తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Multibagger Ev Battery Stocks : నేటి ఈ 'ఈవీ బ్యాటరీ' స్టాక్స్​.. రేపటి మల్టీబ్యాగర్స్​!

Multibagger EV battery stocks : నేటి ఈ 'ఈవీ బ్యాటరీ' స్టాక్స్​.. రేపటి మల్టీబ్యాగర్స్​!

31 October 2022, 15:13 IST

google News
    • Multibagger EV battery stocks : దేశంలో ఈవీ సెగ్మెంట్​కు డిమాండ్​ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈవీ బ్యాటరీ సంస్థలు ఫోకస్​లోకి వచ్చాయి. కింద చెప్పిన 5 ఈవీ బ్యాటరీ స్టాక్స్​.. భవిష్యత్తులో మల్టీబ్యాగర్స్​గా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
నేటి ఈ 'ఈవీ బ్యాటరీ' స్టాక్స్​.. రేపటి మల్టీబ్యాగర్స్​!
నేటి ఈ 'ఈవీ బ్యాటరీ' స్టాక్స్​.. రేపటి మల్టీబ్యాగర్స్​!

నేటి ఈ 'ఈవీ బ్యాటరీ' స్టాక్స్​.. రేపటి మల్టీబ్యాగర్స్​!

Multibagger EV battery stocks : భారత్​లో ఇప్పుడిప్పుడే ఈవీ రంగానికి డిమాండ్​ పెరుగుతోంది. దిగ్గజ ఆటో సంస్థలన్నీ ఈవీ కార్లను తయారు చేసేందుకు పోటీపడుతున్నాయి. ఇండియాలో ఈవీ సెక్టార్​కు మంచి అవకాశాలు ఉంటాయని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి. ఇక స్టాక్​ మార్కెట్​ మదుపర్లు కూడా ఈవీ థీమ్​కి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈవీ కార్లు తయారు చేస్తున్న ఆటో సంస్థలపై దృష్టిసారిస్తున్నారు. అయితే.. ఈ వాహనాల్లో 'ఈవీ బ్యాటరీలు' చాలా కీలకంగా ఉంటాయి. మరి ఈవీ కార్లకు డిమాండ్​ పెరుగుతుంటే.. ఈ బ్యాటరీలకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కదా! ఈ నేపథ్యంలోనే.. ఈవీ బ్యాటరీలను ఉత్పత్తు చేస్తూ, భవిష్యత్తులో మల్టీబ్యాగర్​ రిటర్నులు ఇచ్చే అవకాశాలు ఉన్న కొన్ని సంస్థల గురించి ఇప్పుడు తెలుసుకుందాము..

ఎక్సైడ్​ ఇండస్ట్రీస్​..

బ్యాటరీ రంగంలో 75ఏళ్లుగా మార్కెట్​ లీడర్​గా కొనసాగుతోంది ఈ సంస్థ. దేశంలో అతిపెద్ద లెడ్​ బ్యాటరీ మేన్యుఫ్యాక్చరర్​గా గుర్తింపు తెచ్చుకుంది. పరిశ్రమలు, ఆటో రంగానికి వివిధ ఉత్పత్తులను అందిస్తుంది.

Exide stock price : టాటా మోటార్స్​, మారుతీ, బజాజ్​ ఆటో వంటి దిగ్గజ ఆటో సంస్థలు ఎక్సైడ్​కు కస్టమర్లుగా ఉండటం విశేషం. ఫలితంగా ఆటోమోటివ్​ వాల్యూ చెయిన్​ ఈ సంస్థకు బలంగా ఉంది.

ఎగుమతుల్లో కూడా ఎక్సైడ్​ దూసుకెళుతోంది. జీసీసీ దేశాలు, అమెరికా, కెనడాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది ఈ సంస్థ. 2022 మార్చ్​తో ముగిసిన ఆర్థిక ఏడాద గణాంకల ప్రకారం.. ఈ సంస్థ ఆదాయంలో 9శాతం వాటా ఎగుమతులదే.

ఇక ఇప్పుడు ఈవీ రంగంలోనూ ఎక్సైడ్​ దూసుకెళుతోంది. హై క్వాలిటీ ఎనర్జీ స్టోరేజ్​ సెల్యూషన్స్​ ఇచ్చే అంతర్జాతీయ దిగ్గజ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకుంది. లిథియం- ఐఏయాన్​ బ్యాటరీలు ఉత్పత్తి చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇక దిగ్గజ ఆటో సంస్థలన్నీ కస్టమర్లుగా ఉండటంతో ఈవీ సెగ్మెంట్​లో ఎక్సైడ్​కు కలిసి వస్తుంది.

అయితే.. ఈ సంస్థ సేల్స్​, నెట్​ ప్రాఫిట్​ పెద్దగా వృద్ధిచెందలేదు. 4ఏళ్ల సీఏజీఆర్​ 0.5, 0.1శాతంగా ఉన్నాయి.

అమర రాజా బ్యాటరీస్​..

దేశంలో లెడ్​ బ్యాటరీ ఉత్పత్తులు చేస్తున్న రెండో అతిపెద్ద సంస్థ అమర రాజా బ్యాటరీస్​. ఆటోమోటివ్​ నుంచి పరిశ్రమల వరకు.. అమరాన్​ బ్రాండ్​తో లెడ్​ బ్యాటరీలను సప్లై చేస్తుంది ఈ సంస్థ.

