Winter Herbal Teas । చలికాలంలో ఇలాంటి హెర్బల్ టీలు తాగితే ఆరోగ్యం, ఆనందం!
Winter Herbal Teas: ఈ చలికాలంలో మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఇక్కడ కొన్ని హెర్బల్ టీల రెసిపీలు అందిస్తున్నాం. వీటిని ప్రతిరోజూ తాగండి.
Winter Herbal Teas: చలికాలంలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది, దగ్గు, జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్ల బారినపడటం ఎక్కువగా జరుగుతుంది. ఇటువంటి సమయాల్లో మామూలు టీలకు బదులుగా మూలికా టీలు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. హెర్బల్ టీలు అనేక అనారోగ్యాలకు వ్యతిరేకంగా పోరాటంలో గొప్ప ఔషధాలుగా పరిగణిస్తారు.
అందరికీ అందుబాటులో ఉండే అల్లం, తులసి, పుదీనా, మిరియాలు, దాల్చినచెక్క మొదలైన మూలికలు, సుగంధాలతో చేసే టీలు మంచి హెర్బల్ టీలుగా చెప్పవచ్చు.వీటిలో కెఫిన్ ఉండదు. ఇక్కడ కొన్ని అలాంటి హెర్బల్ టీల రెసిపీలను అందిస్తున్నాం. మీరు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో ఇలాంటి టీలు తాగవచ్చు.
పుదీనా టీ
పుదీనా , రోజ్మేరీ కలయికతో చేసే టీ చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కడుపు నొప్పికి ఈ టీ తాగితే ఉపశమనం లభిస్తుంది.
Mint Tea Recipe
- కొన్ని పుదీనా ఆకులు
- 1 రెమ్మ రోజ్మేరీ
- నిమ్మరసం రుచికి
తయారీ విధానం:
ముందుగా ఒక పాన్ లో నీటిని మరిగించండి. అందులో రోజ్మెరీ వేసి ఉడికించండి.
ఆ తర్వాత ఒక కప్పులో పుదీనా ఆకులను చించి వేయండి.
ఇప్పుడు రోజ్మెరీతో మరిగించిన నీటిని పుదీనా ఆకులు ఉన్న కప్పులో పోయండి. పది నిమిషాలు అలాగే ఉంచాలి.
చివరగా నిమ్మముక్క వేసి లేదా నిమ్మరసం పిండుకొని తాగాలి.
తులసి టీ
తులసి ఒక అద్భుతమైన హెర్బ్. ఇది మీ రోగనిరోధక శక్తిని పునరుజ్జీవింపజేయడం, హానికర క్రిములతో పోరాడటమే కాకుండా, చర్మ రుగ్మతలను నయం చేయడంలో సహాయపడుతుంది. డయాబెటిక్ సమస్య ఉన్నవారికి ఈ టీ మంచిది. ఇది రక్తంలో చక్కెరను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.
Basil Tea Recipe
- 1/4 కప్పు తులసి ఆకులు
- 1 స్పూన్ తేనె
- 2 స్పూన్ నిమ్మరసం
తయారీ విధానం:
- ముందుగా తులసి ఆకులను పావు కప్పు నీళ్లతో కలిపి మరిగించండి.
- ఒక మరుగు తీసుకుని, ఆ తర్వాత 15 నిమిషాల పాటు మంటను కనిష్ట స్థాయికి తగ్గించాలి.
- ఇప్పుడు ఈ నీటిని ఒక కప్పులో వడకట్టి, ఆపై తేనె, నిమ్మరసం కలుపుకొని తాగాలి.
అల్లం టీ
జలుబు, దగ్గు, జ్వరం వంటివి ఉన్నప్పుడు ఇలాంటి అల్లం టీ తాగాలి. అల్లంలోని సారం సూక్ష్మక్రిములను చంపడానికి సహాయపడుతుంది, తేనె గొంతు నొప్పిని తగ్గిస్తుంది. ఇది కడుపు వ్యాధులను కూడా నయం చేస్తుంది.
Ginger Tea Recipe
1 tsp అల్లం తురుము
1 1/2 స్పూన్ తేనె
2 లవంగాలు
1-అంగుళం దాల్చిన చెక్క
3-అంగుళాల నారింజ తొక్క
తయారీ విధానం:
ముందుగా ఒక కప్పు నీటిని మరిగించండి. ఆపై అందులో పైన పేర్కొన్న అన్ని పదార్థాలను వేసి, వేడిని కనిష్ట స్థాయికి తగ్గించండి.
ఇలా. 15 నిమిషాలు ఉంచి, ఆపై ఒక కప్పులో వడకట్టి ఈ టీని త్రాగాలి.
సంబంధిత కథనం