తెలుగు న్యూస్  /  Lifestyle  /  4 Effective Home Remedies For Dandruff Free Hair

Dandruff Home Remedies : ఇదిగో ఈ 4 చిట్కాలు ట్రై చేస్తే.. చుండ్రు సమస్య మటాష్

HT Telugu Desk HT Telugu

11 March 2023, 10:13 IST

    • Dandruff Home Remedies : వేసవి కాలం వచ్చింది. వాతావరణం మారిన వెంటనే చుండ్రు సమస్య చాలా వరకు జుట్టును ఇబ్బంది పెట్టడం కనిపిస్తుంది. ఇది చాలా మంది ఎదుర్కొనే సమస్య. చుండ్రు వల్ల జుట్టు రాలడంతోపాటు బలహీనంగా మారుతుంది.
చుండ్రు సమస్య
చుండ్రు సమస్య (unsplash)

చుండ్రు సమస్య

వాతావరణం మారిన వెంటనే, చుండ్రు సమస్య(dandruff problem) చాలా వరకు జుట్టును ఇబ్బంది పెట్టడం ప్రారంభిస్తుంది. నిజానికి ఇది చాలా మంది ఎదుర్కొనే సమస్య. చుండ్రు జుట్టు రాలడానికి(Hair Loss) కారణమవుతుంది. జుట్టు బలహీనంగా మారుతుంది. అంతే కాదు చుండ్రు వల్ల తలలో దురద సమస్య కూడా వేధిస్తుంది. మీరు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, షాంపూతో పాటు కొన్ని ఇంట్లోని వాటిని ఉపయోగించొచ్చు.

చుండ్రును తొలగించేందుకు నిమ్మకాయను(Lemon) ఎక్కువగా ఉపయోగిస్తారు. మీరు కూడా చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతుంటే, మీరు నిమ్మరసాన్ని మీ జుట్టుకు రుద్దవచ్చు. చుండ్రును పోగొట్టడమే కాకుండా, జుట్టు కూడా మెరుస్తూ ఉంటుంది.

షాంపూలో తేనె(Honey) రాసుకోవడం వింటే కాస్త వింతగా అనిపించినా, షాంపూలో తేనె కలిపి రాసుకుంటే తల దురద, చుండ్రు నుంచి విముక్తి పొందవచ్చు. ఎందుకంటే తేనెలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి.

కలబంద జుట్టు(Hair)కు మంచిదని భావిస్తారు. మీరు చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతుంటే, షాంపూ, కలబందను మిక్స్ చేసి, కాసేపు మసాజ్ చేస్తే, జుట్టు నుండి చుండ్రు శుభ్రం చేయడంలో సహాయపడుతుంది.

జుట్టు కోసం ఉసిరి(Amla) శతాబ్దాల నుండి ఉపయోగించబడుతోంది. ఉసిరిలో ఉండే గుణాలు జుట్టు(Hair)ను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఉసిరిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చుండ్రును తొలగిస్తుంది.

ఈ కాలంలో చాలా మంది జుట్టు సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీర్ఘకాలం పాటు ఒత్తిడి(Stress)ని అనుభవిస్తే, అది నిద్రలేమి, ఆందోళన, ఆకలి మందగించటం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ పరిస్థితులన్నీ మీ జుట్టుపై చెడుప్రభావం చూపిస్తాయి. ఫలితంగా జుట్టు రాలడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు, క్రమక్రమంగా వెంట్రుకలు(Hairs) తెల్లబడటం ప్రారంభిస్తాయి. కాబట్టి మిమ్మల్ని ఒత్తిడి లేకుండా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి రోజూ ధ్యానం చేయాలి. సరైన నిద్రపోవాలి.

రసాయనాలు అధికంగా ఉండే జుట్టు ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగించడం వలన కూడా జుట్టు తెల్ల బడుతుంది. హెయిర్ ప్రొడక్ట్స్‌(Hair Products)లో ఉండే సల్ఫేట్‌లు జుట్టుకు కొన్ని ప్రయోజనాలు చేకూర్చినప్పటికీ, వీటి వల్ల జుట్టు పొడిబారి, త్వరగా పాడైపోయేలా చేస్తాయి. ఇది జుట్టును తెల్లగా మారుస్తుంది. అందువల్ల సల్ఫేట్ లేని జుట్టు సంరక్షణ ఉత్పత్తులను ఎంచుకోండి.