Shampooing Tips । షాంపూ చేసుకునేటపుడు జాగ్రత్త.. లేదంటే జుట్టు రాలుతుంది!-know the proper way of shampooing to avoid hair fall ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Know The Proper Way Of Shampooing To Avoid Hair Fall

Shampooing Tips । షాంపూ చేసుకునేటపుడు జాగ్రత్త.. లేదంటే జుట్టు రాలుతుంది!

Nov 17, 2022, 10:24 PM IST HT Telugu Desk
Nov 17, 2022, 10:24 PM , IST

  • Shampooing Tips: జుట్టును అప్పుడప్పుడు షాంపూతో తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. అయితే షాంపూ చేసుకునేటప్పుడు జాగ్రత్త, ఇలాంటి తప్పులు చేస్తే అది మీ జుట్టు రాలిపోయేలా చేస్తుంది.

మీరు జుట్టు రాలడం సమస్యతో బాధపడుతున్నారంటే, అందుకు మీ షాంపూ కూడా ఒక కారణం కావచ్చు. మీరు హెయిర్ వాష్ చేసే విధానంతో జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంటుంది. సరైన విధాన ఇక్కడ తెలుసుకోండి.

(1 / 7)

చాలా మంది షాంపూ చేసేటప్పుడు దానిని నేరుగా జుట్టుపై ఉపయోగిస్తారు. జుట్టుకు షాంపూని అప్లై చేసిన తర్వాత అది వెంటనే నురుగును ఇస్తుంది. కానీ ఈ పద్ధతి పూర్తిగా తప్పు అంటున్నారు నిపుణులు.

(2 / 7)

ఇలా నేరుగా జుట్టుపై షాంపూను ఉపయోగించడం వలన కొద్దిమొత్తంలో షాంపూ జుట్టులో పేరుకుపోతుంది, ఇది ఎండిపోయినపుడు జుట్టు రాలడానికి దారితీస్తుంది.

(3 / 7)

మీ జుట్టును షాంపూ చేయడానికి, ముందుగా జుట్టును నీటితో బాగా తడపండి. ఆపై పావు కప్పు నీళ్లలో షాంపూ వేసి బాగా కలపాలి. ఇలా పలుచన చేసిన షాంపూ ద్రావణాన్ని జుట్టుకు అప్లై చేసి రుద్దుకోవాలి. షాంపూ చేసుకునేటపుడు మీ స్కాల్ప్‌ను గట్టిగా రుద్దకండి. ఇది షాంపూ చేసుకునే సరైన విధానం.

(4 / 7)

కండీషనర్‌ను ఎల్లప్పుడూ జుట్టు అంచులకు అప్లై చేయాలి. జుట్టు మూలాలపై ఎప్పుడూ ఉపయోగించవద్దు. ఇలా చేయడం వల్ల జుట్టు చిట్లిపోతుంది. మీ జుట్టుకు కండీషనర్‌ను సున్నితంగా అప్లై చేసి ఐదు నిమిషాలు అలాగే ఉంచండి. దీని తర్వాత తలస్నానం చేయండి.

(5 / 7)

రోజూ షాంపూ చేయడం వల్ల జుట్టులోని సహజ నూనెలు తొలగిపోతాయి. ఫలితంగా, జుట్టు పొడిగా, నిర్జీవంగా మారుతుంది ఆ తర్వాత రాలిపోతుంది.

(6 / 7)

మీ జుట్టును శుభ్రం చేసుకోవడానికి ఎల్లప్పుడూ సల్ఫేట్ లేని తేలికపాటి షాంపూని ఉపయోగించండి. దీని కోసం మీరు హెర్బల్ లేదా ఏదైనా ఆయుర్వేద షాంపూని ఉపయోగించవచ్చు. ఇటువంటి షాంపూలలో చాలా తక్కువ లేదా రసాయనాలు ఉండవు.

(7 / 7)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు