తెలుగు న్యూస్ / ఫోటో /
DIY Homemade Shampoo । జుట్టు రాలడం నివారించాలా? ఇంట్లోనే ఇలా షాంపూను తయారు చేసుకోండి!
(1 / 8)
జుట్టు రాలడాన్ని అరికట్టడానికి మీరు ఇప్పటివరకు వివిధ రకాల షాంపూలు లేదా నూనెలను ఉపయోగించినా ఫలితం కనిపించడం లేదంటే, మీ జుట్టుకు ప్రత్యేక సంరక్షణ అవసరం. సహజమైన షాంపూ మీ వెంట్రులపై కఠినంగా ఉండవు, జుట్టుకు పోషణ కూడా లభిస్తుంది.
(2 / 8)
షాంపూని ప్రత్యేకంగా స్టోర్ నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. మీకు మీరుగా ఇంట్లోనే షాంపూ ఎలా తయారు చేసుకోవచ్చో ఇక్కడ తెలుసుకోండి.
(4 / 8)
కుంకుడు కాయలను ఒక రాత్రి పూర్తిగా నీళ్లలో నానబెట్టండి. ఆ తరువాత, ఉదయం వాటిని ఒలిచి విత్తనాలను తొలగించండి. ఇప్పుడు ఈ నానబెట్టిన కుంకుడు కాయలను మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి.
(5 / 8)
అలాగే కొన్ని మందార పువ్వులను సేకరించి వాటిని కూడా మెత్తగా పేస్ట్ చేయండి. ఇప్పుడు ఈ రెండు పేస్టులను బాగా కలిపేయండి. మీ షాంపూ సిద్ధమైనట్లే.
(6 / 8)
ఈ మిశ్రమాన్ని షాంపూలా వాడండి. దీనికి కొంచెం నురగ తక్కువగా రావచ్చు, అయినప్పటికీ దీనితో తలను శుభ్రం చేయవచ్చు.
(7 / 8)
ఈ హోమ్ మేడ్ షాంపూని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. మీరు కేవలం కొన్ని సెషన్లలోనే ఫలితాలను చూడవచ్చు. అయితే, ఏదైనా సమస్య ఉంటే చర్మవ్యాధి నిపుణులు, ఆయుర్వేద నిపుణులతో చర్చించి ముందుకు వెళ్లండి.
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు