Home Remedies for Dandruff : చుండ్రు సమస్య మొదలైందా? అయితే ఈ చిట్కాలు మీకోసమే..
Home Remedies for Dandruff : చలికాలంలో ఎక్కువ మంది ఎఫక్ట్ అయ్యే వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చుండ్రు గురించే. ఈ చుండ్రు వస్తే అంత ఈజీగా పోదు. పైగా జట్టు ఎక్కువ రాలిపోతూ ఉంటుంది. ఈ సమస్యను సహజ నివారణలతో ఎలా దూరం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Home Remedies for Dandruff : చాలా మందికి వింటర్ సీజన్ అంటే ఇష్టం అయినప్పటికీ.. ఈ సీజన్ మొదలవగానే చాలామందికి చుండ్రు సమస్య కూడా మొదలవుతుంది. దీనికి అతి పెద్ద కారణం పొడి గాలి. ఇది తలలో ఉండే తేమను లాగేస్తుంది. అంతేకాకుండా మలాసెజియా అనే ఫంగస్ శీతాకాలంలో గాలిలో ఉంటుంది. ఇది తలపై చుండ్రుకు కూడా కారణమవుతుంది. ఇవే కాకుండా అధిక ఒత్తిడి, హార్మోన్ అసమతుల్యత, విటమిన్స్ లోపం వల్ల కూడా ఈ చుండ్రు సమస్య రావొచ్చు. ఈ చుండ్రును రూట్ నుంచి వదిలించుకోవడానికి కొన్ని రెమెడీస్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుని.. చుండ్రు ఉంటే మీరు కూడా ఫాలో అయిపోండి.
నువ్వుల నూనె
నువ్వుల నూనె జుట్టుకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. 74% వరకు కొవ్వు ఆమ్లాలు నువ్వుల నూనెలో ఉంటాయి. ఇది జుట్టును మృదువుగా, స్కాల్ప్ మీద తేమను పెంచుతుంది. నువ్వుల నూనెలో విటమిన్ ఎ, సి ఉన్నాయి. ఇది జుట్టు పెరుగుదలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వారానికి కనీసం మూడుసార్లు నువ్వుల నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల జుట్టు రాలడం, చుండ్రు, చివర్లు చిట్లిపోవడం వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు.
కొబ్బరి నూనె
200 గ్రాముల కొబ్బరి నూనెలో సుమారు 5 గ్రాముల కర్పూరం పొడిని కలిపి మూడు వారాల పాటు రాస్తే చుండ్రు తొలగిపోతుంది. తల దురద, జుట్టు రాలడం, జుట్టు అకాల నెరసిపోవడానికి కూడా కొబ్బరి నూనె చాలా మేలు చేస్తుంది. కొబ్బరి నూనెలో లభించే పోషకాలు చుండ్రును తొలగించగలవు.
వేప నూనె
వేప నూనె కూడా చుండ్రును తొలగించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే వేపలో విటమిన్ ఇ ఉంటుంది. ఇది జుట్టు పొడిబారడాన్ని తగ్గిస్తుంది. స్కాల్ప్ నుంచి చుండ్రును తొలగిస్తుంది. యాంటీ ఫంగల్ గుణాలు కూడా వేపలో ఉన్నాయి. ఒక కర్పూరంలో వేపనూనె కలిపి అప్లై చేయడం వల్ల రెండు వారాల్లో చుండ్రు తొలగిపోతుంది. ఎండిన వేప ఆకులను మెత్తగా గ్రైండ్ చేసి అందులో ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి జుట్టు మూలాలకు పట్టించాలి. ఒక గంటలోపు మీ జుట్టును షాంపూ చేయండి.
వీటిని ఫాలో అయ్యేముందు నిపుణులను సంప్రదించండి. ఒకవేళ మీకు ఇతరత్ర కారణాల వల్ల చుండ్రు వస్తే.. ఇవి అంతగా పనిచేయవు.
సంబంధిత కథనం