DIY Neem Soap | వానాకాలంలో ఆయుర్వేద సబ్బులు మంచివి, మీకు మీరుగా ఇలా చేసుకోవచ్చు!-ayurvedic soaps good for skincare in monsoon here is diy neem soap ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Ayurvedic Soaps Good For Skincare In Monsoon, Here Is Diy Neem Soap

DIY Neem Soap | వానాకాలంలో ఆయుర్వేద సబ్బులు మంచివి, మీకు మీరుగా ఇలా చేసుకోవచ్చు!

HT Telugu Desk HT Telugu
Aug 04, 2022 07:36 PM IST

వర్షాకాలంలో యాంటీబాక్టీరియల్, యాంటీ ఫంగల్, ఆయుర్వేద గుణాలు కలిగిన సబ్బుతో స్నానం చేస్తే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే మార్కెట్లో దొరికే సబ్బుల్లో రసాయనాలు ఉండవచ్చు. మీకు మీరుగా సబ్బును చేసుకోవాలనుకుంటే ఇక్కడ విధానం తెలుసుకోండి.

DIY Neem Soap
DIY Neem Soap (stock photo)

వర్షాకాలంలో చల్లటి వాతావరణం కారణంగా చాలామంది చర్మ సంరక్షణ కోసం చాలా ముఖ్యం. ఈ సీజన్ లో ఉండే తేమ వాతావరణం కారణంగా చర్మం జిడ్డుగా మారుతుంది. ఫలితంగా మొటిమలు, మచ్చలు వస్తాయి. అయితే కొన్ని చిన్నచిన్న మార్పులను చేర్చుకోవడం వల్ల మీ చర్మం తాజాగా, మెరుస్తూ ఉండేందుకు సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా వర్షాకాలం సీజనల్ వ్యాధులకు ప్రసిద్ధి కాబట్టి యాంటీసెప్టిక్, యాంటీ బాక్టీరియల్ గుణాలు కలిగిన సబ్బులు ఉపయోగించటం మంచిది.

ఆయుర్వేద గుణాలు కలిగిన సబ్బులు చర్మం సహజ pH బ్యాలెన్స్‌కు భంగం కలిగించకుండా శరీర మలినాలను మృదువుగా తొలగిస్తుంది. ఇంకా బ్యాక్టీరియా, ఇతర కాలుష్య కారకాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. ఇలాంటి సబ్బులు చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి చేస్తూ చర్మంలోని సహజ నిగారింపును కాపాడతాయి.

అయితే మార్కెట్లో లభ్యమయ్యే సబ్బుల్లో రసాయనాలు కలపవచ్చు. బదులుగా ఇంట్లోనే సులభంగా వేప ఆకులతో సబ్బును చేసుకోవచ్చు. వేపలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా నుంచి చర్మాన్ని కాపాడుతుంది. కాబట్టి బయట మార్కెట్లో లభించే సబ్బులు కాకుండా రసాయన రహిత వేప సబ్బుతో స్నానం చేయాలనుకుంటే ఈ వేప సబ్బును ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు

  1. వేప ఆకులు
  2. నీరు
  3. గ్లిజరిన్ సబ్బు పదార్థం
  4. విటమిన్ ఇ క్యాప్సూల్
  5. కావలసిన ఆకారంలో అచ్చు

వేప సబ్బు తయారీ విధానం

  • ముందుగా కొన్ని వేప ఆకులను దుమ్ము, ధూళి తొలగిపోయేలా పరిశుభ్రంగా కడగాలి.
  • తర్వాత ఈ ఆకులను మిక్సీలో వేసి, కొన్ని నీళ్లుపోసి మెత్తని పేస్టులా రుబ్బుకోవాలి.
  • ఇప్పుడు గ్లిజరిన్ సబ్బు బేస్ ను చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.
  • ఇప్పుడు ఒక గిన్నెలో వేడి నీటిని తీసుకొని అందులో గ్లిజరిన్ సబ్బు బేస్ ముక్కలు వేయండి.
  • గ్లిజరిన్ కరుగుతుండగా అందుకో వేప పేస్టును కలపండి.
  • ఈ మిశ్రమంలో విటమిన్ ఇ క్యాప్సూల్ కూడా వేసి కొద్దిగా మిశ్రమాన్ని వేడిచేయండి.
  • దీంతో చిక్కగా మారిన పేస్టును కావాల్సిన ఆకృతి గల అచ్చులో వేసి చల్లారనివ్వాలి.

అంతే, మంచి వేప గుణాలు కలిగిన సబ్బు సిద్ధమైంది. ఈ సబ్బుతో శరీరాన్ని శుభ్రం చేసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

WhatsApp channel

సంబంధిత కథనం