DIY Body Scrubs | ముఖం తెల్లగా ఉంటే సరిపోతుందా, మిగతా శరీర శుభ్రత? అందుకే ఈ హోమ్‌మేడ్ బాడీ స్క్రబ్‌లు!-body scrubs do it your own at home here is how ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diy Body Scrubs | ముఖం తెల్లగా ఉంటే సరిపోతుందా, మిగతా శరీర శుభ్రత? అందుకే ఈ హోమ్‌మేడ్ బాడీ స్క్రబ్‌లు!

DIY Body Scrubs | ముఖం తెల్లగా ఉంటే సరిపోతుందా, మిగతా శరీర శుభ్రత? అందుకే ఈ హోమ్‌మేడ్ బాడీ స్క్రబ్‌లు!

Manda Vikas HT Telugu
Oct 25, 2022 03:56 PM IST

DIY Body Scrubs: మొఖం మీ ఒంట్లో భాగమే.. నడుము, చేతులు, కాళ్లు మీ ఒంట్లో భాగమే. ముఖానికేమో ఫేస్ ప్యాక్‌లు, మిగతా బాడీకి సబ్బులు ఏ? శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే స్క్రబ్ కూడా చేయాలి. అవి ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

DIY Body Scrubs
DIY Body Scrubs (Unsplash)

అందం గురించి మాట్లాడితే ఎక్కువ మంది ముఖానికే ప్రాధాన్యతనిస్తారు. ముఖానికి సంబంధించిన సౌందర్య ఉత్పత్తుల గురించే ప్రస్తావిస్తారు. మిగతా శరీరాన్ని మొత్తం మరిచిపోతారు. ముఖం మన ఒంట్లో భాగమే.. నడుము, కాళ్లు, చేతులు కూడా మన ఒంట్లో భాగమే. కాబట్టి అన్నింటి పరిశుభ్రత ముఖ్యం. ముఖం తెల్లగా మెరిసి, మిగతా శరీర భాగాలు ముదురు రంగులో ఉంటే అదే ఎక్కువ ఆకర్షిస్తుంది. మొత్తం అందాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి శరీరం అంతా మెరిసేలా శుభ్రపరుచుకోవాలి.

yearly horoscope entry point

ముఖం మెరిసిపోవడానికి చాలా D ఉంటాయి. కానీ చేతులు, కాళ్ళు , మిగిలిన శరీరాన్ని శుభ్రం చేయడానికి కేవలం సబ్బు లేదా బాడీ వాష్ మాత్రమే ఉపయోగిస్తే సరిపోదు. దీని వల్ల చర్మంపై ఉన్న డెడ్ స్కిన్ క్లీన్ అవ్వదు. అందుకు స్క్రబ్బర్ ఉపయోగించాల్సి ఉంటుంది.

DIY Body Scrubs

మీరు నిలువెల్లా మెరిసిపోవాలంటే, మీ శరీర శుభ్రతకు బాడీ స్క్రబ్ ఉపయోగించండి. ఈ బాడీ స్క్రబ్‌ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బాడీ స్క్రబ్‌ను తయారు చేసేందుకు ఎలాంటి పదార్థాలు ఉపయోగించాలి, తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం.

కాఫీతో బాడీ స్క్రబ్

కాఫీ పొడితో మంచి బాడీ స్క్రబ్ తయారు చేసుకోవచ్చు. దీన్ని తయారు చేయడానికి మీకు ఒక పావు కప్పు కాఫీ గింజలు, పావు కప్పు బ్రౌన్ షుగర్, ఆలివ్ ఆయిల్, రెండు విటమిన్ ఇ క్యాప్సూల్స్ అవసరం. వీటన్నింటిని కలిపి ముతక పేస్ట్‌ను తయారు చేయండి. ఇప్పుడు దీన్ని శరీరమంతా అప్లై చేసి, చేతులతో తేలికగా స్క్రబ్ చేయండి. తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.

చక్కెర-కొబ్బరి నూనెతో బాడీ స్క్రబ్

కడి చక్కెరను ముతకగా దంచండి. ఆ తర్వాత అందులో కొబ్బరినూనె, తేనె కలిపి పేస్ట్‌ లాగా సిద్ధం చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను చేతులు, కాళ్ళతో పాటు నడుము , వీపుపై అప్లై చేసి చేతులతో తేలికపాటి మసాజ్ చేయండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఈ స్క్రబ్‌తో చర్మంపై నిగారింపు వస్తుంది.

చక్కెర- టమోటాతో బాడీ స్క్రబ్

మెడ, మోచేతులు, మోకాళ్లు డెడ్ స్కిన్ కారణంగా నల్లగా మారితే, టొమాటోలో పంచదార కలిపి స్క్రబ్ సిద్ధం చేసుకోని ఆయా భాగాలలో తేలికగా మసాజ్ చేసి కడుక్కోవాలి. ఈ స్క్రబ్ సన్ బర్న్, టానింగ్ పోగొట్టుకోవటానికి ఉపయోగపడుతుంది.

Whats_app_banner

సంబంధిత కథనం