తెలుగు న్యూస్  /  Business  /  Stock Market News Today 1 November 2022 Latest Updates

Stock market news today : లాభాల్లో దేశీయ సూచీలు.. నిఫ్టీ 90 పాయింట్లు జంప్​

01 November 2022, 9:18 IST

    • Stock market news : దేశీయ స్టాక్​ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడ్​ అవుతున్నాయి.
ఇండియా స్టాక్​ మార్కెట్లు
ఇండియా స్టాక్​ మార్కెట్లు (REUTERS)

ఇండియా స్టాక్​ మార్కెట్లు

Stock market news : దేశీయ స్టాక్​ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ను లాభాలతో ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 354పాయింట్లు వృద్ధిచెంది 61,100 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ50..  97పాయింట్ల లాభంతో 18,110 వద్ద ట్రేడ్​ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

Changes from May 1 : మే 1 నుంచి ఈ విషయాల్లో భారీ మార్పులు.. కచ్చితంగా తెలుసుకోవాలి

Best Mutual Funds : ఏడాది కాలంలో అద్భుత రిటర్నులు ఇచ్చిన టాప్​ మ్యూచువల్​ ఫండ్స్​ ఇవే..

Mahindra XUV 3XO : మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ వేరియంట్లు- వాటి ధరలు..

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​.. ఈ రూ. 155 స్టాక్​తో షార్ట్​ టర్మ్​లో భారీ ప్రాఫిట్స్​!

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో బీఎస్​ఈ సెన్సెక్స్​ 786 పాయింట్లు పెరిగి 60,746 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ50.. 225 పాయింట్లు వృద్ధిచెంది 18,012 వద్ద ముగిసింది. బ్యాంక్​ నిఫ్టీ సూచీ 317 పాయింట్ల లాభంతో 41,307 మార్క్​కు చేరింది. మిడ్​ క్యాప్​ సూచీ లాభలు చూడగా.. స్మాల్​ క్యాప్​ సూచీ మాత్రం నష్టాల్లో ముగిసింది. ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ను సెన్సెక్స్​, నిఫ్టీలు వరుసగా 61,066- 18,131 వద్ద మొదలుపెట్టాయి.

పివొట్​ ఛార్ట్​ ప్రకారం నిఫ్టీ సపోర్టు 17,931- 17,902 వద్ద ఉంది. 18,025-18,054 లెవల్స్​ వద్ద రెసిస్టెన్స్​ ఉంది.

"టెక్నికల్స్​ పరంగా నిఫ్టీ అప్​ట్రెండ్​లోనే కనిపిస్తోంది. ఏదైనా రివర్సల్​ కనిపించే వరకు.. ట్రేడర్లు ఈ అప్​ట్రెండ్​తో లబ్ధిపొందవచ్చు," అని 5పైసా.కామ్​ లీడ్​ రీసెర్చ్​ రుచిత్​ జైన్​ వెల్లడించారు.

స్టాక్స్​ టు బై..

  • Stocks to buy : అశోక్​ లేల్యాండ్​:- బై రూ. 153, స్టాప్​ లాస్​ రూ. 148, టార్గెట్​ రూ. 160
  • రిలయన్స్​ ఇండస్ట్రీస్​:- బై రూ. 2550, స్టాప్​ లాస్​ రూ. 2500, టార్గెట్​ రూ. 2625

స్టాక్స్​ టు బై పూర్తి లిస్ట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

లాభాలు.. నష్టాలు..

మారుతీ, ఐసీఐసీఐ బ్యాంక్​, రిలయన్స్​, పవర్​గ్రిడ్​, ఇన్ఫీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

టాటా స్టీల్​, యాక్సిస్​ బ్యాంక్​, ఎల్​ అండ్​ టీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లు..

అమెరికా స్టాక్​ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. రేపు ఫెడ్​ సమావేశం నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత వ్యవహరిస్తున్నారు. డౌ జోన్స్​ 0.39శాతం, ఎస్​ అండ్​ పీ 500 0.75శాతం, నాస్​డాక్​ 1.03శాతం పతనమయ్యాయి.

భారతీ ఎయిర్​టెల్​ క్యూ2 త్రైమాసిక ఫలితాల పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఆసియా మార్కెట్లు మాత్రం లాభాల్లో ఉన్నాయి. జపాన్​ నిక్కీ 0.15శాతం, సౌత్​ కొరియా కాస్పి 0.28శాతం మేర లాభాల్లో ట్రేడ్​ అవుతున్నాయి.

త్రైమాసిక ఫలితాలు..

Q2 results 2022 : సన్​ ఫార్మా, అదానీ పోర్ట్స్​, టెక్​ మహీంద్ర, యూపీఎల్​, పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​, నైకా, కర్ణాటక బ్యాంక్​, ఎల్​ఐసీ హౌజింగ్​ ఫైనాన్స్​, వోల్టాస్​, వరుణ్​ బేవరేజెస్​, వర్​పూల్​, చంబల్​ ఫర్టిలైజర్స్​ అండ్​ కెమికల్స్​, జేకే టైర్స్​, కాన్సాయ్​ నెరొలాక్​ పెయింట్స్​తో పాటు ఇతర సంస్థ త్రైమాసిక ఫలితాలు నేడు వెలువడనున్నాయి.

టాటా స్టీల్​ క్యూ2 త్రైమాసిక ఫలితాల పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 4,178.61కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు.. రూ .1,107.10కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.