Happy Teachers' Day 2022 । గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు..!
Happy Teachers' Day 2022: మీకు విద్యాబుద్దులు నేర్పి, మిమ్మల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దిన మీ గురువులకు శుభాకాంక్షలు తెలియజేయండి. వాట్సాప్, ఫేస్‌బుక్ మెసేజులు పంపటానికి ఇక్కడ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు, Teacher's Day Quotes, Teachers Day Wishes, Teacher's Day Greetings ఇచ్చాము.
ఈరోజు భారతదేశ రెండవ రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి. ఆయనను స్మరించుకుంటూ భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న 'ఉపాధ్యాయ దినోత్సవం' (Teacher's Day) గా జరుపుకుంటున్నాము. 'భారతరత్న' డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక ఫిలాసఫర్, యూనివర్శిటీలో ప్రొఫెసర్ కూడా. ఆయన రాష్ట్రపతి అయ్యాక కొంతమంది విద్యార్థులు వచ్చి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయటానికి రాగా.. దానిని సున్నితంగా తిరస్కరించిన సర్వేపల్లి, బదులుగా ఉపాధ్యాయులందరికి గౌరవ సూచకంగా ఉపధ్యాయ దినోత్సవం జరుపుకోవాలని సలహా ఇచ్చారు. అప్పట్నించీ అదే అనవాయితీ కొనసాగుతూ వస్తుంది.
భారతీయ సమాజంలో గురువులకు విశేష స్థానం ఉంది. తల్లిదండ్రుల తర్వాత గురువునే దైవంగా కొలిచే సంస్కృతి మనది. అందుకే అంటారు గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వ.. గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః అని. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తారు, గురువు ఆ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని సన్మార్గంలో నడిపించి వారి పురోగతికి బాటలు పరుస్తాడు. డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా రాజైనా.. మంత్రైనా ఒక గురువుకు శిష్యుడే.
పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడిగా, ఆచారవ్యవహారాలు నేర్పించే ఆచార్యుడిగా తన జ్ఞానాన్ని మరొకరికి పంచి వారి జీవితాల్లో వెలుగులు నింపుతూ ఇతరుల అభ్యున్నతికి పాటుపడే ప్రతి ఒక్కరూ గురువులే, సదా సర్వదా పూజ్యనీయులే.
ఈ ఉపాధ్యాయ దినోత్సవం రోజున మీరు కూడా మీకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులకు, మీకు జ్ఞానబోధ చేసిన మీ గురువులకు నమస్కరించి వారికి శుభాకాంక్షలు తెలియజేయండి. వారికి వాట్సాప్, ఫేస్ బుక్ ద్వారా కూడా మెసేజులు పంపటానికి ఇక్కడ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు, Teacher's Day Quotes, Teachers Day Wishes, Teacher's Day Greetings ఇచ్చాము. ఇవి మీ టీచర్లకు పంపి వారి ఆశీర్వాదాలు తీసుకోండి.
Happy Teacher's Day 2022- ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
మీరు పంచిన జ్ఞానం, మీరు చేసిన మార్గనిర్దేశం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. మీ బోధనలతో నా కలలను నిజం చేసుకోగలిగాను. గురువుగా నా జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినందుకు మీకు వందనాలు. హ్యపీ టీచర్స్ డే సార్/మేడమ్.
మీ శక్తిని, విలువైన సమయాన్ని మా కోసం ఖర్చు చేసి, మమ్మల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దినందుకు మీకు శతకోటి వందనాలు. హ్యపీ టీచర్స్ డే.
మీ స్ఫూర్తిదాయకమైన మాటలే నా జీవితాన్ని మార్చాయి. మీరు పంచిన జ్ఞానమే నా జీవితంలో వెలుగులు నింపాయి. మీరిచ్చిన ప్రేరణతోనే నేను మరింత పైకి ఎదుగుదున్నాను, మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను గురుదేవా!-- హ్యపీ టీచర్స్ డే.
పాఠాలు చెప్పి ఆచార్యులు అయ్యారు, మంచిచెడులు చెప్పి స్నేహితుడు అయ్యారు, జీవితసారం బోధించి ఫిలాసఫర్ గా నిలిచారు, మా జీవితాలను మార్చి గుండెల్లో నిలిచారు. నేను ఎంత ఎదిగినా మీకు ఎప్పటికీ శిష్యుడను. హ్యపీ టీచర్స్ డే!
నిస్వార్థమైన మనసుతో విద్యార్థులను గొప్పవారిగా తీర్చిదిద్దాలని తపించే ఉపాధ్యాయులందరికీ హిందుస్తాన్ టైమ్స్- తెలుగు తరఫున ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
సంబంధిత కథనం
టాపిక్