day 2022
Happy Children's Day 2022

Happy Children's Day 2022: భారతదేశంలో ప్రతి ఏడాది నవంబర్ 14న బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈరోజు చాచా నెహ్రూ అని బాలలంతా ప్రేమగా పిలుచుకునే, భారత దేశ తొలి ప్రధాన మంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పుట్టిన రోజు. ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం. నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తు అని నెహ్రూ అనేవారు. రేపటి దేశ పురోగతికి నేటి బాలలే పాటుపడతారని ఆయన బలంగా నమ్మారు. ఈ సందర్భంగా నెహ్రూ పుట్టిన రోజైన నవంబర్ 14ను బాలల దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది.

ఈరోజు పూర్తిగా బాలలకు ప్రత్యేకమైన రోజు. బాలల దినోత్సవం నాడు, పాఠశాలలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తాయి, పిల్లలు వివిధ వేషధారణల దుస్తులు ధరించి, ప్రత్యేక ప్రదర్శనలు ఇస్తూ ఆకట్టుకుంటారు. జవహర్‌లాల్ నెహ్రూ బోధనలు, వారసత్వాన్ని గుర్తు చేసుకుంటారు. ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తారు.

నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని మీ పిల్లలు, మీ చుట్టుపక్కల ఉన్న పిల్లలతో ఉత్సాహంగా జరుపుకోండి. పిల్లలందరికీ ఈరోజు ఆనందాన్ని పంచండి. బాలల దినోత్సవం ప్రత్యేకతను చాటే Happy Children's Day శుభాకాంక్షలు, WhatsApp స్టేటస్‌లు, శుభాకాంక్షల సందేశాలు, చాచా నెహ్రూ సూక్తులు, బాలల విశిష్టతను తెలిపే ఇతర సందేశాలు ఇక్కడ అందిస్తున్నాం. వీటిని బాలలకు తెలియజెప్పండి, వారిని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడంలో మీ వంతు పాత్ర పోషించండి.

Happy Children's Day Wishes in Telugu

నేటి బాలలే రేపటి పౌరులు, రేపటి జాతి సంపదలు.. విరిసి విరియని కుసుమాలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు.

Happy Children's Day 2022
Happy Children's Day 2022

సరైన విద్యతో మాత్రమే మెరుగైన సమాజాన్ని నిర్మించవచ్చు - పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ.

Happy Children's Day 2022
Happy Children's Day 2022

సుసంపన్నమైన దేశం కోసం.. సిద్ధమవుతున్న నేటి ఆణిముత్యాలే రేపటి మన జాతి రత్నాలు. బాలల దినోత్సవ శుభాకాంక్షలు.

Happy Children's Day 2022
Happy Children's Day 2022

తల్లిదండ్రుల కలల ప్రతిరూపాలు.. భావి భారత పౌరులు, వారికి విద్యతో పాటు మంచి విలువలను నేర్పుదాం. బాలల దినోత్సవ శుభాకాంక్షలు.

Happy Children's Day 2022
Happy Children's Day 2022

పాలబుగ్గల నవ్వులు, అపురూపమైన క్షణాలు.. మరపు రాని జ్ఞాపకాలు, బాల్యం ఒక వరం. బాలల దినోత్సవం ఒక సంబరం. బాలల దినోత్సవ శుభాకాంక్షలు.

Happy Children's Day 2022
Happy Children's Day 2022

పిల్లలు భగవంతుని స్వరూపాలు, కల్ల కపటం ఎరుగని కరుణామయులు, రివ్వున ఎగిరే గువ్వలు. బాలల దినోత్సవ శుభాకాంక్షలు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్