తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Raksha Bandhan Gifts : హలో బ్రదర్స్.. మీ సిస్టర్స్​కు వీటిని గిఫ్ట్​గా ఇచ్చేయండి

Raksha Bandhan Gifts : హలో బ్రదర్స్.. మీ సిస్టర్స్​కు వీటిని గిఫ్ట్​గా ఇచ్చేయండి

10 August 2022, 12:40 IST

    • Raksha Bandhan 2022 : రక్షాబంధన్ అంటే అన్నా, చెల్లెల్లకు చాలా ముఖ్యమైన పండుగ. అమ్మాయిలకు.. అన్నలు రక్షగా ఉండాలని సూచిస్తూ ఆనందగా ఈ పండుగ చేసుకుంటారు. దీనిలో భాగంగా అన్నలు, తమ్ముళ్లకు.. అమ్మాయిలు రాఖీ కడతారు. బ్రదర్స్ వారికి గిఫ్ట్ ఇస్తారు. అయితే ఎలాంటి గిఫ్ట్​ ఇవ్వాలా అని మీరు ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీకోసమే. 
రాఖీ పూర్ణిమ
రాఖీ పూర్ణిమ

రాఖీ పూర్ణిమ

Raksha Bandhan 2022 : రాఖీ పండుగా రానే వచ్చేసింది. శ్రావణమాసంలో జరుపుకునే ఈ పండుగ చాలా ప్రత్యేకమైనది. ఫెస్టివల్​లో భాగంగా సిస్టర్స్​… బ్రదర్స్​కు రాఖీ కడుతారు. మరి మీకు రాఖీ కట్టే చెల్లెల్లు, అక్కలకు మీరు ఎలాంటి గిఫ్ట్స్ ఇస్తారు. ఈ విషయంపై మీకు క్లారిటీలేదా? అయితే వీటిని కొనేయండి. మీ తోబుట్టువుల దిల్ ఖుష్ చేయండి.

మొక్కలు

మీ సోదరి ప్రకృతిని ఆస్వాదించే వ్యక్తి అయితే.. ఆమెకు ఇండోర్​ ప్లాంట్​ను బహుమతిగా ఇవ్వండి. ఇది చాలా అద్భుతమైన ఆలోచన. పైగా పర్యావరణానికి హాని చేయనవి ఏమైనా ఉన్నాయంటే అవి మొక్కలు మాత్రమే.

వాచీలు

వాచీలు ఎవరినైనా, ఎప్పుడైనా ఆశ్చర్యపరిచే అత్యంత క్లాస్సి, అధునాతన బహుమతులు. మీ సోదరి మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి కాబట్టి.. ఈ మధ్యకాలంలో లేటెస్ట్​గా వచ్చిన వాచ్​లను వారికి గిఫ్ట్​గా ఇవ్వండి. లేదా ఆమెకు ఇష్టమైన బ్రాండ్​లో అందమైన గడియారాన్ని ఆమెకు బహుమతిగా ఇవ్వండి.

హ్యాండ్ బ్యాగ్స్

ఇంకో మంచి ఆలోచన ఏంటంటే.. మీ సోదరికి ఒక మంచి బ్యాగ్‌ని గిఫ్ట్​గా ఇవ్వండి. ఆడపిల్లలకు బ్యాగ్స్​కు మంచి సంబంధం ఉంటుంది. ఎక్కడికి వెళ్లినా.. తమకు కావాల్సిన ప్రతిదీ ఆ బ్యాగ్స్​లోనే క్యారీ చేస్తారు కాబట్టి.. ఆమెకు ఓ చక్కటి బ్యాగ్​ను బహుమతిగా ఇవ్వండి.

స్మార్ట్​వాచ్​

స్మార్ట్‌వాచ్‌లు ఈ రోజుల్లో ట్రెండ్‌గా మారాయి. ఫిట్​నెస్​ మీద ఎక్కువ శ్రద్ధ చూపేవారికి, చదువుకునే వారికి.. ఇవి బాగా ఉపయోగపడతాయి. ఈ సంవత్సరం రక్షా బంధన్ సందర్భంగా.. మీ ప్రియమైన సోదరికి అధునాతన స్మార్ట్‌వాచ్ ఉత్తమ బహుమతి. ఈ మధ్యకాలంలో వచ్చే స్మార్ట్‌వాచ్​లు అనేక కొత్త ఫీచర్‌లతో వస్తున్నాయి. వాటిగురించి బాగా తెలుసుకుని.. వారికి ఉపయోగపడే స్మార్ట్​వాచ్​లను వారికి గిఫ్ట్​గా ఇవ్వండి.

ఇయర్​ఫోన్స్

ఈ రోజుల్లో మంచి ఇయర్‌ఫోన్‌ని ఎవరు ఇష్టపడరు? ఇవి సాధారణంగా అద్భుతమైన, సహేతుకమైన ప్రత్యామ్నాయం. మీ సోదరి వాటిని ఉపయోగించిన ప్రతిసారీ.. మీరు గుర్తొచ్చేలా ఉండాలనుకుంటే వీటిని గిఫ్ట్​గా ఇవ్వొచ్చు.

బుక్స్​

మీ సిస్టర్స్​కి బుక్స్ చదివే అలవాటు ఉంటే.. వాళ్లకి ఓ మంచి బుక్ గిఫ్ట్ ఇవ్వండి. ఆమెకు ఇష్టమైన జానర్ లేదా ఇష్టమైన రచయితకు చెందిన బుక్స్ ఇస్తే వారు హ్యాపీగా ఫీల్ అవుతారు.

టాపిక్

తదుపరి వ్యాసం