Stocks to buy today : ట్రేడర్స్​ ట్రాక్​ చేయాల్సిన నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​..-day trading guide for tuesday hcl tech sail among 6 stocks to buy today 10 january 2023 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ట్రేడర్స్​ ట్రాక్​ చేయాల్సిన నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​..

Stocks to buy today : ట్రేడర్స్​ ట్రాక్​ చేయాల్సిన నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​..

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 10, 2023 09:12 AM IST

Stocks to buy today : ట్రేడర్స్​ ట్రాక్​ చేయాల్సిన నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ను నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే..
నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే.. ((Photo: iStock))

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ను భారీ లాభాలతో ముగించాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిణామాలు ఇందుకు కారణం. బీఎస్​ఈ సెన్సెక్స్​ 847 పాయింట్లు పెరిగి 60,747 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 242 పాయింట్ల లాభంతో 18,101 వద్ద ముగిసింది. బీఎస్​ఈ మిడ్​క్యాప్​ సూచీ 0.93శాతం, స్మాల్​ క్యాప్​ సూచీ 0.56శాతం పెరిగాయి.

"సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో కనిపించిన సానుకూలత.. బుల్స్​ను ఉత్తేజ పరుస్తుంది. 18250- 18300 లెవల్స్​ వద్ద కీలకమైన రెసిస్టెన్స్​ ఉంది. ఇది దాటితే.. బుల్స్​ జోరు కనిపించే అవకాశం ఉంది. 18,000 వద్ద సపోర్ట్​ ఉంది," అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ టెక్నికల్​ రీసెర్ట్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి వెల్లడించారు.

ఎస్​జీఎక్స్​ నిఫ్టీ..

Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ను ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. ఎస్​జీఎక్స్​ నిఫ్టీ.. దాదాపు 30 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

TCS Q3 results : టీసీఎస్​ క్యూ3 ఫలితాలు వెల్లడయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ను ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.34శాతం నష్టపోగా.. ఎస్​ అండ్​ పీ 500 0.08శాతం పతనమైంది. నాస్​డాక్​ మాత్రం 0.63శాతం లాభపడింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 203.13కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1723.79కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

స్టాక్స్​ టు బై..

Stocks to buy : మ్యాక్స్​ ఫినాన్షియల్​ సర్వీసెస్​ లిమిటెడ్​ (ఎంఎఫ్​ఎస్​ఎల్​):- బై రూ. 740, స్టాప్​ లాస్​ రూ. 720, టార్గెట్​ రూ. 775

పాలీక్యాబ్​:- బై రూ. 2653, స్టాప్​ లాస్​ రూ. 2620, టార్గెట్​ రూ. 2720

హెచ్​సీఎల్​ టెక్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 1040, టార్గెట్​ రూ. 1080- రూ. 1090

మహీంద్రా అండ్​ మహీంద్రా (ఎం అండ్​ ఎం):- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 1270, టార్గెట్​ రూ. 1350- రూ. 1370

SAIL share price target : స్టీల్​ అథారిటీ ఆఫ్​ ఇండియా (ఎస్​ఏఐఎల్​):- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 82, టార్గెట్​ రూ. 95

ఫెడరల్​ బ్యాంక్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 128, టార్గెట్​ రూ. 148

(గమనిక:- ఇవి నిపుణుల సూచనలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

WhatsApp channel

సంబంధిత కథనం