Amara Raja stock price : ఈవీ సెగ్మెంట్​తో లబ్ధిపొందేందుకు అమర రాజా కూడా ప్రణాళికలు రచించింది. లిథియం- ఐయాన్​ బ్యాటరీలను అభివృద్ధి చేసేందుకు.. ఓ టెక్నాలజీ హబ్​ను ఆంధ్రప్రదేశ్​లో ఏర్పాటు చేసింది.

సంస్థ సేల్స్​ 4ఏళ్ల సీఏజీఆర్​ 10.3శాతం పెరిగింది. నెట్​ ప్రాఫిట్​.. 4ఏళ్ల సీఏజీఆర్​ 1.2శాతం వృద్ధి చెందింది.

కాబ్రా ఎక్స్​ట్రూషియాన్​టెక్నిక్​..

ప్లాస్టిక్​ ఎక్స్​ట్రూషన్​ మెషినరీని తయారు చేయడంలో ఈ సంస్థ మార్కెట్​ లీడర్​గా కొనసాగుతంద. ఆస్ట్రాల్​ పాలిటెక్నిక్​, సుప్రీం ఇండస్ట్రీస్​, ఫినోలెక్స్​ ఇండస్ట్రీస్​ వంటి సంస్థలు కస్టమర్లుగా ఉన్నాయి.

Kabra Extrusiontechnik : బాట్రిక్స్​ బ్రాండ్​ పేరుతో ఈ సంస్థకు ఈవీ బ్యాటరీ బిజినెస్​ కూడా ఉంది. అడ్వాన్స్​డ్​ లిథియం- ఐయాన్​ బ్యాటరీని ఈ సంస్థ తయారు చేస్తుంది. అయితే.. ఇది కొత్త విభాగం, ఇంకా లాభాల్లోకి రాలేదు.

కంపెనీ ఆదాయం 4ఏళ్ల సీఏజీఆర్​ 11.5శాతంగా ఉంది. నెట్​ ప్రాఫిట్​.. 4ఏళ్ల సీఏజీఆర్​10.8శాతం వృద్ధిచెందింది.

మారుతీ..

మారుతీ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. కాగా.. ఈ ఆటో సంస్థ ఇప్పుడు ఈవీ బ్యాటరీల ఉత్పత్తి రంగంలోకి కూడా ప్రవేశిస్తోంది. గుజరాత్​లో 73బిలియన్లతో ఓ ప్లాంట్​ను నిర్మిస్తోంది.

మారుతీ మాతృసంస్థ సుజుకీ మోటార్​ కార్పొరేషన్​.. గుజరాత్​ ప్రభుత్వంతో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలోన గుజరాత్​లో ఈవీలు, ఈవీ బ్యాటరీలను ఉత్పత్తి చేసేందుకు సన్నద్ధమవుతోంది.

మారుతీ సేల్స్​ 4ఏళ్ల సీఏజీఆర్​ 3.3శాతంగా ఉంది. నెట్​ ప్రాఫిట్​ మాత్రం 16.7శాతం తగ్గింది.

భారత్​ ఎలక్ట్రానిక్స్​..

BEL stock price : ప్రభుత్వ ఆధారిత భారత్​ ఎలక్ట్రానిక్స్​ సంస్థ.. రక్షణశాఖ కింద పనిచేస్తుంది. ఎయిరోస్పెస్​, డిఫెన్స్​ పరికరాలను ఇది తయారు చేస్తుంది. అయితే.. ఈవీ బ్యాటరీ ఉత్పత్తి రంగంలోకి అడుగుపెట్టనున్నట్టు ఇటీవలే ప్రకటించిది భారత్​ ఎలక్ట్రానిక్స్​.

అమెరికాలోని ట్రిటాన్​ ఎలక్ట్రిక్​ వెహికిల్​ నుంచి భారత్​ ఎలక్ట్రానిక్స్​కు లెటర్​ ఆఫ్​ ఇంటెంట్​ అందింది. 80బిలియన్​ వాల్యూ ఉన్న ఈవీ బ్యాటరీల సప్లై గురించి ఇందులో ఉంది. పుణెలోని పరిశ్రమలో తయారు చేస్తారు.

ఈ ఒక్క ఆర్డర్​తో.. సంస్థ ఆదాయం 30-40శాతం పెరుగుతుందని అంచనాలు ఉన్నాయి.

భారత్​ ఎలక్ట్రానిక్స్​ ఆదాయం 4ఏళ్ల సీఏజీఆర్​ 10.5శాతం వృద్ధిచెందింది. లాఫాలు 13.7శాతం పెరిగాయి.

ప్రస్తుతం.. ఈవీ సెగ్మెంట్​లో ఇండియా ప్రారంభ దశలోనే ఉంది. అందువల్ల ఈవీ సెగ్మెంట్​, ఈవీ బ్యాటరీలో మంచి అవకాశాలు ఉంటాయని మార్కెట్​ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

(గమనిక: ఇవి కేవలం నిపుణులు అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్​లో పెట్టుబడి పెట్టే ముందు మీ ఫైనాన్షియల్​ ఎడ్వైజర్​ను సంప్రదించడం శ్రేయస్కరం.)

తదుపరి వ్యాసం