Stock market news today : ఫ్లాట్‌గా దేశీయ సూచీలు.. నిఫ్టీకి 25 పాయింట్ల లాస్
10 January 2023, 9:17 IST
- Stock market news today : ఇండియా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి.
ఇండియా స్టాక్ మార్కెట్
Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ను ఫ్లాట్‌గా ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 12 పాయింట్ల లాభంతో 60, 759 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 27 పాయింట్ల నష్టంతో 18,075 వద్ద ట్రేడ్ అవుతోంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్‌ను భారీ లాభాలతో ముగించాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిణామాలు ఇందుకు కారణం. బీఎస్ఈ సెన్సెక్స్ 847 పాయింట్లు పెరిగి 60,747 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 242 పాయింట్ల లాభంతో 18,101 వద్ద ముగిసింది. బీఎస్ఈ మిడ్‌క్యాప్ సూచీ 0.93శాతం, స్మాల్ క్యాప్ సూచీ 0.56శాతం పెరిగాయి. ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ను సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా 60805- 18121 వద్ద మొదలుపెట్టాయి.
పివోట్ ఛార్ట్ ప్రకారం నిఫ్టీ సపోర్ట్ 17,981- 17,933- 17,854 వద్ద ఉంది. నిఫ్టీ రెసిస్టెన్స్ 18,138- 18,186- 18,265 వద్ద ఉంది.
స్టాక్స్ టు బై..
Stocks to buy today : మ్యాక్స్ ఫినాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎంఎఫ్ఎస్ఎల్):- బై రూ. 740, స్టాప్ లాస్ రూ. 720, టార్గెట్ రూ. 775
పాలీక్యాబ్:- బై రూ. 2653, స్టాప్ లాస్ రూ. 2620, టార్గెట్ రూ. 2720
హెచ్‌సీఎల్ టెక్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 1040, టార్గెట్ రూ. 1080- రూ. 1090
మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం):- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 1270, టార్గెట్ రూ. 1350- రూ. 1370
పూర్తి లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
లాభాలు.. నష్టాలు..
టాటా మోటార్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, సన్‌ఫార్మా, హెచ్‌యూఎల్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు..
US Stock markets today : అమెరికా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్‌ను ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.34శాతం నష్టపోగా.. ఎస్ అండ్ పీ 500 0.08శాతం పతనమైంది. నాస్డాక్ మాత్రం 0.63శాతం లాభపడింది.
ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. జపాన్ నిక్కీ 0.8శాతం లాభాల్లో ఉండగా.. ఎస్ అండ్ పీ 200 0.2శాతం నష్టాల్లో ఉంది.
త్రైమాసిక ఫలితాలు..
Q3 results today : అథర్వ్ ఎంటర్ప్రైజెస్, ఎక్సెల్ రియాల్టీ ఎన్ ఇన్ఫ్రా, గాలా గ్లోబల్ ప్రాడక్ట్స్, జీఐ ఇంజినీరింగ్ సొల్యూషన్స్, మార్సన్స్, క్వెస్ట్ క్యాపిటల్ మార్కెట్స్‌తో పాటు ఇతర సంస్థల క్యూ3 త్రైమాసిక ఫలితాలు ఈ రోజు వెలువడనున్నాయి.
TCS Q3 త్రైమాసిక ఫలితాల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 203.13కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1723.79కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.