తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Multibagger Bharat Electronics: మరో మల్టీ బ్యాగర్ Bharat Electronics (Bel)

Multibagger Bharat Electronics: మరో మల్టీ బ్యాగర్ Bharat Electronics (BEL)

HT Telugu Desk HT Telugu

28 October 2022, 20:13 IST

  • Multibagger Bharat Electronics: ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ ఇన్వెస్టర్ల పాలిట మరో మల్టీ బ్యాగర్ గా మారింది. ఈ సంస్థ స్టాక్ విలువ గత రెండేళ్లలో మూడున్నర రెట్లకు పైగా పెరిగింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Multibagger Bharat Electronics: భారత రక్షణ రంగ ఉత్పత్తుల సంస్థ బీఈఎల్ షేర్ విలువ గత రెండేళ్లలో మూడున్నర రెట్లు పెరిగింది. అంతేకాదు, షేరు హోల్డర్లకు ఊహించిన మొత్తంలో డివిడెంట్లను ప్రకటించడంలో BEL ముందుంది. ప్రస్తుతం ఈ సంస్థ ఇన్వెస్టర్లకు 4.27% డివిడెండ్ ఇస్తోంది.

Multibagger Bharat Electronics: గత మూడు రోజులుగా..

షేరు మార్కెట్ లో గత మూడు రోజులుగా BEL షేర్ల ర్యాలీ సాగుతోంది. అక్టోబర్ 24 నుంచి 27 మధ్య ఈ షేరు విలువ 4% కన్నా ఎక్కువ పెరిగింది. దాంతో, శుక్రవారం పెద్ద ఎత్తున ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. Q2 ఫలితాల్లోనూ BEL నికర లాభాల్లో మంచి ఫలితాలను ప్రకటించింది. అయితే, పెద్ద ఎత్తున ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో శుక్రవారం BEL షేరు విలువ 2.32 శాతం తగ్గి, రూ. 105.35 వద్ద నిలిచింది. ప్రస్తుతం BEL సంస్థ మార్కెట్ విలువ రూ. 77008.52 కోట్లు.

Multibagger Bharat Electronics: డివిడెండ్ స్పెషలిస్ట్

ఇన్వెస్టర్లకు పెద్ద మొత్తంలో డివిడెండ్ ప్రకటించే సంస్థల్లో BEL ఒకటి. ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే ఈ సంస్థ మొత్తం 450% డివిడెండ్ ప్రకటించింది. అంటే ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 4.5 వరకు డివిడెండ్ చెల్లించింది. BEL షేరు విలువ కూడా గత రెండేళ్లలో 258.5% పెరిగింది. 2020 అక్టోబర్ 28, 2020న BEL షేరు ధర సుమారు రూ. 29 గా ఉంది.

Multibagger Bharat Electronics: Q2 ఫలితాలు

BEL సంస్థ Q2 ఫలితాలను ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(Q2)లో రూ. 614.83 కోట్ల నికర లాభాలను సంస్థ ఆర్జించింది. ఈ Q1 లో ఇది రూ. 356.13 కోట్లు మాత్రమే.